Brahmamudi May 29th Episode: రుద్రాణి వలలో పడ్డ అపర్ణ - రాజ్‌తో మాయ పెళ్లి ఫిక్స్ - భ‌ర్త‌పై కావ్య అల‌క-brahmamudi may 29th episode rudrani evil plan to takeover raj and kavya assets ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Brahmamudi May 29th Episode: రుద్రాణి వలలో పడ్డ అపర్ణ - రాజ్‌తో మాయ పెళ్లి ఫిక్స్ - భ‌ర్త‌పై కావ్య అల‌క

Brahmamudi May 29th Episode: రుద్రాణి వలలో పడ్డ అపర్ణ - రాజ్‌తో మాయ పెళ్లి ఫిక్స్ - భ‌ర్త‌పై కావ్య అల‌క

Nelki Naresh Kumar HT Telugu
May 29, 2024 07:28 AM IST

Brahmamudi May 29th Episode: నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌లో క‌న్న త‌ల్లి మాయ ఉండ‌గా...రాజ్ బిడ్డ‌ బాగోగుల్ని కావ్య చూసుకోవ‌డం స్వ‌ప్న స‌హించ‌లేక‌పోతుంది. కావ్య‌కు క్లాస్ ఇస్తుంది. ఆ బిడ్డ తీసుకెళ్లి త‌ల్లి మాయ‌కు అప్ప‌గిస్తుంది.

బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌
బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్‌

Brahmamudi May 29th Episode: కావ్య‌ను ఇంట్లో నుంచి ఎలాగైనా పంపించాల‌ని రుద్రాణి ఫిక్స‌వుతుంది. రాజ్‌, మాయ పెళ్లి జ‌రిగితేనే కావ్య అడ్డు తొల‌గిపోతుంద‌ని అనుకుంటుంది. అప్పుడే కావ్య త‌నంత‌ట తానుగా ఇంట్లో నుంచి వెళ్లిపోతుంద‌ని రాహుల్‌తో అంటుంది రుద్రాణి. మాయ‌తో రాజ్‌కు పెళ్లి జ‌రిగితే ఆమె పెట్టే టార్చ‌ర్‌ను భ‌రించ‌లేక రాజ్ ఆఫీస్‌కు దూర‌మై కుమిలికుమిలి ఏడ్చేలా ప్లాన్ వేస్తుంది.

త‌న ప్లాన్ స‌క్సెస్ అయితే దుగ్గిరాల ఇంటి స‌ర్వాధికారాలు త‌న‌ సొంతం అవుతాయ‌ని రుద్రాణి అంటుంది. ఇంట్లో వాళ్ల‌ను త‌న గుప్పిట్లోకి తెచ్చుకొని బానిస‌లుగా చేసుకుంటాన‌ని ఆడిస్తాన‌ని కొడుకుతో చెబుతుంది రుద్రాణి. అదే జ‌రిగితే ఆఫీస్ కూడా త‌న చేతుల్లోకి రావ‌డం ఖాయ‌మ‌ని రాహుల్ సంబ‌ర‌ప‌డ‌తాడు.

రుద్రాణి వేసిన ప్లాన్ చూసి రాహుల్ షాక‌వుతాడు. త‌ల్లి కాబ‌ట్టి స‌రిపోయింది అదే రుద్రాణికి తాను శ‌త్రువుగా పుట్టి ఉంటే ఆమె వేసిన ప్లాన్‌ల‌కు అల్లాడిపోయేవాడిన‌ని భ‌య‌ప‌డిపోతాడు.

అంధకారంలో కావ్య జీవితం...

అప్పుకు ఫోన్ చేస్తుంది కావ్య‌. మాయ‌కు, రాజ్‌కు అప‌ర్ణ పెళ్లిచేయ‌బోతున్న సంగ‌తి చెబుతుంది. కొడుకు సంతోషం కోస‌మే అప‌ర్ణ ఆలోచిస్తుంద‌ని అంటూ త‌న‌కు అన్యాయం చేయ‌బోతున్న అప‌ర్ణ‌ను స‌పోర్ట్ చేసి కావ్య మాట్లాడుతుంది. కావ్య మంచిత‌నాన్ని అప్పు స‌హించ‌లేక‌పోతుంది. కొడుకు సంతోషం కోసం కోడ‌లు జీవితం నాశ‌న‌మైనా ఆమెకు ప‌ర్వాలేదా అంటూ అప‌ర్ణ‌పై ఫైర్ అవుతుంది.

