Ante Sundaraniki TRP: నానికి షాక్‌.. టీవీలో 'అంటే సుందరానికి' లోయెస్ట్‌ టీఆర్‌పీ-ante sundaraniki trp is a new shocker for nani and tollywood ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ante Sundaraniki Trp: నానికి షాక్‌.. టీవీలో 'అంటే సుందరానికి' లోయెస్ట్‌ టీఆర్‌పీ

Ante Sundaraniki TRP: నానికి షాక్‌.. టీవీలో 'అంటే సుందరానికి' లోయెస్ట్‌ టీఆర్‌పీ

HT Telugu Desk HT Telugu
Oct 14, 2022 01:03 PM IST

Ante Sundaraniki TRP: నానికి షాక్‌ తగిలింది. టీవీలో అతని లేటెస్ట్‌ మూవీ 'అంటే సుందరానికి' లోయెస్ట్‌ టీఆర్‌పీ నమోదు చేసింది. ఈ మధ్య కాలంలో చాలా సినిమాకు ఎదురవుతున్న పరిస్థితే ఇప్పుడు ఈ సినిమాకూ ఎదురైంది.

అంటే సుందరానికి మూవీ ఓ కామెడీ ఎంటర్ టైనర్
అంటే సుందరానికి మూవీ ఓ కామెడీ ఎంటర్ టైనర్

Ante Sundaraniki TRP: తెలుగు ప్రేక్షకులు శాటిలైట్‌ ఛానెల్స్‌లో సినిమాలు చూడటం తగ్గించేస్తున్నారా? ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్‌, కేజీఎఫ్‌ 2, సూపర్‌స్టార్‌ మహేష్‌ బాబు నటించిన సర్కారు వారి పాట సినిమాలకు కూడా టీవీల్లో టీఆర్‌పీలు దారుణంగా ఉండటం మనం చూశాం. తాజాగా నాని అంటే సుందరానికి మూవీకి అయితే మరీ దారుణమైన టీఆర్‌పీలు వచ్చాయి.

సాధారణంగా ఏ పెద్ద సినిమా అయినా టీవీల్లోకి వస్తే అవి 15-20 మధ్య టీఆర్పీలు నమోదు చేస్తుంటాయి. ఆ మధ్య రిలీజైన అల్లు అర్జున్‌ అల వైకుంఠపురంలో మూవీ ఏకంగా 29.4 రేటింగ్‌ పాయింట్స్‌తో రికార్డు సృష్టించింది. ఇక థియేటర్లతోపాటు ఓటీటీలోనూ సంచలనం సృష్టించిన ఆర్‌ఆర్‌ఆర్ వచ్చినప్పుడు ఈ రికార్డు బ్రేక్‌ అవుతుందని భావించినా.. అది కేవలం 19 రేటింగ్‌తో సరిపెట్టుకుంది.

ఆ తర్వాత కేజీఎఫ్‌ 2, సర్కారు వారి పాట సినిమాలైతే 9కే పరిమితమయ్యాయి. ఇప్పుడు నాని అంటే సుందరానికి మూవీ మరీ దారుణంగా 1.88 టీఆర్పీ నమోదు చేయడం అతనికే కాదు మొత్తం టాలీవుడ్‌ ఇండస్ట్రీకే మింగుడు పడటం లేదు. ఈమధ్యే అంటే సుందరానికి మూవీ జెమిని టీవీలో వచ్చింది. జూన్‌ 10న రిలీజైన ఈ సినిమాకి మరీ అంత నెగటివ్‌ రివ్యూలు కూడా రాలేదు. బాక్సాఫీస్‌ దగ్గర కూడా రూ.38 కోట్లు వసూలు చేసింది.

ఎందుకీ దుస్థితి?

ఏ రకంగా చూసినా టీవీల్లో మరీ ఇంత తక్కువ టీఆర్పీ వస్తుందని మాత్రం ఎవరూ ఊహించి ఉండరు. అయితే కొన్నాళ్లుగా పెద్ద సినిమాలకు పడిపోతున్న టీఆర్పీలు చూస్తుంటే.. ప్రేక్షకులు శాటిలైట్‌ ఛానెల్స్‌లో చూడటం తగ్గించేస్తున్నారా అన్న సందేహం కలుగుతోంది.

ఇప్పుడు సినిమాలన్నీ చాలా ఎక్కువ థియేటర్లలో రిలీజ్‌ అవుతుండటం, ఆ తర్వాత త్వరగానే ఓటీటీల్లోకి వచ్చేస్తుండటం.. క్రమంగా స్మార్ట్‌టీవీలు, ఓటీటీల వినియోగం పెరిగిపోతుండటంతో శాటిలైట్‌ ఛానెల్స్‌లోకి ఓ సినిమా వచ్చే వరకూ వేచి చూడటం లేదని అర్థమవుతోంది.

మరీ గొప్ప సినిమా అయితేనే ఎంతోకొంత టీఆర్పీలు వస్తున్నాయి. నాని అంటే సుందరానికి మూవీకి మరీ అంత గొప్ప రివ్యూలు రాలేదు. పైగా చాలా రోజుల కిందటే నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోకి వచ్చింది. థియేటర్లలో మిస్‌ అయిన వాళ్లు ఇప్పటికే చాలా వరకూ ఆ ఓటీటీలో మూవీ చూసే ఉంటారు.

IPL_Entry_Point

టాపిక్