Bigg Boss Bhole Shavali Elimination: నవ్వుతూ.. పాడుతూ నిష్క్రమించిన భోలే షావలి.. మారుమూల నుంచి ఇక్కడి వరకు వచ్చానంటూ..-bhole shavali eliminated from bigg boss 7 telugu ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Bhole Shavali Eliminated From Bigg Boss 7 Telugu

Bigg Boss Bhole Shavali Elimination: నవ్వుతూ.. పాడుతూ నిష్క్రమించిన భోలే షావలి.. మారుమూల నుంచి ఇక్కడి వరకు వచ్చానంటూ..

Chatakonda Krishna Prakash HT Telugu
Nov 13, 2023 12:00 AM IST

Bigg Boss 7 Telugu Elimination - Bhole Shavali: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్‍ 10వ వారంలో భోలే షావలి ఎలిమినేట్ అయ్యారు. హౌస్ నుంచి బయటికి వెళుతూ కూడా పాటలతో ఆయన అలరించారు. నవ్వుతూనే బిగ్‍బాస్ నుంచి భోలే నిష్క్రమించారు.

Bigg Boss Bhole Shavali Elimination: నవ్వుతూ.. పాడుతూ నిష్క్రమించిన భోలే షావలి
Bigg Boss Bhole Shavali Elimination: నవ్వుతూ.. పాడుతూ నిష్క్రమించిన భోలే షావలి

Bigg Boss 7 Telugu Elimination - Bhole Shavali: బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ 10వ వారంలోనూ అనూహ్యమైన ఎలిమినేషన్ జరిగింది. సింగర్ భోలే షావలి హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. బయటికి వచ్చేశారు. ఆదివారం (నవంబర్ 12) ఎపిసోడ్‍లో ఈ ఎలిమినేషన్ ప్రక్రియ జరిగింది. దీపావళి సందర్భంగా ఆదివారం ఎపిసోడ్‍లో సెలెబ్రేషన్స్ కూడా జరిగాయి. కాజల్, వైష్ణవ్ తేజ్, శ్రీలీల సహా మరికొందరు సినీ సెలెబ్రిటీలు గెస్టులుగా వచ్చారు. కొందరు కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు కూడా బిగ్‍బాస్ స్టేజీపైకి వచ్చి తమ వారితో మాట్లాడారు. ఇదే క్రమంలో ఎలిమినేషన్ ప్రక్రియ కూడా సాగింది.

ట్రెండింగ్ వార్తలు

పదో వారం నామినేషన్లలో భోలే షావలి, రతిక, గౌతమ్ కృష్ణ, ప్రిన్స్ యావర్, శివాజీ ఉన్నారు. ఎలిమినేషన్ ప్రక్రియలో రతిక, గౌతమ్, శివాజీ సేఫ్ అయ్యారు. చివర్లో ప్రిన్స్ యావర్, భోలే షావలి డేంజర్ జోన్‍లోకి వచ్చారు. భోలే, యావర్ ఫొటోలు ఉన్న చిచ్చుబుడ్లలో ఏది వెలుగుతోందో వారు సేఫ్ అని నాగార్జున చెప్పారు. చివర్లో ప్రిన్స్ యావర్ ఫొటో ఉన్న చిచ్చుబుడ్డి వెలిగింది. దీంతో బిగ్‍బాస్ తెలుగు 7వ సీజన్ నుంచి భోలే షావలి ఎలిమినేట్ అయ్యారు.

ఎలిమినేట్ అయ్యాక యావర్‌ను కౌగిలించుకున్నారు భోలే షావలి. అర్జున్‍ను ఆప్యాయంగా హత్తుకున్నారు. షావలి వెళ్లిపోతుండటంతో అశ్వినీ కన్నీరు పెట్టుకున్నారు. శివాజీ సహా కూడా బాధపడ్డారు. బిగ్‍బాస్‍లో తన ప్రయాణం గురించి అప్పటికప్పుడు పదాలు కట్టి పాట పాడారు భోలే షావలి. ఎలిమినేట్ అవుతూ కూడా నవ్వుతూ బయటికి వెళ్లారు. వెళ్లిపోతూ కూడా పాటతో అలరించారు. భోలేను యావర్ ఎత్తుకున్నారు. సందర్భాన్ని బట్టి పదాలు ఆలోచించి.. ట్యూన్ చేసి అప్పటికప్పుడు పాట పాడే అద్భుతమైన టాలెంట్ ఉన్న భోలే షావలి.. పాట బిడ్డగా బాగా పాపులర్ అయ్యారు.

భోలే అంటే ఏంటో అందరికీ తెలిసేలా చేసినందుకు, ఇంత మంది స్నేహితులను ఇచ్చిందుకు బిగ్‍బాస్‍కు భోలే షావలి ధన్యవాదాలు చెప్పారు. రైతు బిడ్డా.. పాట బిడ్డకు సెలవు అంటూ ప్రశాంత్‍ను హత్తుకున్నారు భోలే. మిగిలిన కంటెస్టెంట్లకు బాయ్ చెబుతూ నవ్వుతూనే బిగ్‍బాస్ హౌస్ నుంచి బయటికి వచ్చారు భోలే షావలి. బిగ్‍బాస్ హౌస్‍లో తన పాటలతో ప్రేక్షకులను చాలా ఎంటర్‌టైన్ చేసిన భోలే ఎలిమినేట్ అయ్యారు. నవ్వుతూ.. పాడుతూనే హౌస్ నుంచి నిష్క్రమించారు.

హౌస్‍లో నుంచి బిగ్‍బాస్ స్టేజీపైకి వచ్చి హోస్ట్ నాగార్జునతో మాట్లాడారు భోలే షావలి. బిగ్‍బాస్‍లో అవకాశం ఇచ్చిన నాగ్‍కు జీవితాంతం రుణపడి ఉంటానని అన్నారు. “మీ పాటే.. మీకు కేరాఫ్ అడ్రస్” అని షావలితో నాగ్ అన్నారు. మరిన్ని పాటలతో ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోతానని భోలే అన్నారు. “ఎక్కడో మారుమూల పెనుగొండ అనే ఊరి నుంచి వచ్చి.. ఇంత పెద్ద వేదికపై మీ ముందు ఉన్నా” అని భోలే షావలి అన్నారు. నాగార్జునపై అప్పటికప్పుడు పాట కట్టి పాడారు షావలి. కొన్ని సినిమాల్లో ఇప్పటికే పాటలు పాడారు భోలే షావలి. ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా చేశారు. అయితే, ఇప్పుడు బిగ్‍బాస్ ద్వారా ఆయన మరింత పాపులర్ అయ్యారు. 

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.