Bigg Boss Telugu 8 Remuneration: బిగ్ బాస్ నుంచి సొంతగా నాగ మణికంఠ ఎలిమినేట్.. 7 వారాల్లో ఎంత సంపాదించడంటే?
Bigg Boss Telugu 8 Naga Manikanta Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 నుంచి ఏడో వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. హెల్త్ సపోర్ట్ చేయట్లేదంటూ తనకు తానే సెల్ఫ్ నామినేట్ అయ్యాడు నాగ మణికంఠ. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ 8 తెలుగులో 7 వారాల్లో నాగ మణికంఠ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంతో తెలుసుకుందాం.
Bigg Boss Naga Manikanta Remuneration: బిగ్ బాస్ తెలుగు 8 ఊహించని విధంగా సాగుతోంది. స్ట్రాంగ్‌గా నిలబడతారనుకున్న కంటెస్టెంట్స్ అనూహ్యంగా ఎలిమినేట్ అవుతున్నారు. తాజాగా బిగ్ బాస్ తెలుగు 8 ఏడో వారం ఎలిమినేషన్ అలాగే జరిగింది. ఊహించని విధంగా నాగ మణికంఠ ఎలిమినేట్ అయి హౌజ్‌ను వీడిపోయాడు.
సెల్ప్ ఎలిమినేట్
ఇప్పటివరకు బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో వరుసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఢీ డ్యాన్సర్ నైనిక అనసురు, కిర్రాక్ సీత్ ఎలిమినేట్ అయి బిగ్ బాస్ ఇంటిని వదిలిపెట్టి వెళ్లారు. తాజాగా బిగ్ బాస్ 8 తెలుగు 7వ వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయి వెళ్లిపోయాడు. అయితే, మణికంఠ ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కాకుండా తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.
ఓటింగ్‌లో సేఫ్
ఈ వారం నామినేషన్స్ నుంచి అందరిని సేవ్ చేసిన తర్వాత చివరిగా డేంజర్ జోన్‌లో గౌతమ్, మణికంఠ ఉన్నారు. వారిని యాక్షన్ రూమ్‌లోకి పంపించాక.. తనవల్ల గేమ్ ఆడటం కాదని, ఇంటి నుంచి వెళ్లిపోతానని మొండిపట్టు పట్టుకుని ఉన్నాడు మణికంఠ. దాంతో ఆడియెన్స్ ఓటింగ్ ద్వారా సేవ్ అయిన మణికంఠ తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యాడు.
వారానికి ఎంత రెమ్యునరేషన్
ఇదిలా ఉంటే, ఈ నేపథ్యంలో బిగ్ బాస్ హౌజ్‌లో ఏడు వారాలు ఉన్న మణికంఠ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు.. ఎంత సంపాదించాడనే విషయం ఇంట్రెస్టింగ్‌గా మారింది. నాగ మణికంఠ వారానికి రూ. 1,20,000 (లక్షా 20 వేల రూపాయలు) పారితోషికం తీసుకునేవాడని సమాచారం. అంటే, రోజుకు 17 వేల 142 రూపాయలు.
7 వారాల్లో వచ్చింది ఎంత?
ఈ లెక్కన బిగ్ బాస్ 8 తెలుగు హౌజ్‌లో 7 వారాలు ఉన్న నాగ మణికంఠకు సుమారుగా రూ. 8,40,000 రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్స్‌లోని అందరి కంటెస్టెంట్లతో పోల్చుకుంటే నాగ మణికంఠే తక్కువ రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.
మిగతా వారికంటే తక్కువ
వారానికి రూ. లక్షా 20 వేల పారితోషికంతో నాగ మణికంఠ బిగ్ బాస్ తెలుగు 8 హౌజ్‌లోకి ఎంట్రీ ఇస్తే.. మిగతా కంటెస్టెంట్స్ అందరికి లక్షా 50 వేలకు పైగానే ఉంది. బెజవాడ బేబక్క, సోనియా ఆకుల రెమ్యునేరషన్ వారానికి రూ. 1,50,000 అని టాక్. మణికంఠ తర్వాత వీరిద్దరితే అతి తక్కువ రెమ్యునరేషన్.
తొలిరోజే ఎలిమినేషన్ ట్విస్ట్
కాగా నాగ మణికంఠ బిగ్ బాస్ తెలుగు 8లోకి వచ్చిన తొలిరోజే ఎలిమినేషన్ ట్విస్ట్ ఎదుర్కొన్నాడు. బిగ్ బాస్ తెలుగు 8 గ్రాండ్ లాంచ్ రోజున గెస్ట్‌గా వచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడి తొలిరోజే ఎలిమినేషన్ అని ప్రాంక్ చేశాడు. ఈ ఎలిమినేష్ ప్రాసెస్‌లో అందరూ నాగ మణికంఠను ఎలిమినేట్ చేస్తున్నట్లు ఓట్లు వేశారు. ఆ సమయంలో మణికంఠ పాడిన పాట తెగ వైరల్ అయింది.
విపరీతమైన ట్రోలింగ్
అంతేకాకుండా మణికంఠ పాట పాడటం, విగ్గు పీక్కోవడం, భార్యాపిల్లలు గుర్తుకు వస్తున్నారని అనడం వంటివి వాటిపై సోషల్ మీడియాలో బాగా ట్రోలింగ్ జరిగింది. ముందుగా అందరూ మణికంఠ సింపథీ గేమ్ ప్లే చేస్తున్నాడు అనుకున్నా తర్వాతి క్రమంలో తన ఆట చాలా మెరుగుపరుచుకున్నాడు. దాంతో మంచి ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నాడు నాగ మణికంఠ. కానీ, ఇలా సెల్ఫ్ ఎలిమినేషన్ అయి అందరికీ ట్విస్ట్ ఇస్తాడని ఎవరు ఊహించలేకపోవడం గమనార్హం.