Bigg Boss Voting: నిఖిల్ టాప్.. డేంజర్ జోన్‍లో ఇద్దరు.. ఎలిమినేషన్ అంచున ఆ కంటెస్టెంట్!-bigg boss 8 telugu voting this week nikhil on top nayani pavani in danger of elimination ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Voting: నిఖిల్ టాప్.. డేంజర్ జోన్‍లో ఇద్దరు.. ఎలిమినేషన్ అంచున ఆ కంటెస్టెంట్!

Bigg Boss Voting: నిఖిల్ టాప్.. డేంజర్ జోన్‍లో ఇద్దరు.. ఎలిమినేషన్ అంచున ఆ కంటెస్టెంట్!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 26, 2024 11:43 AM IST

Bigg Boss 8 Telugu Voting: బిగ్‍బాస్ 8వ వారం చివరికి వచ్చింది. ఆరుగురు నామినేషన్లలో ఉండగా.. ఓటింగ్‍లో నిఖిల్ టాప్‍లో ఉన్నారు. ఇద్దరు కంటెస్టెంట్లు డేంజర్ జోన్‍లో నిలిచారు.

Bigg Boss Voting: నిఖిల్ టాప్.. డేంజర్ జోన్‍లో ఇద్దరు.. ఎలిమినేషన్ అంచున ఆ కంటెస్టెంట్!
Bigg Boss Voting: నిఖిల్ టాప్.. డేంజర్ జోన్‍లో ఇద్దరు.. ఎలిమినేషన్ అంచున ఆ కంటెస్టెంట్!

బిగ్‍బాస్ తెలుగు 8వ సీజన్‍లో ఏడో వారం ఎలిమినేషన్ ట్విస్టుల మధ్య జరిగింది. నాగ మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్ అయ్యారు. ప్రస్తుతం ఈ సీజన్‍లో ఎనిమిదో వారం కూడా ముగింపునకు వచ్చేసింది. రేపు (అక్టోబర్ 26) ఎలిమినేషన్ ఉండనుంది. ఈ వారం ఆరుగురు కంటెస్టెంట్లు నామినేషన్లలో ఉన్నారు. ఈ వారం ఓటింగ్ ట్రెండ్ ఇంట్రెస్టింగ్‍గా ఉంది.

నిఖిల్ టాప్

బిగ్‍బాస్ ఈ వారం నామినేషన్లలో నిఖిల్, పృథ్విరాజ్, ప్రేరణ, విష్ణుప్రియ, మహబూబ్, నయని పావని ఉన్నారు. ఈ వీక్ ఓటింగ్‍లో నిఖిల్ దుమ్మురేపుతున్నారు. ఈ వారం టాస్కుల్లోనూ అతడు మెప్పించారు. గత మూడు వారాలుగా నిఖిల్ గేమ్ డ్రాప్ అవుతున్నట్టు కనిపించింది. ఇతర హౌస్‍మేట్స్ కూడా ఇదే విధంగా గత వీకెండ్ అభిప్రాయాలు చెప్పారు. అయితే, ఈ ఎనిమిదో వారంలో నిఖిల్ ఇంప్రెస్ చేశారు. ఓటింగ్‍లోనూ ప్రస్తుతం టాప్‍లో ఉన్నారు. సుమారు 30 శాతం ఓట్లతో ఫస్ట్ ప్లేస్‍లో ఉన్నారు.

ఓటింగ్‍లో ప్రస్తుతం ప్రేరణ రెండో స్థానంలో ఉన్నారు. ఈ వారం మొదట్లో ఫస్ట్ ప్లేస్‍లో ఉన్న ఆమె.. ఇప్పుడు రెండో స్థానంలో నిలిచినట్టు ఓటింగ్ ట్రెండ్ ద్వారా తెలుస్తోంది. కొత్త మెగా చీఫ్ విష్ణుప్రియ మూడో స్థానంలో ఉన్నారు. పృథ్విరాజ్ నాలుగో ప్లేస్‍లో ఉన్నారు.

డేంజర్ జోన్‍లో ఇద్దరు

ఈ వారం ఓటింగ్ ట్రెండ్ ప్రకారం మహబూబ్, నయని పావని ప్రస్తుతం డేంజర్ జోన్‍లో ఉన్నారు. మహబూబ్ ఐదో ప్లేస్‍లో ఉంటే.. పావని చివరి స్థానంలో నిలిచారు. ఈ వారం టాస్కుల్లో పావని పెద్దగా ఆకట్టుకోలేదు. పాజిటివ్ విషయాలు కూడా ఎక్కువగా లేవు. దీంతో ఓటింగ్‌లోనూ పావని వెనుక బడ్డారు.

ఓటింగ్‍లో చివరి రెండు స్థానాల్లో ఉన్న మహబూబ్, పావనిల్లో ఈ వారం ఒకరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా పావని ఎలిమినేషన్ అంచున నిలిచారు. చివర్లో ఓటింగ్ ట్రెండ్ విపరీతంగా మారితే తప్ప నయని సేవ్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి.

నాగ్ చెప్పిన ట్విస్ట్ ఏంటి?

గత వారం నాగ మణికంఠ ఎలిమినేట్ అయ్యాక హోస్ట్ కింగ్ నాగార్జున ఓ కామెంట్ చేశారు. వచ్చే వారం ఊహించని ట్విస్ట్ ఉంటుందని ఓ మాట అన్నారు. దీంతో ఆ ట్విస్ట్ ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ముఖ్యంగా ఈ సీజన్‍లో ఎలిమినేట్ అయిన ఓ కంటెస్టెంట్ రీఎంట్రీ ఇస్తారనే రూమర్ బలంగా ఉంది. అలాగే, ఎవరినైనా సీక్రెట్ రూమ్‍కు పంపుతారా అనే ఆసక్తి కూడా ఉంది. మరి నాగార్జున చెప్పిన ఆ ట్విస్ట్ ఏంటో ఆదివారం ఎపిసోడ్‍లో రివీల్ అయ్యే అవకాశం ఉంది.

Whats_app_banner