Ashu Reddy Super Hero Movie: సూపర్ హీరో సినిమాలో బిగ్‌బాస్ బ్యూటీ
Ashu Reddy Super Hero Movie: తెలుగులో ఓ సూపర్ హీరో సినిమాను అంగీకరించింది బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి. ఈ సినిమా టైటిల్‌తో పాటు దర్శకుడు ఎవరంటే...
Ashu Reddy Super Hero Movie: టాలీవుడ్‌లో సరైన కమర్షియల్ బ్రేక్ కోసం ఎదురుచూస్తోంది బిగ్‌బాస్ బ్యూటీ అషూరెడ్డి, అడపాదడపా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నా అవేవీ ఆమె కెరీర్‌కు పెద్దగా ఉపయోగపడలేదు. తాజాగా ఆమె తెలుగులో ఓ సూపర్ హీరో సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది.
ఏ మాస్టర్ పీస్ పేరుతో రూపొందుతోన్న ఈ సినిమాకు సుకు పూర్వాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇందులో ఆద్య అనే పాత్రలో అషూరెడ్డి కనిపించబోతున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొన్నది. యాక్టింగ్‌తో పాటు గ్లామర్‌కు స్కోప్ ఉన్న క్యారెక్టర్‌లో అషూరెడ్డి కనిపించబోతున్నట్లు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు తుదిదశకు చేరుకున్నట్లు తెలిసింది. త్వరలోనే షూటింగ్ మొదలుపెట్టబోతున్నట్లు సమాచారం. నితిన్ హీరోగా నటించిన ఛల్ మోహనరంగ సినిమాతో నటిగా ప్రయాణాన్ని మొదలుపెట్టింది అషూరెడ్డి.
బిగ్‌బాస్ సీజన్ -3 కంటెస్టెంట్స్‌లో ఒకరిగా పాల్గొన్నది. రామ్‌గోపాల్‌వర్మతో చేసిన ఇంటర్వ్యూల ద్వారా ఈ మధ్య కాలంలో ఎక్కువగా పాపులర్ అయ్యింది అషూరెడ్డి.
టాపిక్