Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మధ్యలోనే వెళ్లిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరు?-bigg boss 8 telugu mid week evictions coming soon nominations day who will be eliminated mid week aditya nainika ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మధ్యలోనే వెళ్లిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మధ్యలోనే వెళ్లిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరు?

Hari Prasad S HT Telugu
Sep 30, 2024 08:35 PM IST

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ ఫ్యాన్స్ కు బిగ్ షాక్ అంటూ స్టార్ మా చేసిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఈసారి వారం మధ్యలోనే ఓ కంటెస్టెంట్ హౌజ్ వదిలి వెళ్లిపోనున్నారు. దీంతో సోమవారం (సెప్టెంబర్ 30) నామినేషన్స్ లో ఎవరు ఉండబోతున్నారో అన్న ఆసక్తి నెలకొంది.

బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మధ్యలోనే వెళ్లిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరు?
బిగ్ బాస్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. మధ్యలోనే వెళ్లిపోయే ఆ కంటెస్టెంట్ ఎవరు?

Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ 8 తెలుగు ఆసక్తికరంగా సాగుతోంది. ఇప్పటికే నలుగురు కంటెస్టెంట్లు హౌజ్ వదిలి వెళ్లిపోయారు. అయితే ఈసారి మాత్రం బిగ్ బాస్ పెద్ద ట్విస్టే ఇచ్చాడు. ప్రతిసారీ వీకెండ్ షోలో ఒకరు ఎలిమినేట్ అయ్యే వారు. కానీ ఈవారం మాత్రం వీక్ మధ్యలోనే ఒకరిని ఇంటికి పంపించబోతున్నారు. అది ఎవరన్న సస్పెన్స్ ఇప్పుడు నెలకొంది.

వారం మధ్యలో వెళ్లిపోయేదెవరు?

బిగ్ బాస్ 8 తెలుగు ఐదో వారం నామినేషన్లకు టైమ్ దగ్గర పడిన వేళ ఫ్యాన్స్ కు పెద్ద షాకింగ్ న్యూస్ అంటూ స్టార్ మా ఓ ట్వీట్ చేసింది. వారం మధ్యలోనే ఒకరు హౌజ్ ను వీడాల్సిన సమయం దగ్గర పడిందని, మరి ఈసారి నామినేషన్లలో ఎవరు ఉండబోతున్నారంటూ అడిగింది. ఇప్పుడీ ట్వీట్ వైరల్ అవుతోంది.

"బిగ్ బాస్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్. మిడ్ వీక్ ఎవిక్షన్ వచ్చేస్తోంది. హౌజ్ లో ఊహాగానాలతో వాతావరణం వేడిగా మారింది. ఈసారి ఇంటికి ఎవరు వెళ్లబోతున్నారని మీరు అనుకుంటున్నారు? మీ కామెంట్స్, ఆలోచనలను షేర్ చేయండి. ఈ డ్రామా మిస్ కావద్దు" అనే క్యాప్షన్ తో స్టార్ మా ఈ ట్వీట్ చేసింది.

ఈవారం ఇద్దరు

నిజానికి గత వారమే బిగ్ బాస్ హౌజ్ నుంచి ఇద్దరు ఇంటికెళ్లిపోతారని భావించారు. అయితే చివరికి సోనియా ఆకుల మాత్రమే గేమ్ నుంచి బయటకు వెళ్లిపోయింది. దీంతో ఈసారి కొత్తగా వారం మధ్యలోనే మరొకరిని పంపించేందుకు బిగ్ బాస్ సిద్ధమయ్యాడు. ఆ లెక్కన వారం మధ్యలో ఒకరు, వీకెండ్ లో మరొకరు హౌజ్ ను వీడాల్సి ఉంటుంది.

దీనికోసం సోమవారం (సెప్టెంబర్ 30) నామినేషన్లు జరగనున్నాయి. వీటిలో ఎవరు ఉంటారన్న ఆసక్తి ఇప్పుడు నెలకొంది. వారం మధ్యలోనే ఆదిత్య, నైనికల్లో ఒకరు ఇంటికెళ్లిపోతారా అన్న చర్చ నడుస్తోంది. ప్రస్తుతం హౌజ్ లో పది మంది కంటెస్టెంట్లు ఉన్నారు. ఆదిత్య ఓం, నైనికతోపాటు ప్రేరణ, సీత, నబీల్, పృథ్వీరాజ్, నిఖిల్, నాగ మణికంఠ, యశ్మి, విష్ణుప్రియ హౌజ్ లో ఉన్నారు.

వీళ్లలో ఈ వీకెండ్ కు ఎనిమిది మంది మాత్రమే మిగలనున్నారు. ఇక అక్టోబర్ 5న మరోసారి గ్రాండ్ లాంచ్ పేరుతో మరికొందరు కొత్త కంటెస్టెంట్లు హౌజ్ లోకి అడుగుపెట్టనున్నారు. దీంతో ఈ సీజన్ మరింత రసవత్తరంగా మారనుందని భావిస్తున్నారు.

నాలుగో వారం ఎలిమినేషన్ ఇలా..

నాలుగో వారం నామినేషన్ నుంచి నబీల్ ఇప్పటికే సేవ్ అయ్యారు. ఆదిత్య, పృథ్వి, నైనిక కూడా నామినేషన్ నుంచి బయటపడ్డారు. సోనియా, డేంజర్ జోన్‍లో ఉన్న మణికంఠ మధ్య ఎలిమినేషన్ టెన్షన్ నెలకొంది.

సోనియా, మణికంఠ ఎలిమినేషన్ అంచున నిలిచారు. ప్రేక్షకుల ఓటింగ్‍తో పాటు హౌస్‍మేట్స్ నిర్ణయాన్ని కూడా తీసుకునేందుకు నాగార్జున డిసైడ్ అయ్యారు. హౌస్‍లో మణికంఠ ఉండాలని ఎంత మంది.. సోనియా ఉండాలని ఎంత మంది అనుకుంటున్నారని అడిగారు.

మణికంఠనే హౌస్‍లో ఉండాలని ఆదిత్య ఓం, నబీల్ ఆఫ్రిది, విష్ణుప్రియ, ప్రేరణ, యష్మి, సీత లేచి నిలబడ్డారు. సోనియా ఉండాలని నిఖిల్, పృథ్వి, నైనిక చెప్పారు. మణికంఠకు ఆరుగురు, సోనియాకు ముగ్గురే మద్దతు తెలిపారు.