మాయ అడ్రెస్‌...

రాజ్‌, మాయ‌ల పెళ్లిని జ‌రిపించేలోపు నిజ‌మైన మాయ అడ్ర‌స్‌ను క‌నిపెడితే అన్ని స‌మ‌స్య‌లు తీరిపోతాయ‌ని అప్పుతో అంటుంది కావ్య‌. కానీ అది అనుకున్నంత సింపుల్ కాద‌ని అప్పు బ‌దులిస్తుంది. మ‌రోసారి బ‌స్తీలో ఎంక్వైరీ చేస్తే ఎవ‌రో ఒక‌రు నిజ‌మైన మాయ గురించి చెప్పే అవ‌కాశం ఉంటుంద‌ని అప్పుతో అంటుంది కావ్య‌.

త‌న‌కు ఈ దారి త‌ప్ప మ‌రో మార్గం లేద‌ని కావ్య కంగారు ప‌డుతుంది. త‌న చుట్టూ చీక‌టి అలుముకుపోయింద‌ని, ఎటు వెళ్లాలో తెలియ‌డం లేద‌ని కంగారు ప‌డుతుంది. కావ్య మాట‌ల‌తో అప్పు క‌న్వీన్స్ అవుతుంది. మాయ గురించి ఎంక్వైరీ చేసి ఏ చిన్న క్లూ దొరికిన చెబుతాన‌ని అంటుంది.

అప‌ర్ణ‌ను బుట్ట‌లో వేసుకున్న రుద్రాణి...

అప‌ర్ణ‌ను రెచ్చ‌గొట్టి రాజ్‌, మాయ‌ల పెళ్లి చేయాల‌ని రుద్రాణి ప్లాన్ చేస్తుంది. ఆ ప్లాన్‌ను ఇంప్లిమెంట్ చేయ‌డం మొద‌లుపెడుతుంది. కావ్య‌కు విడాకులు ఇవ్వాల‌నే నీ నిర్ణ‌యాన్ని ఇంట్లో వాళ్లు వ్య‌తిరేకించార‌ని బాధ‌ప‌డుతున్నావా అంటూ అప‌ర్ణ‌ను ఓదార్చిన‌ట్లు మాట్లాడుతుంది రుద్రాణి. విడాకుల గురించి తాను ఆలోచించ‌డం లేద‌ని రుద్రాణికి బ‌దులిస్తుంది అప‌ర్ణ‌.

రాజ్‌, మాయ‌ల పెళ్లిని జ‌రిపించాల‌ని ప్ర‌య‌త్నిస్తే...కావ్య‌తో పాటు ఆమె ఇంట్లో వాళ్లు ఎక్క‌డ అడ్డుప‌డ‌తారోన‌ని ఆలోచిస్తున్న‌ట్లు అప‌ర్ణ చెబుతుంది. రాజ్‌, మాయ‌ల పెళ్లికి కావ్య అడ్డుప‌డ‌కుండా నో అబ్జ‌క్ష‌న్ స‌ర్టిఫికెట్‌ను అప‌ర్ణ‌కు ఇస్తుంది రుద్రాణి.

ఆస్తి కోస‌మే కావ్య నాట‌కం...

రాజ్‌, మాయ‌ల పెళ్లికి నాకు ఎలాంటి అభ్యంత‌రం లేద‌ని కావ్య సంత‌కం చేసి ఇస్తే అప్పుడు నీ కొడుకు పెళ్లికి ఎవ‌రు అడ్డుచెప్ప‌రు అని అప‌ర్ణ‌కు స‌ల‌హా ఇస్తుంది రుద్రాణి. కావ్య‌కు ఆస్తిపై త‌ప్ప భ‌ర్త‌తో కాపురం చేయ‌డం ఇష్టం లేద‌ని చాడీలు చెబుతుంది రుద్రాణి. ఈ నో అబ్జ‌క్ష‌న్ పేప‌ర్స్‌ఫై కావ్య సంత‌కం చేస్తుంద‌నే న‌మ్మ‌కం త‌న‌కు లేద‌ని అప‌ర్ణ అంటుంది.

