Photo Puzzle: ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టగలరా? ఇద్దరిదీ ఒకే క్లాస్-bollywood star heroes hrithik roshan john abraham school pic gone viral hrithik roshan childhood movies ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Photo Puzzle: ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టగలరా? ఇద్దరిదీ ఒకే క్లాస్

Photo Puzzle: ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టగలరా? ఇద్దరిదీ ఒకే క్లాస్

Hari Prasad S HT Telugu
May 08, 2024 11:19 AM IST

Photo Puzzle: ఇద్దరు బాలీవుడ్ హీరోలు ఒకే స్కూల్, ఒకే క్లాస్ లో చదివారు. తాజాగా బయటకు వచ్చిన వాళ్ల ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇంతకీ అందులో ఉన్న ఆ ఇద్దరు హీరోలు ఎవరో తెలుసా?

ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టగలరా? ఇద్దరిదీ ఒకే క్లాస్
ఈ ఫొటోలో ఉన్న ఇద్దరు బాలీవుడ్ స్టార్ హీరోలను గుర్తుపట్టగలరా? ఇద్దరిదీ ఒకే క్లాస్

Photo Puzzle: బాలీవుడ్ కు చెందిన ఇద్దరు హీరోలు పైన ఉన్న ఫొటోలో ఉన్నారు. వాళ్లను మీరు గుర్తు పట్టారా? ఈ ఇద్దరూ ఇప్పుడు హిందీ సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోలు. ఒకప్పుడు ఒకే స్కూల్లో, ఒకే క్లాస్ లో చదువుకున్నారు. తాజాగా బయటపడిన ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో ఆ హీరోలను గుర్తు పట్టడానికి ఫ్యాన్స్ ప్రయత్నిస్తున్నారు.

ఆ బాలీవుడ్ హీరోలు వీళ్లే

పై ఫొటోలో ఉన్న బాలీవుడ్ హీరోలు ఎవరో తెలుసా? హృతిక్ రోషన్, జాన్ అబ్రహం. కింది వరసలో చివరన ఉన్న వ్యక్తి జాన్ అబ్రహం కాగా.. పైవరుసలో ఉన్న వ్యక్తి హృతిక్ రోషన్. యశ్ రాజ్ ఫిల్మ్స్ కు చెందిన ధూమ్ సిరీస్ లో ఈ ఇద్దరూ వేర్వేరుగా నటించారు. ధూమ్ 1లో జాన్ అబ్రహం విలన్ కాగా.. ధూమ్ 2లో హృతిక్ రోషన్ విలన్ పాత్ర పోషించాడు.

సినిమాల్లో ఎప్పుడూ ఈ ఇద్దరూ కలిసి నటించకపోయినా.. ఇలా స్కూల్ ఫొటోలో మాత్రం కలిసి ఉన్నారు. ఈ ఇద్దరూ ముంబైలోని బాంబే స్కాటిష్ స్కూల్లో చదువుకున్నారు. స్టార్ హీరోల స్కూల్ డేస్ ఫొటోలు బయటకు వస్తే ఫ్యాన్స్ ఊరుకుంటారా? ఈ ఫొటోను కూడా అలాగే వైరల్ గా మార్చేశారు. స్కూల్ యూనిఫాంలో ఉన్న హృతిక్, జాన్ అబ్రహంలను చూడండి అంటూ సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు.

వాళ్లు ఒకే క్లాస్‌లో చదివారా?

హృతిక్ రోషన్, జాన్ అబ్రహం బాలీవుడ్ లో ఎంత పేరు సంపాదించినా.. ఇప్పటి వరకూ తాము బ్యాచ్ మేట్స్ అన్న విషయం ఎప్పుడూ బయటపెట్టలేదు. దీంతో ఈ ఫొటో చూసి ఈ ఇద్దరూ ఒకే క్లాస్ లో చదివారా అంటూ ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడీ ఇద్దరూ కలిసి ఓ పూర్తి స్థాయి సినిమాలో కలిసి నటించాలని వాళ్లు కోరుకుంటున్నారు.

స్పై యూనివర్స్ (ధూమ్, ధూమ్ 2)లో చేరే ముందు జిమ్, కబీర్ ఇలా అంటూ ఆ సినిమాల్లో వాళ్ల పాత్రల పేర్లతో ఓ యూజర్ కామెంట్ చేశారు. బాలీవుడ్ లో ధూమ్ ఫ్రాంఛైజీ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. ఇప్పటికే మూడు సినిమాలు రాగా.. విలన్లు మారినా వాళ్లను పట్టుకునే పోలీసు పాత్రలో అభిషేక్ బచ్చనే నటించాడు.

2004లో వచ్చిన ధూమ్ మూవీలో కబీర్ అనే విలన్ పాత్రలో జాన్ అబ్రహం కనిపించాడు. ఇక 2006లో వచ్చిన ధూమ్ 2లో విలన్ పాత్రలో హృతిక్ నటించాడు. ఇక 2019లో వచ్చిన వార్ మూవీలోనూ హృతిక్ కబీర్ నే సూపర్ స్పై పాత్రలో కనిపించడం విశేషం. గతేడాది వచ్చిన పఠాన్ మూవీలో జిమ్ అనే స్పై పాత్రలో జాన్ అబ్రహం నటించాడు. ఈ ఇద్దరూ ఒకే ఫ్రాంఛైజీ మూవీల్లో నటించినా కలిసి నటించే అవకాశం మాత్రం రాలేదు.

ప్రస్తుతం హృతిక్ రోషన్ వార్ 2 మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. అయాన్ ముఖర్జీ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాలో మన యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత క్రిష్ 4లోనూ హృతిక్ నటించబోతున్నాడు. అటు జాన్ అబ్రహం అయితే వరుసగా వేదా, ది డిప్లొమాట్, టెహ్రాన్, తారిఖ్ సినిమాలతో బిజీగా ఉన్నాడు.