Asalu Movie Review: అసలు మూవీ రివ్యూ - రవిబాబు, పూర్ణ సినిమా ఎలా ఉందంటే
Asalu Movie Review: రవిబాబు, పూర్ణ ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా అసలు. డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ యాప్‌లో రిలీజైన ఈ సినిమా ఎలా ఉందంటే...
Asalu Movie Review: రవిబాబు(Ravibabu), పూర్ణ (Poorna) కాంబినేషన్‌లో వచ్చిన అవును సిరీస్ సినిమాలు ప్రేక్షకుల్ని అలరించాయి. లాంగ్ గ్యాప్ తర్వాత వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమా అసలు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఉదయ్, సురేష్ దర్శకత్వం వహించారు. అసలు సినిమాలో ప్రధాన పాత్రను చేస్తూనే ఈ సినిమాను నిర్మించారు రవిబాబు. థియేటర్లను స్కిప్ చేస్తూ డైరెక్ట్‌గా ఈటీవీ విన్ ఓటీటీ యాప్ ద్వారా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. నటుడిగా, నిర్మాతగా రవిబాబు ఓటీటీ ప్రేక్షకుల్ని మెప్పించాడా అన్నది తెలియాలంటే కథలోని వెళ్లాల్సిందే...
ప్రొఫెసర్ మర్డర్
ఫోరెన్సిక్ ప్రొఫెసర్ చక్రవర్తి (సూర్య) జూమ్ లో స్టూడెంట్స్‌కు క్లాస్ చెబుతుండగానే దారుణంగా హత్యకు గురవుతాడు. ఆ మర్డర్ కేసు ఇన్వెస్టిగేషన్‌ను సీబీఐ ఆఫీసర్ రంజిత్ (రవిబాబు)చేపడతాడు. చక్రవర్తి అసిస్టెంట్ వందన (పూర్ణ) సహాయంతో ఆ కేసు పరిశోధన మొదలుపెడతాడు.
చక్రవర్తి మర్డర్ కేసులో అనుమానితులుగా అతడి కొడుకు రాకేష్‌తోపాటు శేషగిరిరావు, హేమ, కిషన్‌లను రంజిత్ విచారిస్తాడు. ఈ విచారణలో చక్రవర్తి గురించి ఏం తెలిసింది? అతడిని చంపింది ఎవరు? చక్రవర్తి మర్డర్‌తో వందనకు ఎలాంటి సంబంధం ఉంది? వందన సోదరి శిరీష బ్రెయిన్‌డెడ్‌కు కారకులు ఎవరు? అన్నదే అసలు(Asalu Movie Review) సినిమా కథ.
మర్డర్ మిస్టరీ థ్రిల్లర్...
మర్డర్ మిస్టరీ సినిమాల్లో నెక్స్ట్ సీన్‌లో ఏం జరుగుతుందన్నది ప్రేక్షకుల ఊహలకు అందకూడదు. సర్‌ప్రైజింగ్ ట్విస్ట్‌లతో ఆడియెన్స్‌ను చివరి వరకు హోల్డ్ చేయాలి. వారి అటెన్షన్ కథ నుంచి మళ్లకుండా చేయగలగాలి. అప్పుడే ఈ జోనర్ సినిమాలు మెప్పిస్తాయి. అసలు(Asalu Movie Review) మూవీ కథలో అలాంటి మెరుపులు పెద్దగా లేవు. కంప్లీట్‌గా అవుట్‌డేటెడ్ పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించారు దర్శకులు ఉదయ్, సురేష్.
చివరలోసందేశం...
చక్రవర్తి మర్డర్ సీన్‌తోనే సినిమా మొదలవుతుంది. ఆ తర్వాత ఆ కేసును రంజిత్ చేపటడ్డం, ఒక్కో చిక్కుముడి విప్పుకుంటూ అసలు హంతకులను ఎలా కనిపెట్టాడన్నది క్లైమాక్స్‌లో చూపించారు. ఈ కేసుతో సంబంధం ఉన్నట్లుగా నాలుగు క్యారెక్టర్స్ ఎంట్రీ ఇవ్వడం, వారితో హతుడికి ఉన్న రిలేషన్‌షిప్‌తో ప్రీ క్లైమాక్స్ వరకు సినిమా ఎంగేజింగ్‌గా నడుస్తుంది.
ఓ వైపు మర్డర్ కేసు ఇన్వేస్టిగేషన్‌తో పాటు మరోవైపు సబ్‌ఫ్లాట్‌గా శిరీష అనే అమ్మాయి హాస్పిటల్‌లో ట్రీట్‌మెంట్ సీన్స్ కనిపిస్తుంటాయి. చివరకు ప్రొఫెసర్ మర్డర్, శిరీష ట్రీట్‌మెంట్ సీన్స్‌ను లింక్ చేస్తూ ఓ ట్విస్ట్ ఇచ్చి సినిమా ఎండ్ అవుతుంది. మర్డర్ మిస్టరీతో పాటు ఓ సందేశాన్ని ఇచ్చారు. తమకున్న అధికారాన్ని అడ్డం పెట్టుకొని కొందరు గురువులు స్టూడెంట్స్ లైఫ్‌లతో ఎలా ఆడుకుంటున్నారో ఈ సినిమాలో చూపించారు.
క్యూరియాసిటీ లేదు...
రంజిత్ అండ్ టీమ్ ఇన్వేస్టిగేషన్ ప్రాసెస్‌లో థ్రిల్, క్యూరియాసిటీ రెండు మిస్సయ్యాయి. నలుగురు అనుమానితుల్లో ఒకరు హంతకుడు అని అనుమానించేలా సీన్స్‌ను బలంగా రాసుకోలేదు. ప్రొఫెసర్ మర్డర్ వెనుక ఉన్నట్విస్ట్ రొటీన్‌గానే ఉంది. రంజిత్‌ను ఇంటలెక్చువల్‌గా పరిచయం చేసిన దర్శకులు చివరికి ఆటిజంతో బాధపడుతోన్న అతడి కొడుకు ద్వారా చక్రవర్తి మర్డర్ కేసు చిక్కుముడిని రివీల్ చేయడం అంతగా ఆకట్టుకోదు.
సీఐడీ ఆఫీసర్ గా...
సీఐడీ ఆఫీసర్ రంజిత్‌గా సీరియస్ రోల్‌లో రవిబాబు యాక్టింగ్ బాగుంది. కామెడీ టైమింగ్‌తో ఆకట్టుకున్నాడు. వందనగా భిన్న కోణాల్లో సాగే పాత్రకు పూర్ణ పూర్తిగా న్యాయం చేసింది. ఫస్ట్ హాఫ్‌లో అమాయకంగా సెకండాఫ్‌లో తనకు జరిగిన అన్యాయంపై పోరాడే తెలివిపరురాలైన యువతిగా కనిపించింది. ప్రొఫెసర్ చక్రవర్తిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో సూర్య కనిపించారు.
Asalu Movie Review - అవుట్‌డేటెడ్ థ్రిల్లర్
అసలు అవుట్‌డేటెడ్ పాయింట్‌తో సాగే సాదాసీదా మర్డర్ మిస్టరీ మూవీ. మంచి ఇన్వేస్టిగేటివ్ థ్రిల్లర్ సినిమా ఫీల్‌ను పూర్తిస్థాయిలో అందంచే మెరుపులు, మలుపులు సినిమాలో లేవు.