Suma Adda in ETV: ఈటీవీలో కొత్త ప్రోగ్రామ్ సుమ అడ్డా.. ప్రోమో చూశారా?-suma adda in etv as the new programme to start from january 7th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Suma Adda In Etv As The New Programme To Start From January 7th

Suma Adda in ETV: ఈటీవీలో కొత్త ప్రోగ్రామ్ సుమ అడ్డా.. ప్రోమో చూశారా?

సుమ అడ్డాలో కల్యాణం కమనీయం టీమ్
సుమ అడ్డాలో కల్యాణం కమనీయం టీమ్

Suma Adda in ETV: ఈటీవీలో కొత్త ప్రోగ్రామ్ సుమ అడ్డా స్టార్ట్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ ఛానెల్‌లో ఎన్నో పాపులర్‌ షోలు చేసిన సుమ.. ఇప్పుడు మరో ఎంటర్‌టైనింగ్‌ షోతో వస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజైంది.

Suma Adda in ETV: ఈటీవీలో కొత్త ప్రోగ్రామ్ సుమ అడ్డా స్టార్ట్‌ కాబోతోంది. ఇప్పటికే ఈ ఛానెల్‌లో ఎన్నో పాపులర్‌ షోలు చేసిన సుమ.. ఇప్పుడు మరో ఎంటర్‌టైనింగ్‌ షోతో వస్తోంది. దీనికి సంబంధించిన ప్రోమో కూడా రిలీజైంది.

ట్రెండింగ్ వార్తలు

Suma Adda in ETV: సుమారు మూడు దశాబ్దాలుగా తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఛానెల్‌ ఈటీవీ. ఎంటర్‌టైన్‌మెంట్ కేటగిరీలో తెలుగులోని అన్ని ప్రముఖ ఛానెల్స్‌తో పోటీలో ఎప్పుడూ టాప్‌లో ఉండటానికి ఈటీవీ కొత్త కొత్త ప్రయోగాలు చేస్తూనే ఉంటుంది. ఆ ఛానెల్‌లో ప్రతి రోజూ రాత్రి 9.30 గంటలకు వచ్చే ప్రోగ్రామ్స్‌ ఇలా ప్రయోగాల ద్వారా వచ్చినవే.

తాజాగా ఆ టైమ్‌ స్లాట్‌లో ఓ కొత్త ప్రోగ్రామ్‌ రాబోతోంది. అది ఈటీవీలో చాన్నాళ్లుగా ఎన్నో సక్సెస్‌ఫుల్‌ ప్రోగ్రామ్స్‌ చేసిన ప్రముఖ సుమ యాంకరింగ్‌లోనే కావడం విశేషం. ఈసారి ఆమె పేరుతోనే కొత్త ప్రోగ్రామ్‌ స్టార్ట్‌ చేస్తున్నారు. దాని పేరు సుమ అడ్డా. ఈటీవీలో జబర్దస్త్ లాంటి సక్సెస్ ఫుల్ షోలను నిర్మించిన మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ ఈ కొత్త షోను ప్రొడ్యూస్ చేసింది. ఇక నుంచి ప్రతి శనివారం రాత్రి 9.30 గంటలకు ఈ షో టెలికాస్ట్‌ కానుంది. జనవరి 7న తొలి ఎపిసోడ్‌ ఉంటుంది.

దీనికి సంబంధించిన ప్రోమోను గురువారం (జనవరి 5) రిలీజ్‌ చేశారు. తొలి ఎపిసోడ్‌కు కల్యాణం కమనీయం మూవీ టీమ్‌ నుంచి హీరో, హీరోయిన్‌, డైరెక్టర్‌ గెస్ట్‌లుగా వచ్చారు. వాళ్లతో సుమ తనదైన స్టైల్లో నవ్వులు పంచుతోంది. ఈ మూవీ హీరో సంతోష్‌ శోభన్‌, హీరోయిన్‌ ప్రియా భవానీ శంకర్‌, డైరెక్టర్‌ అనిల్‌ కుమార్‌ ఆళ్ల.. సుమ అడ్డా తొలి ఎపిసోడ్‌లో సందడి చేశారు.

అన్ని సుమ ప్రోగ్రామ్స్‌లాగే ఇది కూడా మంచి ఎంటర్‌టైన్‌మెంట్ పంచనుందని ప్రోమో చూస్తే తెలుస్తుంది. చాలా ఏళ్ల పాటు ఈటీవీలోని పాపులర్‌ రియాల్టీ షోల్లో ఒకటిగా నిలిచిన క్యాష్‌ స్థానంలో ఈ సుమ అడ్డా టెలికాస్ట్‌ కానుంది. ఆ షోలోలాగే సుమ అడ్డాలోనూ కాలేజీ స్టూడెంట్స్‌ను ఆడియెన్స్‌గా పిలిచారు. మూవీ టీమ్‌, ఆడియెన్స్‌ను కలిపి గేమ్స్‌ ఆడించడం సరదాగా ఉంది. ఈ షోలో భాగంగా సుమ.. సంతోష్‌ శోభన్‌ మొబైల్‌ తీసుకొని అతని వాట్సాప్‌ చెక్‌ చేయడం కూడా నవ్వు తెప్పిస్తుంది.

WhatsApp channel

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.