Bigg Boss 8 Telugu: నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటి: నిఖిల్‍ను నిలదీసిన రోహిణి.. పృథ్వితోనూ గొడవ.. నామినేషన్లలో వీళ్లే!-bigg boss telugu 8 nominations rohini targets nikhil and prithvi day 50 roundup today episode highlights ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటి: నిఖిల్‍ను నిలదీసిన రోహిణి.. పృథ్వితోనూ గొడవ.. నామినేషన్లలో వీళ్లే!

Bigg Boss 8 Telugu: నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటి: నిఖిల్‍ను నిలదీసిన రోహిణి.. పృథ్వితోనూ గొడవ.. నామినేషన్లలో వీళ్లే!

Chatakonda Krishna Prakash HT Telugu
Oct 21, 2024 10:43 PM IST

Bigg Boss Telugu 8 Nominations: బిగ్‍బాస్‍లో ఎనిమిదో వారం నామినేషన్ల సందర్భంగా కంటెస్టెంట్ల మధ్య మాటల యుద్ధం గట్టిగానే సాగింది. నిఖిల్, పృథ్విని రోహిణి నామినేట్ చేశారు. ఈ సందర్భంగా వాగ్వాదం జరిగింది.

Bigg Boss Telugu 8: నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటి: నిఖిల్‍ను నిలదీసిన రోహిణి.. పృథ్వితోనూ గొడవ.. నామినేషన్లలో వీళ్లే!
Bigg Boss Telugu 8: నువ్వు చెప్పిందేంటి.. చేసిందేంటి: నిఖిల్‍ను నిలదీసిన రోహిణి.. పృథ్వితోనూ గొడవ.. నామినేషన్లలో వీళ్లే!

బిగ్‍బాస్ 8 తెలుగు సీజన్‍లో ఎనిమిదో వారం షురూ అయింది. ఏడో వారంలో నాగ మణికంఠ సెల్ఫ్ నామినేట్ చేసుకొని హౌస్ నుంచి బయటికి వెళ్లిపోయారు. ఎనిమిదో వారం కోసం నామినేషన్ల ప్రక్రియ నేటి (అక్టోబర్ 21) సోమవారం ఎపిసోడ్‍లో మొదలైంది. ఈ సందర్భంగా కొందరు కంటెస్టెంట్ల మధ్య వాగ్వాదాలు సాగాయి. గట్టిగానే మాటలు అనుకున్నారు.

కుండలు పగులగొట్టి..

‘హరే హరే రామా.. హరే హరే కృష్ణా’ అనే పాటతో 50వ రోజు మొదలైంది. ఇంట్లో ఉండేందుకు అర్హత లేదని అనుకునే ఇద్దరి హౌస్‍మేట్లు ఎవరో ఎంపిక చేసుకొని కారణాలు చెప్పాలని బిగ్‍బాస్ చెప్పారు. వారి దిష్టిబొమ్మలపై కుండ పెట్టి పగులగొట్టి నామినేట్ చేయాలని కంటెస్టెంట్లకు వివరించారు.

హరితేజకు నామినేషన్ షీల్డ్ ఇచ్చారు మెగాచీఫ్ గౌతమ్ కృష్ణ. దీంతో హరితేజను నామినేట్ చేసిన ప్రతీసారి రూ.25వేలు ప్రైజ్‍మనీ నుంచి తగ్గుతుందని బిగ్‍బాస్ తెలిపారు.

ముందుగా ప్రేరణను విష్ణుప్రియ నామినేట్ చేశారు. కిల్లర్ గర్ల్‌గా ఉన్న సమయంలో సరైన నిర్ణయాలు తీసుకోలేదని అన్నారు. ఆ తర్వాత నిఖిల్‍ను కూడా విష్ణు నామినేట్ చేశారు.

నిఖిల్‍కు నిలదీసిన రోహిణి

నిఖిల్‍ను రోహిణి నామినేట్ చేశారు. చార్జింగ్ గేమ్‍లో గౌతమ్ కృష్ణతో నిఖిల్ దురుసుగా ప్రవర్తించిన విధానంపై రోహిణి అసంతృప్తి చెందారు. ఆర్టిస్టులం కాబట్టి ఫేస్‍లు కాపాడుకోవాలని ఒకప్పుడు చెప్పావని, మరి గౌతమ్ విషయంలో ఎందుకు అలా ప్రవర్తించి నెట్టివేశావని నిఖిల్‍ను రోహిణి నిలదీశారు. సోఫాపై ఏమైనా ఉంటే గౌతమ్‍కు దెబ్బ తగిలేదని అన్నారు.

