Bigg Boss: బిగ్ బాస్ అలీ రెజా హీరోగా న్యూ ఫీల్ గుడ్ మూవీ.. ఇండియా నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐల కథతో!-bigg boss telugu season 3 ali reza new movie ram nri pre release event tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss: బిగ్ బాస్ అలీ రెజా హీరోగా న్యూ ఫీల్ గుడ్ మూవీ.. ఇండియా నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐల కథతో!

Bigg Boss: బిగ్ బాస్ అలీ రెజా హీరోగా న్యూ ఫీల్ గుడ్ మూవీ.. ఇండియా నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐల కథతో!

Sanjiv Kumar HT Telugu
Jul 24, 2024 02:04 PM IST

Bigg Boss Fame Ali Reza Movie Ram NRI Pre Release Event: బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 ద్వారా తెలుగు రాష్ట్రాల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న అలీ రెజా హీరోగా నటిస్తున్న కొత్త సినిమా రామ్ ఎన్ఆర్ఐ. రిలేషన్స్ పవర్ గురించి చెప్పే ఈ ఫీల్ గుడ్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల జరిగింది.

బిగ్ బాస్ అలీ రెజా హీరోగా న్యూ ఫీల్ గుడ్ మూవీ.. ఇండియా నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐల కథతో!
బిగ్ బాస్ అలీ రెజా హీరోగా న్యూ ఫీల్ గుడ్ మూవీ.. ఇండియా నుంచి వెళ్లిన ఎన్ఆర్ఐల కథతో!

Ali Reza New Movie Ram NRI Pre Release Event: బిగ్‌బాస్‌ తెలుగు సీజన్ 3 ఫేమ్‌ అలీ రెజా హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ రామ్ ‘రామ్‌ ఎన్‌ఆర్‌ఐ’. ‘పవర్‌ ఆఫ్‌ రిలేషన్‌షిప్‌’ అనేది ఈ చిత్రం ఉపశీర్షిక. ఈ సినిమాలో హీరోయిన్‌గా సీతా నారాయణన్‌ చేస్తోంది. ఈ చిత్రానికి ఎన్. లక్ష్మీ నందా దర్శకత్వం వహిస్తున్నారు.

మువ్వా క్రియేషన్స్‌ పతాకంపై ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ సింగులూరి మోహన్‌కృష్ణ సమర్పణలో మువ్వా సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని జూలై 26న విడుదల చేయనున్నారు. ఈ క్రమంలో మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఇటీవల నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేశారు. ఈ ఈవెంట్‌కు ప్రసన్న కుమార్, లయన్ సాయి వెంకట్, రామకృష్ణ గౌడ్, రామసత్య నారాయణ ముఖ్య అతిథులుగా విచ్చేశారు.

"వీళ్లు సినిమా చేసే సమయానికి కందుల దుర్గేశ్ గారు సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయ్యారు. దగ్గుబాటి పురందేశ్వరి, కోమటిరెడ్డి గారి విషెస్ వీరికి ఉన్నాయి. సినిమా టీం ఎంతో కష్టపడి పని చేశారు. ఇంత మంచి టీం పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం వస్తుంది" అని రైటర్ ప్రసన్న కుమార్ తెలిపారు.

"నాకు సపోర్ట్ చేసిన నా టీంకు ప్రత్యేకంగా థాంక్స్. పుట్టిన ఊరికి ఏదైనా చేయాలని కోరుకున్న వారంతా ముందుకు వచ్చి నా ఈవెంట్‌ను సక్సెస్ చేశారు. సినిమా చాలా బాగా వచ్చింది. అందరూ చూసి ఆదరించండి" అని రామ్ ఎన్ఆర్ఐ మూవీ డైరెక్టర్ ఎన్ లక్ష్మీ నందా తెలిపారు.

"సినిమా అద్భుతంగా వచ్చింది. ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఇచ్చిన వారందరికీ థాంక్స్. నా మీద నమ్మకంతో నాకు ఈ చిత్రాన్ని ఇచ్చారు. జూలై 26న మా చిత్రం రాబోతోంది. ఉయ్యాల జంపాల, శతమానంభవతి ఫ్లేవర్ నాకు కనిపించింది" అని నిర్మాత సింగురూరి మోహన్ కృష్ణ అన్నారు.

"ఎస్‌ఎంకే ఫిల్మ్స్‌ బ్యానర్ మీద ఏడాదికి ఆరు చిత్రాలైనా రిలీజ్ చేయాలని అనుకుంటున్నాను. ప్రతీ చిన్న చిత్రాన్ని రిలీజ్ చేయాలని నిర్ణయించుకుంటున్నాను. లక్ష్మీ నందా గారితో ఓ సోలో చిత్రాన్ని చేస్తున్నాను. మా ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని భావిస్తున్నాను" అని ఎస్ఎంకే ఫిల్మ్స్ సింగులూరి మోహన్ కృష్ణ చెప్పుకొచ్చారు.

"సినిమా నిర్మించడం కంటే.. విడుదల చేయడమే పెద్ద సాహసం. ఇదొక ఫీల్ గుడ్ మూవీ. లక్ష్మీ నందా ప్రాణం పెట్టి తీశాడు. కుటుంబ సమేతంగా చూడదగ్గ చిత్రం. భారతదేశం నుంచి వెళ్లిన ఎన్‌ఆర్‌ఐల మీద అద్భుతంగా తీశాడు. విజువల్స్ బాగుంటాయి. మువ్వా సత్య నారాయణ గొప్పగా ఈ చిత్రాన్ని నిర్మించారు. మోహనకృష్ణ నిర్మాతలకు గ్యాంగ్ లీడర్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ చిత్రం పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను" అని లయన్ సాయి వెంకట్ అన్నారు.

"పాటలు, ట్రైలర్ అన్నీ బాగున్నాయి. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుంది. మంచి లాభాలు వచ్చి ఇంకా మరిన్నిచిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నాను. ఆగిపోయిన సినిమాలను రిలీజ్ చేస్తానని మోహనకృష్ణ గారు అన్నారు. చాలా గొప్ప మాటలు చెప్పారాయన. మా సపోర్ట్ ఆయనకి ఉంటుంది" అని ప్రతాని రామకృష్ణ గౌడ్ చెప్పారు.

Whats_app_banner