ఓ సారి ప్ర‌య‌త్నిస్తేనే క‌దా ఆమె సంత‌కం చేస్తుందో లేదో అన్న‌ది తెలుస్తుంద‌ని అప‌ర్ణ‌ను క‌న్వీన్స్ చేస్తుంది రుద్రాణి. ఒక‌వేళ కావ్య సంత‌కం చేస్తే ఆమె నిజ‌స్వ‌రూపం మొత్తం తెలుస్తుంద‌ని, ఆస్తి కోస‌మే కావ్య‌, స్వ‌ప్న ఈ ఇంటి కోడ‌ళ్లుగా వ‌చ్చార‌ని, అప్పు కూడా డ‌బ్బు కోస‌మే క‌ళ్యాణ్‌ను ప్రేమించింద‌ని రుద్రాణి నోటికి వ‌చ్చిన అబ‌ద్ధం ఆడుతుంది

కావ్య‌కు స్వ‌ప్న క్లాస్‌...

రాజ్ బిడ్డ‌ను ఎత్తుకొని కావ్య ఆడిస్తుంటుంది. ఆ సీన్ చూసి స్వ‌ప్న స‌హించ‌లేక‌పోతుంది. బిడ్డ‌ను క‌న్న త‌ల్లి ఉండ‌గా నువ్వెందుకు వీడి భారాన్ని మోయడం అంటూ కావ్య‌పై స్వప్న ఫైర్ అవుతుంది. మాయ ఆ బిడ్డ‌కు నిజ‌మైన త‌ల్లి కాద‌ని స్వ‌ప్న‌కు చెప్ప‌లేక‌పోతుంది కావ్య‌. త‌న‌లో తానే మద‌న‌ప‌డుతుంది. నీ చేతుల‌తో నువ్వు ఈ బిడ్డ‌ను మాయ‌కు ఇవ్వ‌లేవు కానీ...నేనే నీ స‌వ‌తికి చిన్నారికి ఇస్తాన‌ని చిన్నారిని కావ్య చేతుల‌లో నుంచి స్వ‌ప్న తీసుకుంటుంది.

స్వ‌ప్న సెటైర్స్‌...

రుద్రాణి, మాయ రూమ్‌లో కూర్చొని సీక్రెట్‌గా మాట్లాడుకుంటుంటారు. వారి ద‌గ్గ‌ర‌కు వ‌చ్చి ఈ ఇంట్లో గ‌డ్డి తినే మ‌నుషులు మీరే క‌దా అంటూ ఇద్ద‌రిపై స్వ‌ప్న సెటైర్స్ వేస్తుంది. ఆ త‌ర్వాత నువ్వు అస‌లు ఆడ‌దానివేనా...ఈ బిడ్డ‌ను నువ్వే క‌న్నావా అంటూ మాయ‌పై ఫైర్ అవుతుంది స్వ‌ప్న‌.

వీడిని కావ్య‌కు అప్పగించి నువ్వు హాయిగా నిద్ర‌పోతున్నావా...ఇక‌పై అలాంటివి కుద‌ర‌వు. ఈ రోజు నుంచి బిడ్డ బాధ్య‌త నీదే అని మాయ‌కు వార్నింగ్ ఇస్తుంది స్వ‌ప్న. చిన్నారిని మాయ‌కు అప్ప‌గించి వెళ్లిపోతుంది. ఆ బిడ్డ బాధ్య‌త త‌న‌పై ప‌డ‌టంతో మాయ గింజుకుంటుంది.

చిన్నారిని పెంచ‌డం త‌న‌కు రాద‌ని రుద్రాణితో అంటుంది మాయ‌. మ‌న నాట‌కం స‌క్సెస్ కావాలంటే కొన్నాళ్లు ఈ క‌ష్టాన్ని భ‌రించ‌క త‌ప్ప‌ద‌ని మాయ‌తో చెబుతుంది రుద్రాణి. అప్ప‌టివ‌ర‌కు నువ్వే వాడి త‌ల్లివి అని అంటుంది.

