Bigg Boss 7 Telugu Nominations : పల్లవి ప్రశాంత్ టార్గెట్.. తొడలు కొట్టి మీసం మెలేసిన రైతు బిడ్డ.. తర్వాత కన్నీళ్లు
Bigg Boss 7 Telugu : బిగ్ బాస్ హౌస్‍లో రెండో వారం నామినేషన్స్ ఆసక్తికరంగా సాగాయి. నామినేట్ చేసేందుకు వచ్చిన వ్యక్తి.. ఎందుకో చెబుతుంటే.. నామినేట్ అయిన వ్యక్తి కౌంటర్ ఇవ్వడం చూసి ప్రేక్షకులు ఎంజాయ్ చేశారు.
బిగ్ బాస్ సీజన్ 7 తాజా ఎపిసోడ్లో ఆసక్తికర విషయాలు జరిగాయి. కంటెస్టెంట్ల మధ్య నామినేషన్స్ రచ్చ జరిగింది. శివాజీ నామినేషన్స్ జరుగుతుండగా.. తనను నామినేట్ చేసిన వారికి హర్ట్ అయ్యేలా చేశాడు. చేసుకోండి అన్నట్టుగా బిహేవ్ చేశాడు. ఇదే సూపర్ అనుకుంటే.. ఇక పల్లవి ప్రశాంత్ వంతు వచ్చింది. రైతు బిడ్డ అస్సలు ఆగలేదు.. కంటెస్టెంట్లు కూడా తగ్గేదేలే అన్నట్టుగా చేశారు. ఎందుకు చేస్తు్న్నామో వివరించారు.
నామినేషన్స్ చేస్తుండగా.. ఎందుకు చేస్తున్నామో.. కంటెస్టెంట్స్ చెప్పిన సమాధానాలు.. ప్రశాంత్ ఇచ్చిన కౌంటర్స్ కాస్త ఆసక్తికరంగా సాగాయి. ఇందులో హైలెట్ ఏంటంటే.. అమర్ దీప్-ప్రశాంత్ మధ్య జరిగిన డిస్కషన్. ఆరుగురు కంటెస్టెంట్స్ నామినేట్ చేసేందుకు వచ్చారు. ఇప్పటి వరకూ ఇదే ఎక్కువ. నామినేట్ చేసే సమయంలో అమర్ దీప్ అయితే.. తన ఉగ్రరూపం చూపించాడు. ప్రశాంత్‍కు వార్నింగుల మీద వార్నింగులు ఇచ్చాడు.
మెుదట గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ, ప్రియాంక, దామిని, షకీలా వచ్చి ప్రశాంత్‍ను నామినేట్ చేశారు. అయితే నామినేషన్స్ సమయంలో ప్రశాంత్ సైటరికల్‍గా బిహేవ్ చేశారు. తర్వాత అమర్ దీప్ వచ్చి.. బాగా మాట్లాడాడు. అందరూ ఫిదా అయిపోయారు. ఇంటి పనుల్లో ఎక్కువగా కనిపించడు అని మెుదలుపెట్టాడు అమర్. నీకు రెండు మెుహాలు ఉన్నాయి ప్రశాంత్ అని చెప్పాడు. ఈ సందర్భంగా.. ప్రశాంత్ ఓ భుజం పైకి ఎత్తగా.. నా ముందు దించు.. అలా చేయకు అని వార్నింగ్ ఇచ్చాడు.
ఇప్పుడు నువ్ ఉన్న బాడీ లాంగ్వేజ్ ఇంట్లో లేదని, అది చేస్తే ఎంటర్టైన్మెంట్ అని వివరించాడు అమర్ దీప్. ఎన్నో సీజన్లు చూసి.. పరిశీలించి.. ఎలా ఉండాలో నేర్చుకున్నావని చెప్పాడు. కానీ ప్రశాంత్ మాత్రం ఒప్పుకోలేదు. ఈ సందర్భంగా ప్రశాంత్ పద్ధతికి అమర్ దీప్ కు అస్సలు నచ్చలేదు. నువ్ వెదవ అయితే.. నేను పరమ వెదవని, నీకంటే.. పెద్ద నటుడిని అని ఫైర్ అయ్యాడు అమర్. రైతు బిడ్డ అంటూ సెంటిమెంట్ వర్కౌట్ చేసే ప్రయత్నం చేస్తున్నావని, అది కరెక్ట్ కాదని తెలిపాడు. బీటెక్ చేసిన వారి కష్టాలు ఎలా ఉంటాయో తెలుసా అంటూ.. రఘువరన్ బీటెక్ సినిమాలో ధనుష్ చెప్పిన లాంటి డైలాగ్ ఒక్కటి చెప్పాడు. దీంతో రతిక, సందీప్ చప్పట్లు కొట్టారు.
రైతు బిడ్డ అనే పదం వాడటం తప్పు.. అని అమర్ దీప్ చెప్పగా.. ప్రశాంత్ అస్సలు ఒప్పుకోలేదు. నాకు యాక్టింగ్ అంటే ఇష్టమని చెప్పుకొచ్చాడు ప్రశాంత్.. ఇప్పుడు నువ్ చేస్తుంది అదే అని కౌంటర్ ఇచ్చాడు అమర్ దీప్. నేను పుట్టుకతోనే నటుడిని, నువ్ నేర్చుకొని వచ్చిన నటుడివి అంటూ ఫైర్ అయ్యాడు. అయితే ఈ సందర్భంగా మధ్య మధ్యలో ప్రశాంత్ తొడలు కొట్టడం, మీసం కొట్టడంలాంటివి చేశారు. కాస్త టెన్షన్ ఫీలయ్యాడు.
చదువుకున్న వాళ్ల కష్టం తనకు తెలియదు అంటే.. బాధనిపించిందని తెలిపాడు ప్రశాంత్. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తాను కూడా డిగ్రీ వరకు చదివినట్టుగా తెలిపాడు. ఎవరి కింద పని చేయడం ఇష్టం లేక.. పొలం పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. నటన ఇష్టం ఉండి.. 20 వేలు మోసపోయానని చెప్పాడు. కుక్కలాగా స్టూడియో చుట్టూ తిరిగానని ప్రశాంత్ అనగా.. కుక్కలాగా స్టూడియో చుట్టూ.. తిరిగి ఇప్పుడు ఏం చేస్తు్న్నావని రతిక ప్రశ్నించింది. ఈ సమయంలో గౌతమ్ కూడా తాను చెప్పిన పాయింట్ మాట్లాడేందుకు ముందుకు వచ్చాడు. ఇప్పుడు నువ్ మాట్లాడొద్దు అని అమర్ దీప్ వెనక్కు తీసుకెళ్లాడు. నువ్ నీలాగా ఉండు, ఎంటర్ట్మైన్మెంట్ ఇవ్వు, సెంటిమెంట్ వాడకు అని దండం పెట్టాడు అమర్ దీప్. మెుత్తానికి పల్లవి ప్రశాంత్ ఎపిసోడ్ ఆసక్తిగా సాగింది. మిగిలిన కంటెస్టెంట్స్ నామినేషన్స్ సమయంలో ఏం చెబుతారో చూడాలిక..