Telugu News  /  Entertainment  /  Dhoom Dhaam Dhosthaan Song From Dasara Movie Released
దసరా మూవీలోని ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ లో నాని అండ్ టీమ్
దసరా మూవీలోని ధూమ్ ధామ్ దోస్తాన్ సాంగ్ లో నాని అండ్ టీమ్

Dhoom Dhaam Dhosthaan song: నాని మాస్‌ బీట్‌.. దసరా నుంచి ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్

03 October 2022, 19:02 ISTHT Telugu Desk
03 October 2022, 19:02 IST

Dhoom Dhaam Dhosthaan song: నాని మాస్‌ బీట్‌తో వచ్చాడు. అతని లేటెస్ట్‌ మూవీ దసరా నుంచి అదే దసరా పండుగకు రెండు రోజుల ముందు (అక్టోబర్‌ 3) ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ సాంగ్ రిలీజైంది.

Dhoom Dhaam Dhosthaan song: టాలీవుడ్‌ నేచురల్‌ స్టార్‌ నాని అంటే సుందరానికి తర్వాత నటిస్తున్న మూవీ దసరా. ఇందులో ఓ కూలీగా కనిపిస్తున్న అతడు.. పక్కా మాస్‌ లుక్‌లో అదరగొడుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి అతని ఫస్ట్‌ లుక్‌ రిలీజ్‌ కాగా.. తాజాగా దసరా పండుగకు రెండు రోజుల ముందు అంటే సోమవారం (అక్టోబర్‌ 3) ధూమ్‌ ధామ్‌ దోస్తాన్‌ అనే మాస్‌ లిరికల్‌ సాంగ్‌ రిలీజ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

ఈ సినిమాలో నాని పక్కా మాస్‌ బీట్స్‌, స్టెప్పులతో ఇరగదీశాడు. ఈ సాంగ్‌లోని లిరిక్స్‌ కూడా ఊర మాస్‌గా ఉన్నాయి. "ఉంటే వైకుంఠం.. లేకుంటే ఊకుంటం.. అంత లావైతే గుంజుకుంటం.. తింటం.. పంటం.. బద్దలు బాసింగాలైతై" అంటూ మొదలయ్యే ఈ పాటలోకి నాని మాస్‌ ఎంట్రీ ఇచ్చాడు. "మా మామగాడు చెప్పుడు సరే.. మీరు కొట్టుడు సరే.. అరె ఓ నైన్టీ.. వీళ్లకింకో నైన్టీ పొయ్‌రా" అంటూ నాని పక్కా తెలంగాణ యాసలో చెప్పిన డైలాగ్‌ సాంగ్‌కే హైలైట్‌.

ఈ సాంగ్‌ రిలీజ్‌ అయిన వెంటనే విపరీతమైన బజ్‌ క్రియేట్‌ అయింది. ఈ ఏడాది వచ్చిన మాస్‌ నంబర్స్‌లో ఇదే టాప్‌ అన్నట్లుగా వైరల్‌గా మారిపోయింది. ఈ దసరా మూవీ కోసం నాని లుక్‌ పూర్తిగా మారిపోయింది. ఈ సినిమాలో అతడు ఎలా కనిపించబోతున్నాడో ఈ పాటతో తేలిపోయింది. సంతోష్‌ నారాయణ్‌ ఈ పాటకు మాస్‌ బీట్స్‌ అందించగా.. రాహుల్‌ సిప్లిగంజ్, పాలమూరు జంగిరెడ్డి, నర్సమ్మ, గొట్టె కనకవ్వ, గన్నోరా దాస లక్ష్మిలు ఈ పాట పాడారు.

కాసర్ల శ్యామ్‌ ఈ పాటకు లిరిక్స్‌ అందించాడు. తెలంగాణ స్టైల్‌ మాస్‌ సాంగ్‌కు తీన్మార్‌ బీట్స్‌తో ఈ దసరాకు అందరితో స్టెప్పులేయించేలా పాట సాగింది. ఈ దసరా మూవీని శ్రీకాంత్‌ ఓదెల డైరెక్ట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. శ్రీ లక్ష్మీవెంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌లో చెరుకూరి సుధాకర్‌ ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక దసరాలో కీర్తి సురేశ్‌ ఫిమేల్‌ లీడ్‌లో కనిపించనుంది.

సముద్రఖని, సాయి కుమార్‌, జరీనా వహాబ్‌లు ఇతర ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ దసరా కూడా పాన్‌ ఇండియా మూవీగా రాబోతోంది. తెలుగుతోపాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో 2023, మార్చి 30వ తేదీని రిలీజ్‌ కాబోతోంది.