Miss Shetty Mr Polishetty Collection: తగ్గిన కలెక్షన్స్.. అయినా లాభాలు.. ఎన్ని కోట్ల ప్రాఫిట్ అంటే?-anushka naveen polishetty khan miss shetty mr polishetty movie 6 days worldwide box office collection ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Anushka Naveen Polishetty Khan Miss Shetty Mr Polishetty Movie 6 Days Worldwide Box Office Collection

Miss Shetty Mr Polishetty Collection: తగ్గిన కలెక్షన్స్.. అయినా లాభాలు.. ఎన్ని కోట్ల ప్రాఫిట్ అంటే?

Sanjiv Kumar HT Telugu
Sep 13, 2023 02:14 PM IST

Miss Shetty Mr Polishetty 6 Days Collection: సీనియర్ బ్యూటి అనుష్క శెట్టి, యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి తొలిసారిగా నటించిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు 6 రోజుల బాక్సాఫీస్ కలెక్షన్స్ వివరాలపై ఓ లుక్కేస్తే..

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డే 6 కలెక్షన్స్
మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి డే 6 కలెక్షన్స్

తెలుగు రాష్ట్రాల్లో 6వ రోజు

ట్రెండింగ్ వార్తలు

మహేశ్ బాబు పచ్చిగొల్ల డైరెక్ట్ చేసిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రానికి తొలి రోజు నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది. దీంతో సినిమాను చూసేందుకు ప్రేక్షకులు ఉత్సాహం చూపిస్తున్నారు. ఇలా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు 6వ రోజున తెలుగు రాష్ట్రాల్లోని నైజాంలో రూ. 38 లక్షలు, సీడెడ్‍లో రూ. 6 లక్షలు, ఆంధ్రప్రదేశ్‍లో రూ. 30 లక్షలు వసూలు అయ్యాయి. దీంతో మొత్తంగా 6వ రోజు రూ. 74 లక్షల షేర్, రూ. 1.30 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ అయ్యాయి.

ప్రపంచవ్యాప్తంగా

మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి 6 రోజులకు కలిపి నైజాంలో రూ. 4.95 కోట్లు, సీడెడ్‍లో రూ. 80 లక్షలు, ఆంధ్రప్రదేశ్‍లో రూ. 3.15 కోట్లు వసూలు కాగా.. మొత్తంగా రూ. 8.90 కోట్లు షేర్, రూ. 15.70 కోట్ల గ్రాస్ సాధించింది. అలాగే, కర్ణాటక రెస్టాఫ్ ఇండియాలో ఆరు రోజులకు రూ. 1.24 కోట్లు, ఓవర్సీస్‍లో రూ. 5.75 కోట్లు షేర్ వసూలు అయింది. ఇలా మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రం వరల్డ్ వైడ్‍గా 6 రోజులన్నింటికి రూ. 15.89 కోట్ల షేర్, 30.80 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది.

లాభమెంతంటే?

ఫుల్ లెంత్ కామెడీ ఎంటర్టైనర్‍గా వచ్చిన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీకి వరల్డ్ వైడ్‍గా రూ. 13.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ నమోదు అయింది. అయితే, చిత్రానికి 6 రోజుల్లో రూ. 15.89 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. అంటే అనుష్క, నవీన్ పోలిశెట్టి సినిమాకు బ్రేక్ ఈవెన్ టార్గెట్ పూర్తి కావడమే కాకుండా రూ. 2.39 కోట్లు లాభం వచ్చింది. దీంతో మిస్ శెట్టి మిస్టర్ నవీన్ పోలిశెట్టి సినిమా సూపర్ హిట్‍గా నిలిచింది.

ఏరోజున ఎంత వచ్చింది

సెప్టెంబర్ 7న విడుదలైన మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాకు తొలి రోజున వరల్డ్ వైడ్‍గా రూ. 3 కోట్ల షేర్, రూ. 5.95 గ్రాస్ వచ్చింది. అలాగే రెండో రోజున రూ. 2.26 కోట్ల షేర్, రూ. 4.55 గ్రాస్, మూడో రోజు రూ. 3.58 కోట్ల షేర్, రూ. 6.70 గ్రాస్, 4వ రోజున రూ. 4.36 కోట్ల షేర్, రూ. 8.45 గ్రాస్, ఐదో రోజున రూ. 1.48 కోట్ల షేర్, రూ. 2.80 గ్రాస్, ఆరవ రోజున రూ. 1.21 కోట్ల షేర్, రూ. 2.35 గ్రాస్ వసూళ్లు కలెక్ట్ చేసింది. అంటే అన్నింట్లోకి ఆరో రోజునే కలెక్షన్స్ తక్కువగా వచ్చినట్లు తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.