Actor In Kargil War: కార్గిల్ యుద్ధంలో పోరాడిన ఏకైక హీరో.. ఆ నటుడి గురించి ఎంత చెప్పిన తక్కువే!
Nana Patekar Fought In Kargil War 1999: కార్గిల్ 1999 యుద్ధంలో పోరాటం చేసిన ఏకైక సినీ హీరోగా నానా పటేకర్ గుర్తింపు పొందారు. పాకిస్థానీ సైనికులతో పోరాడుతున్న భారత జవాన్లకు రెండు వారాల పాటు సేవలు అందించారు బాలీవుడ్ పాపులర్ యాక్టర్ నానా పటేకర్.
Kargil War 1999 Importance: భారతీయులకు కార్గిల్ 1999 యుద్ధ విజయం ఎంతో ప్రాముఖ్యమైనది. ఈ కార్గిల్ యుద్ధంలో పాకిస్థానీ బలగాలను తరిమికొట్టి పాక్‌పై భారతదేశం సాధించిన విజయాన్ని గర్వంగా చెప్పుకుంటారు. జూలై 26 తేదిని భారతదేశంలో కార్గిల్ విజయ్ దివస్ పేరుతో సెలబ్రేట్ చేసుకుంటారు.
అయితే, ఈ కార్గిల్ యుద్థంలో ఎంతోమంది భారత సైనికులు పోరాడి ప్రాణాలు త్యాగం చేశారు. అలాంటి యుద్ధంలో ఓ భారతీయ నటుడు సైతం పాల్గొని పోరాడారు. కార్గిల్ యుద్ధ సమయంలో భారత సైనికులతో రెండు వారాల పాటు కలిసి జీవించారు. ఎలైట్ ఫోర్స్, క్విక్ రియాక్షన్ టీమ్ వంటి రెండు భాగాల్లో ఈ పాపులర్ హీరో సేవలు అందించారు.
అతను ఎవరో కాదు.. బాలీవుడ్ స్టార్ యాక్టర్ నానా పటేకర్. 1991లో ప్రహార్ సినిమాలో మేజర్ ప్రతాప్ చౌహాన్ పాత్రను అద్భుతంగా పోషించి ప్రశంసలు అందుకున్న నానా పటేకర్ 1999లో కార్గిల్ యుద్ధంలో పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్గిల్ యుద్ధంలో భారత సైన్యంతో రెండు వారాల పాటు పోరాడటమే కాకుండా ఒక పదవి నుంచి మరో పదవికి ఉన్నతంగా ఎదిగారు.
నానా పటేకర్ "అనధికారిక చీర్ లీడర్‌గా" వ్యవహరించి భారత దళాలకు స్ఫూర్తిని నింపారు. ఇలా ఏ నటుడు చేయని విధంగా కార్గిల్ యుద్ధంలో పాల్గొని విశేషంగా నిలిచిన నానా పటేకర్ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. కాగా ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో 1999 కార్గిల్ యుద్ధంలో తను పాల్గొన్న రోజులను గుర్తుచేసుకున్నారు నానా పటేకర్.
"చివరికి నేను క్విక్ రియాక్షన్ టీమ్‌లో సభ్యుడిని. ఇది అత్యంత ఉన్నత శక్తులలో ఒకటి. కనీసం ఇలా అయిన మనం దేశం కోసం సేవలందించాను" అని ఇంటర్వ్యూలో నానా పటెకర్ వెల్లడించారు. అలాగే వివిధ సందర్భాల్లో కూడా సాయుధ దళాలపై తన బలమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు నానా పటేకర్.
అలాగే సైనికులే దేశానికి నిజమైన హీరోలు. నటీనటులను పూజించవద్దని, వారి కోసం పోరాడే సైనికులే నిజమైన హీరోలని నానా పటేకర్ చెప్పారు. దేశ భద్రత కోసం తూటాలు పేల్చాలని, మన గొప్ప ఆయుధం బోఫోర్స్, ఏకే కాదు, మన జవాన్లు అని ప్రజలకు సూచించారు. ఇక 2016లో, బాలీవుడ్‌లో పని చేస్తున్న పాకిస్తానీ కళాకారులపై నిషేధం విధించబడిన నిర్ణయాన్ని నానా పటేకర్ సమర్థించారు.
"మొదట నా దేశం. నా దేశం దాటి నాకు ఎవరూ ఎక్కువ కాదు. నా దేశం ముందు ఒక కళాకారుడు చాలా చిన్నవాడు" అని నానా పటేకర్ అన్నారు. కాగా నానా పటేకర్ అసలు పేరు విశ్వనాథ్ పటేకర్. క్రాంతివర్ వంటి ఎన్నో హిట్ సినిమాల్లో హీరోగా చేసిన నానా పటేకర్ తర్వాతి కాలంలో యాక్టర్‌గా అద్భుతంగా రాణించారు.
తిరంగా, నట సామ్రాట్, పరిందా, ప్రహార్ ది ఫైనల్ అటాక్ వంటి సినిమాల్లో తన నటనతో ఎంతో ఆకట్టుకున్నారు. వెల్‌కమ్ వంటి చిత్రాల్లో కామెడీ కూడా పండించారు. ఇటీవల 2023లో ది వ్యాక్సిన్ వార్ మూవీలో కీలక పాత్ర పోషించారు నానా పటేకర్.