Mega Heroes: మెగా డిజాస్ట‌ర్స్ - ఐదు నెల‌ల్లో నాలుగు ఫ్లాపులిచ్చిన‌ మెగా హీరోలు - వంద కోట్లు లాస్‌-bro to aadikeshava four back to back flops for mega heroes 100 crore loss ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Mega Heroes: మెగా డిజాస్ట‌ర్స్ - ఐదు నెల‌ల్లో నాలుగు ఫ్లాపులిచ్చిన‌ మెగా హీరోలు - వంద కోట్లు లాస్‌

Mega Heroes: మెగా డిజాస్ట‌ర్స్ - ఐదు నెల‌ల్లో నాలుగు ఫ్లాపులిచ్చిన‌ మెగా హీరోలు - వంద కోట్లు లాస్‌

Nelki Naresh Kumar HT Telugu
Nov 30, 2023 05:53 AM IST

Mega Heroes: బ్యాక్ టూ బ్యాక్ డిజాస్ట‌ర్స్‌తో మెగా హీరోలు ఫ్యాన్స్‌ను దారుణంగా డిస‌పాయింట్ చేస్తున్నారు. బ్రో నుంచి ఇటీవ‌ల రిలీజైన ఆదికేశ‌వ వ‌ర‌కు ఐదు నెల‌ల్లో మెగా హీరోలు న‌టించిన నాలుగు సినిమాలు ఫ్లాప‌య్యాయి. ఈ సినిమాల‌న్నీ క‌లిపి వంద కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చాయి.

చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్
చిరంజీవి, పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్

Mega Heroes: మెగా హీరోల‌కు బ్యాడ్‌టైమ్ న‌డుస్తోంది. ఐదు నెల‌ల్లో మెగా హీరోలు న‌టించిన నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్స్‌గా నిలిచాయి. బ్యాక్ టూ బ్యాక్ ఫ్లాప్‌ల‌తో ఫ్యాన్స్‌ను డిస‌పాయింట్ చేశారు. బ్రో నుంచి ఇటీవ‌ల రిలీజైన ఆదికేశ‌వ వ‌ర‌కు మెగా హీరోలు సినిమాలు దాదాపు వంద కోట్ల మేర‌ న‌ష్టాల‌ను మిగిల్చాయి.

అంచ‌నాల్ని అందుకోలేని బ్రో...

ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, సాయిధ‌ర‌మ్‌తేజ్ కాంబినేష‌న్‌లో రూపొందిన బ్రో మూవీ జూలై 28న ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. త‌మిళంలో విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల్ని అందుకున్న వినోద‌య‌సిత్తం ఆధారంగా తెర‌కెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందు భారీగా అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి. ప‌వ‌న్ ఇమేజ్‌కు త‌గ్గ క‌థ కాక‌పోవ‌డంతో బ్రో క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. 90 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో రిలీజైన బ్రో మూవీ థియేట్రిక‌ల్ ర‌న్‌లో కేవ‌లం 60 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. 30 కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

యాభై కోట్ల న‌ష్టం...

బ్రో ఫ్లాప్‌ను మ‌రువ‌క ముందే భోళాశంక‌ర్‌తో మెగా ఫ్యాన్స్‌కు పెద్ద షాకే త‌గిలింది. ఆగ‌స్ట్‌ 11న రిలీజైన చిరంజీవి భోళాశంక‌ర్ ఈ ఇయ‌ర్‌లోనే బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్స్‌లో ఒక‌టిగా నిలిచింది. మెహ‌ర్ ర‌మేష్ ద‌ర్శ‌క‌త్వంలో అన్నాచెల్లెళ్ల అనుబంధం నేప‌థ్యంలో తెర‌కెక్కిన ఈ సినిమా అవుట్‌డేటెడ్ కాన్సెప్ట్ కార‌ణంగా ప్రేక్ష‌కుల తిర‌స్కారానికి గురైంది. మెగా స్టార్ క్రేజ్ కార‌ణంగా భోళాశంక‌ర్‌ ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగానే జ‌రిగింది. దాదాపు 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ రిలీజైన 30 కోట్ల లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. యాభై కోట్ల వ‌ర‌కు న‌ష్టాల‌ను మిగిల్చింది.

రెండు కోట్లు మాత్ర‌మే...

అదే నెల‌లో రిలీజైన వ‌రుణ్‌తేజ్ గాండీవ‌ధారి అర్జున కూడా భోళాశంక‌ర్ రూట్‌లోనే బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టింది. స్పై యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన ఈ మూవీ రెండు కోట్ల లోపే క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి వ‌రుణ్‌తేజ్‌కు పీడ‌క‌ల‌ను మిగిల్చింది.

ఇటీవ‌ల రిలీజైన వైష్ణ‌వ్‌తేజ్ ఆదికేశ‌వ కూడా మెగా ఫ్లాప్‌లా లిస్ట్‌లో దాదాపు చేరిపోయింది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమా తొలిరోజు నుంచే నెగెటివ్ టాక్‌ను మూట‌గ‌ట్టుకుంది. ఐదు రోజుల్లో ఈ సినిమా రెండు కోట్ల ఇర‌వై ల‌క్ష‌ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. ఆదికేశవ‌ లాభాల్లోకి అడుగుపెట్టాలంటే మ‌రో ఏడు కోట్ల‌కుపైగా వ‌సూళ్ల రావాల్సివుంది. దాదాపు అది అసాధ్యంగానే క‌నిపిస్తోంది. ఆదికేశ‌వ కూడా నిర్మాత‌ల‌కు ఐదు కోట్ల‌కుపైనే న‌ష్టాల‌ను మిగిల్చే అవ‌కాశాలు క‌నిపిస్తోన్నాయి.

Whats_app_banner