Biggest Superhero Flop Movie: సూపర్ హీరో మూవీల్లో పెద్ద ఫ్లాప్ ఇదే.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?-biggest superhero flop movie madame web sony pictures made huge losses with this female lead movie hollywood news ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Biggest Superhero Flop Movie: సూపర్ హీరో మూవీల్లో పెద్ద ఫ్లాప్ ఇదే.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

Biggest Superhero Flop Movie: సూపర్ హీరో మూవీల్లో పెద్ద ఫ్లాప్ ఇదే.. ఎన్ని కోట్ల నష్టమో తెలుసా?

Hari Prasad S HT Telugu
Feb 25, 2024 09:00 AM IST

Biggest Superhero Flop Movie: సూపర్ హీరో మూవీలు అంటే బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు సాధిస్తాయని అనుకుంటారు. కానీ తాజాగా రిలీజైన మేడమ్ వెబ్ మూవీ మాత్రం అతిపెద్ద ఫ్లాప్ సూపర్ హీరో మూవీగా నిలిచింది.

అతిపెద్ద సూపర్ హీరో ఫ్లాప్ మూవీ మేడమ్ వెబ్
అతిపెద్ద సూపర్ హీరో ఫ్లాప్ మూవీ మేడమ్ వెబ్

Biggest Superhero Flop Movie: హాలీవుడ్ లో నిర్మించే సూపర్ హీరో సినిమాలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంది. ఈ సినిమాలు మినిమం గ్యారెంటీ అనుకొని భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తారు. 2007లో మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ (ఎంసీయూ) ఈ జానర్ గతినే మార్చేసింది. అయితే కొవిడ్ తర్వాత సూపర్ హీరో సినిమాలకు గడ్డుకాలం మొదలైంది. ఇక ఈ మధ్య రిలీజైన మేడమ్ వెబ్ మూవీ మాత్రం అతిపెద్ద ఫ్లాప్ గా నిలిచింది.

మేడమ్ వెబ్ బాక్సాఫీస్ డిజాస్టర్

స్పైడర్ మ్యాన్ యూనివర్స్ లోని పాత్రల నుంచి సోనీ పిక్చర్స్ సూపర్ హీరో ఫిల్మ్స్ రూపొందిస్తుండగా.. తాజాగా మేడమ్ వెబ్ పేరుతో ఓ కొత్త మూవీని తీసుకొచ్చింది. డకోటా జాన్సన్ ఇందులో లీడ్ రోల్లో నటించింది. ఆమెతోపాటు ఇసబెలా మెర్సెడ్, సెలెస్టి ఓ కానర్, సిడ్నీ స్వీనీ కూడా ఈ మూవీలో నటించారు. అందరూ ఫిమేల్ యాక్టర్స్ కలిసి నటించిన ఈ మూవీని ఎస్‌జే క్లార్క్‌సన్ డైరెక్టర్ చేశాడు.

ఈ సినిమాపై సోనీ పిక్చర్స్ భారీ ఆశలే పెట్టుకుంది. అయితే అడ్వాన్స్ బుకింగ్స్ నుంచే మూవీకి కష్టాలు మొదలయ్యాయి. ఊహించిన విధంగా ఈ బుకింగ్స లేవు. ఆ తర్వాత వచ్చిన రివ్యూలు కూడా నెగటివ్ గా ఉండటంతో దారుణమైన ఓపెనింగ్స్ తో మూవీ మొదలైంది. తొలి వారంలో ఈ మేడమ్ వెబ్ మూవీ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.

మేడమ్ వెబ్.. నష్టాలు భారీగానే..

మేడమ్ వెబ్ మూవీని సుమారు 11.5 కోట్ల డాలర్లు (సుమా రూ.950 కోట్లు) తో తెరకెక్కించారు. కానీ మూవీ తొలి ఆరు రోజుల్లో కేవలం 5.2 కోట్లు మాత్రమే వసూలు చేసింది. మొత్తంగా బాక్సాఫీస్ దగ్గర 10 కోట్ల డాలర్లు కూడా వసూలు చేసే అవకాశాలు కనిపించడం లేదు. దీంతో బాక్సాఫీస్ దగ్గర రూ.100 కోట్లకుపైగానే నష్టాలు చవిచూసే పరిస్థితి కనిపిస్తోంది.

ఈ మేడమ్ వెబ్ సినిమాకు మ్యూజికల్ బయోపిక్ అయిన బాబ్ మార్లీ: వన్ లవ్ నుంచి గట్టి పోటీ ఎదురైంది. దీంతో నార్త్ అమెరికాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కూడా మేడమ్ వెబ్ మూవీ కలెక్షన్లు పడిపోయాయి. తొలి రోజే నెగటివ్ రివ్యూలతో చాలా మంది తమ టికెట్లను క్యాన్సిల్ చేసుకోవడం కూడా ఈ మూవీని దెబ్బ తీసింది.

సోనీ పిక్చర్స్‌కు షాక్

మేడమ్ వెబ్ మూవీ తమ ప్రొడక్షన్ లోని బెస్ట్ మూవీస్ లో ఒకటిగా నిలుస్తుందని భావించిన సోనీ పిక్చర్స్ కు షాక్ తగిలింది. నిజానికి ఈ మేడమ్ వెబ్ తో ఓ కొత్త ఫ్రాంఛైజీని ప్రారంభించాలని భావించారు. అందులో భాగంగానే మూడు కొత్త పాత్రలను కూడా పరిచయం చేశారు. కానీ ఇప్పుడీ మేడమ్ వెబ్ ఫ్లాప్ తో సోనీ పిక్చర్స్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా షాకివ్వడంతో మరో పదేళ్ల పాటు మేడమ్ వెబ్ నుంచి మరో మూవీ రాదని హాలీవుడ్ రిపోర్టర్ వెల్లడించింది. ఈ కొత్త ఫ్రాంఛైజీని సోనీ పిక్చర్స్ పక్కన పెట్టేసినట్లే అని తెలుస్తోంది. సూపర్ హీరో సినిమాల్లోనే అతిపెద్ద డిజాస్టర్ గా మేడమ్ వెబ్ నిలిచిపోయింది.

Whats_app_banner