గౌతమ్ కృష్ణను నిఖిల్ నెట్టివేయడం తనకు నచ్చలేదని రోహిణి చెప్పారు. “గౌతమ్‍కు, నీకు మధ్య నా కళ్ల ముందు ఏం జరిగిందో నాకు నచ్చలేదు. ఆపడం అనేది ఓకే. కానీ ఉద్దేశ్యపూర్వకంగానే అలా తోసేసినట్టు నాకు అనిపించింది. సోఫాలో ఏదైనా షార్ప్‌గా ఉండి ఉంటే గాయం అయ్యేది. మనం ఆర్టిస్టులం.. ఫేస్ కాపాడుకోవాలని నువ్వే ముందు చెప్పావ్. అలాంటి నువ్వే అలా చేశావ్” అని రోహిణి అన్నారు. సేఫ్‍గా ఉండాలనే సోఫాపైకి నెట్టానని నిఖిల్ సమర్థించుకున్నారు. అయితే, సోఫాలో ఏముందో తెలియదు కదా అని రోహిణి అన్నారు. గౌతమ్‍ను పట్టుకొని లాక్కెళ్లడం తనకు అసలు నచ్చలేదని చెప్పారు.

నిఖిల్‍తోనూ రోహిణి గొడవ

పృథ్విపై కూడా రోహిణి ఫైర్ అయ్యారు. దూకుడుగా ఉంటూ.. ఎప్పుడూ ఎవరి మాట వినడం లేదని పృథ్విపై రోహిణి అసంతృప్తి వ్యక్తం చేశారు. చార్జింగ్ గేమ్‍లో కేబుల్ జేబులో పెట్టుకోవడం సరికాదని రోహిణి అన్నారు. టాస్క్, నామినేషన్ తప్ప ఇంట్లో ఏం చేస్తున్నావని పృథ్విని రోహిణి క్వశ్చన్ చేశారు. “నీ ప్రవర్తన బాలేదు. గేమ్ సరిగా ఆడలేదు. అగ్రెసివ్‍గా ఆడడం తప్ప బుర్ర పెట్టలేదు. బాడీ ఉంది.. అది మాత్రమే వాడతా అంటూ కుదరదు” అని రోహిణి చెప్పారు.

జోక్స్ చేయాలా అని నిఖిల్ పదేపదే అన్నారు. దీంతో రోహిణికి కోపం వచ్చింది. జోక్ అని తననే అంటున్నావా అని ప్రశ్నించారు. ఇద్దరి మధ్య మాటల యుద్ధం బలంగా సాగింది.

ఆటలో జీరో.. రోహిణి ఫైర్

ప్రేరణతో పాటు రోహిణిని కూడా పృథ్వి నామినేట్ చేశారు. దీంతో మరోసారి రోహిణి, పృథ్వి మధ్య మాటల ఫైట్ సాగింది. టాస్కుల్లో వీక్ ఉన్నారని, ఆటలో జీరోగా కనిపిస్తున్నారని రోహిణిని పృథ్వి అన్నారు. “అందరూ విన్ అవరు. నువ్వు ఒక్కసారైనా చీఫ్ అయ్యావా” అని పృథ్వికి పంచ్ వేశారు రోహిణి. తనను తేడాగా చూస్తున్నావంటూ పృథ్విపై ఫైర్ అయ్యారు రోహిణి.

ఆ తర్వాత కూడా నామినేషన్లు కొనసాగాయి. మహబూబ్, నయని పావని మధ్య మాటల యుద్ధం జరిగింది. హరితేజ, ప్రేరణ మధ్య కూడా వాగ్వాదం జరిగింది. ప్రేరణ మాటలు మార్చే విధానం తనకు నచ్చలేదనేలా హరితేజ అన్నారు. ప్రేరణ కూడా డిఫెండ్ చేసుకున్నారు. ప్రేరణ, నబీల్ మధ్య కూడా గొడవ సాగింది. హరితేజను కూడా నబీల్ నామినేట్ చేశారు. నామినేషన్ల ప్రకియ కూడా ఇంకా పూర్తి కాలేదు. రేపు మంగళవారం ఎపిసోడ్‍లోనూ కొనసాగనుంది.

నామినేషన్లలో వీళ్లే!

బిగ్‍బాస్ ఎనిమిదో వారం నామినేషన్లలో ఎవరు ఉండనున్నారో సమాచారం బయటికి వచ్చింది. షూటింగ్ పూర్తవడంతో ఈ విషయం లీకైంది. ఈ వారం నామినేషన్లలో పృథ్విరాజ్, విష్ణుప్రియ, ప్రేరణ, నయని పావని, మహబూబ్, నిఖిల్ ఉన్నారని తెలుస్తోంది. హరితేజ సేవ్ అయ్యారని తెలుస్తోంది. రేపటి ఎపిసోడ్‍లో ఈ విషయంపై క్లారిటీ రానుంది.

Whats_app_banner