కావ్య‌పై నోరు జారిన రాజ్‌...

బాబు లేకుండా ఒంట‌రిగా కావ్య రూమ్‌లోకి రావ‌డం చూసి ఆమెపై రాజ్ ఫైర్ అవుతాడు. బాబును మాయ ద‌గ్గ‌రకు పంపించిన విష‌యం తెలిసి ఎగిరిప‌డ‌తాడు. బాబు పీడ వ‌దిలింద‌ని అనుకుంటున్నావా...ఇక నుంచి ప్ర‌శాంతంగా నిద్ర‌పోవాల‌ని అనుకుంటున్నావా అంటూ కోప్ప‌డ‌తాడు.

తాను మాయ‌కు బాబును ఇవ్వ‌లేద‌ని, అస‌లు త‌ల్లి ఉండ‌గా...నువ్వెందుకు బాబు బాగోగులు చూడం అంటూ స్వ‌ప్న‌నే బాబును తీసుకెళ్లి మాయ‌కు ఇచ్చింద‌ని కావ్య అంటుంది. తాను నిజం చెప్ప‌లేక‌పోయాన‌ని రాజ్‌తో చెబుతుంది.రాజ్ త‌న‌పై ఫైర్ కావ‌డం కావ్య స‌హించ‌లేక‌పోతుంది.

అలిగిన కావ్య‌...

నిజం మీరు చెప్ప‌రు. నేను చెబ‌తానంటే ఒప్పుకోరు. పోనీ బాబును నా ద‌గ్గ‌ర‌కు తీసుకొస్తానంటే స్వ‌ప్న అంగీక‌రించ‌దు. మాట‌లు అన‌డానికి అంద‌రికి నేను ఒక్క‌దానినే దొరుకుతాను అంటూ కావ్య అలుగుతుంది.

కావ్య‌ను బుజ్జ‌గించ‌డం మొద‌లుపెడ‌తాడు రాజ్‌. బాబు ఏడుస్తాడేమోన‌ని కావ్య‌తో అంటాడు రాజ్‌. మాయ‌తో పాటు రుద్రాణి చిన్నారిని చూడ‌టానికి చిరాకుప‌డ‌తార‌ని రాజ్ అనుమాన‌ప‌డ‌తారు. డ‌బ్బు కోసం న‌టించ‌డానికి వ‌చ్చిన‌వాళ్లు చిరాకును భ‌రిస్తార‌ని కావ్య స‌ర్ధిచెబుతుంది.

రాజ్‌కు కావ్య స‌ల‌హా...

కావ్య ఎంత చెప్పిన రాజ్ విన‌డు. బిడ్డ‌ను తీసుకువ‌స్తాన‌ని మాయ రూమ్‌కు వెళ్ల‌బోతాడు. మీరు మాయ రూమ్‌కు వెళితే మీరే చిక్కుల్లో ప‌డ‌తార‌ని భ‌ర్త‌తో అంటుంది కావ్య‌. బిడ్డ కోసం కాకుండా మాయ‌ను క‌ల‌వ‌డానికే మీరు ఆ రూమ్‌కు వెళ్లార‌ని అంద‌రూ అపోహ‌ప‌డ‌తారు.

రుద్రాణి గోల చేసి అదే నిజ‌మ‌ని అంద‌రిని న‌మ్మిస్తుంద‌ని రాజ్‌తో అంటుంది కావ్య‌. బిడ్డ‌కు త‌ల్లిని అని అబ‌ద్ధం ఆడుతోన్న‌ మాయ‌కు త‌ల్లి బాధ్య‌త‌లు తెలియాలంటే ఆ చిన్నారి ఆమె ద‌గ్గ‌ర ఉండ‌ట‌మే క‌రెక్ట్ అని రాజ్‌తో చెబుతుంది కావ్య‌. ఆమె మాట‌ల‌కు రాజ్ క‌న్వీన్స్ అవుతాడు. అక్క‌డితో నేటి బ్ర‌హ్మ‌ముడి సీరియ‌ల్ ముగిసింది.

టీ20 వరల్డ్ కప్ 2024