AR Rahman: అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే సింగర్ ఏఆర్ రెహమాన్.. ఒక్కో పాటకు ఎంత తీసుకుంటాడో తెలుసా?
AR Rahman: అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే సింగర్ గా ఏఆర్ రెహమాన్ నిలిచాడు. అతడు ఒక్కో పాటకు అందుకునే మొత్తం చూస్తే ఎవరైనా కళ్లు తేలేయాల్సిందే.
AR Rahman: ఏఆర్ రెహమాన్ దేశం గర్వించదగిన మ్యూజిక్ కంపోజర్. ఇండియా నుంచి తొలి ఆస్కార్ గెలిచిన సంగీత దర్శకుడు. అయితే దేశంలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న సింగర్ కూడా అతడే అన్న విషయం మీకు తెలుసా? మనకు సింగర్స్ అంటే అరిజిత్ సింగ్, శ్రేయా ఘోషల్, సచేత్ టాండన్ లాంటి వాళ్లు గుర్తుకు వస్తారు.
ముఖ్యంగా అరిజిత్ సింగ్ కు ఉన్న క్రేజ్ చూస్తే అతడు అత్యధిక మొత్తం అందుకునే సింగర్ అనుకుంటాం. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ ఈ లిస్టులో రెహమాన్ టాప్ లో ఉన్నాడు. ఈ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఒక్క పాట పాడటానికి రూ.3 కోట్లు తీసుకుంటాడంటే నమ్మగలరా? దేశంలోనే అత్యధిక మొత్తం అందుకున్న సింగర్ గా రెహమాన్ నిలవడం విశేషం.
ఒక్కో పాటకు ఈ స్థాయిలో అందుకునే మరో సింగర్ లేడు. కనీసం అతని దరిదాపుల్లోకి కూడా ఎవరూ రారు. ఇంత భారీ మొత్తం తీసుకుంటాడనో ఏమో ఏ ప్రొడ్యూసర్ అతనితో పాడించడానికి సాహసం చేయరు. రెహమాన్ కూడా కేవలం తాను మ్యూజిక్ కంపోజ్ చేసే సినిమాల్లో పాడటం మనం చూస్తూనే ఉంటాం. అతడు మ్యూజిక్ అందించిన లేటెస్ట్ మూవీ మామన్నన్ గురువారం (జూన్ 29) రిలీజైంది.
ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో రెహమాన్ మ్యూజిక్ అందివ్వడం మొదలుపెట్టి 30 ఏళ్లకుపైనే అయింది. 1992లో వచ్చిన రోజా మూవీ అతని కెరీర్లో మొదటిది. ఆ సినిమాతోనే రెహమాన్ పేరు మార్మోగిపోయింది. ఆ తర్వాత బాంబే, ప్రేమికుడు, రంగీలా, దిల్ సే, తాళ్ లాంటి సూపర్ డూపర్ హిట్ మూవీస్ కి మ్యూజిక్ అందించాడు. స్లమ్ డాగ్ మిలియనీర్ మూవీకిగాను రెండు ఆస్కార్స్ అందుకున్నాడు.
సంబంధిత కథనం