Horror Comedy OTT: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?-blockbuster horror comedy movie munjya to premier in tv before ott streaming disney plus hotstar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Horror Comedy Ott: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Horror Comedy OTT: ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu
Aug 19, 2024 05:10 PM IST

Horror Comedy OTT: ఓ బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ ఓటీటీలోకి కాకుండా నేరుగా టీవీ ప్రీమియర్ కు సిద్ధమవుతుండటం విశేషం. థియేటర్లలో వసూళ్ల వర్షం కురిపించిన ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్ ఎదురు చూస్తుంటే.. మూవీ మాత్రం నేరుగా టీవీ ప్రీమియర్ డేట్ కూడా అనౌన్స్ చేసి ఆశ్చర్యపరిచింది.

ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ
ఓటీటీ కంటే ముందే టీవీలోకి వస్తున్న బ్లాక్‌బస్టర్ హారర్ కామెడీ మూవీ

Horror Comedy OTT: ఈమధ్య కాలంలో వచ్చిన హారర్ కామెడీ మూవీస్ లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ గా నిలిచిన సినిమా ముంజ్యా. ఈ సినిమా థియేటర్లలో రిలీజై రెండున్నర నెలలు అవుతోంది. ఇప్పటి వరకూ ఓటీటీలోకి అడుగుపెట్టలేదు. ఈ మూవీ స్ట్రీమింగ్ ఎప్పుడు ఉంటుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు షాకిస్తూ.. ఈ సినిమా నేరుగా స్టార్ గోల్డ్ ఛానెల్లోకి రాబోతోంది.

ముంజ్యా టీవీ ప్రీమియర్ డేట్

మరాఠీ దర్శకుడు ఆదిత్య సర్పోదర్ డైరెక్ట్ చేసిన ముంజ్యా మూవీ పెద్దగా అంచనాలు లేకుండానే రిలీజై సంచలన విజయం సాధించింది. జూన్ 7 ప్రపంచవ్యాప్తంగా రిలీజైన ఈ మూవీ.. ఏకంగా రూ.132 కోట్లు వసూలు చేసింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ముంజ్యా.. మేకర్స్ పై లాభాల వర్షం కురిపించింది. అయితే ఈ సినిమా ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సొంతం చేసుకోగా.. స్ట్రీమింగ్ ఎప్పుడా అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు.

అయితే ఇప్పుడీ మూవీ వచ్చే శనివారం (ఆగస్ట్ 24) స్టార్ గోల్డ్ ఛానెల్లో టెలికాస్ట్ కానుండటం విశేషం. శర్వరీ వాఘ్, అభయ్ వర్మ, సత్యరాజ్, మోనా సింగ్ లాంటి వాళ్లు నటించిన ముంజ్యా మూవీ.. ఓటీటీ రిలీజ్ పై మాత్రం ఎలాంటి అప్డేట్ లేదు. ఇది ఒక రకంగా ఆశ్చర్యానికి గురి చేసేదే. సాధారణంగా ఇప్పుడు ఎలాంటి సినిమా అయినా మొదట ఓటీటీలోకే వస్తోంది.

అందులోనూ ముంజ్యాలాంటి హిట్ సినిమాలకైతే థియేటర్ల కంటే ఓటీటీలోనే ఎక్కువ రెస్పాన్స్ వస్తుంది. అయినా ఈ మూవీ ఓటీటీని కాదని నేరుగా టీవీలోకి వస్తుండటం మాత్రం అంతుబట్టనిదే.

ముంజ్యా మూవీ ఏంటి?

ముంజ్యా మూవీ ఓ హారర్ కామెడీ జానర్లో వచ్చింది. భారత పురాణాలు, జానపద సాహిత్యంలోని ముంజ్యా అనే ఓ అతీత శక్తి చుట్టూ తిరిగే కథ ఇది. మ్యాడక్ సూపర్ నేచురల్ యూనివర్స్ నుంచి వచ్చిన నాలుగో సినిమా ఇది. తన గర్ల్‌ఫ్రెండ్ తో కలిసి తన సొంతూరికి వెళ్లే ఓ యువకుడిని పెళ్లి కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న ముంజ్యా అనే అతీత శక్తి వశపరచుకుంటుంది.

తర్వాత జరిగి పరిణామాలు నవ్వులు పూయిస్తూనే భయపెడుతుంది. ఈ కాన్సెప్ట్ ఆడియెన్స్ కు బాగా నచ్చింది. రూ.132 కోట్లు వసూలు చేసి.. 2024లో అత్యధిక వసూళ్లు సాధించిన ఐదో హిందీ సినిమాగా నిలిచింది.

మహారాష్ట్రలోని కొంకణ్ ప్రాంతంలో జరిగిన స్టోరీగా దీనిని తెరకెక్కించారు. ముంజ్యా అనే ఓ వింత జీవి, అది బిట్టూ (అభయ్ వర్మ) జీవితంపై చూపించే ప్రభావం చుట్టూ ఈ కథ తిరుగుతుంది.

ఈ సినిమా మొత్తం పూర్తి మరాఠీ సంస్కృతి కనిపిస్తుంది. మాడక్ ఫిల్మ్స్ నుంచి ఇప్పటికే స్త్రీ, రూహి, భేడియాలాంటి హారర్ కామెడీ సినిమాలు రాగా.. ఇప్పుడు ముంజ్యా కూడా సంచలన విజయం సాధించింది.

Whats_app_banner