RRR Trp Rating: బుల్లితెర‌పై రాజ‌మౌళికి షాక్ – టీఆర్‌పీ రేటింగ్స్ టాప్ టెన్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కు దక్కనిచోటు-rrr trp rating rajamouli film fails to attract tv audience ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Rrr Trp Rating Rajamouli Film Fails To Attract Tv Audience

RRR Trp Rating: బుల్లితెర‌పై రాజ‌మౌళికి షాక్ – టీఆర్‌పీ రేటింగ్స్ టాప్ టెన్ సినిమాల్లో ఆర్ఆర్ఆర్ కు దక్కనిచోటు

HT Telugu Desk HT Telugu
Aug 25, 2022 01:22 PM IST

ఎన్టీఆర్‌(Ntr),రామ్‌చ‌ర‌ణ్ (Ramcharan)హీరోలుగా రాజ‌మౌళి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఆర్ఆర్ఆర్(RRR). 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి చ‌రిత్ర‌ను సృష్టించింది. ఇటీవ‌లే ఈ సినిమా బుల్లితెర‌పై సంద‌డి చేసింది. ఈ తొలి టీవీ ప్రీమియ‌ర్‌కు వ‌చ్చిన టీఆర్‌పీ రేటింగ్స్ ఎంతంటే...

ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్
ఎన్టీఆర్‌,రామ్‌చ‌ర‌ణ్ (Twitter)

RRR Trp Rating: థియేట‌ర్ల‌లో అద్వితీయ విజ‌యాన్ని సొంతం చేసుకున్న ఆర్ఆర్ఆర్ బుల్లితెర‌పై మాత్రం నిరాశ‌ప‌రిచింది. లోయెస్ట్ టీఆర్‌పీ రేటింగ్స్ తో రాజ‌మౌళికి బుల్లితెర ప్రేక్ష‌కులు పెద్ద షాక్ ఇచ్చారు. కొమురం భీమ్‌, అల్లూరి సీతారామ‌రాజు పాత్ర‌ల‌కు ఫిక్ష‌న‌ల్ అంశాల‌ను జోడిస్తూ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా ఆర్ఆర్ఆర్ సినిమాను రాజ‌మౌళి తెర‌కెక్కించారు. ఎన్టీఆర్‌, రామ్‌చ‌ర‌ణ్ యాక్టింగ్ తో పాటు రాజ‌మౌళి టేకింగ్‌, వీరోచిత‌మైన యాక్ష‌న్ స‌న్నివేశాలు థియేట‌ర్ల‌లో ప్రేక్ష‌కుల్ని అల‌రించాయి. వ‌ర‌ల్డ్‌వైడ్‌గా దాదాపు 1200 కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది.

ఇండియ‌న్ సినిమా హిస్ట‌రీలోనే అత్య‌ధిక క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా నిలిచింది. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ రేసులో నిలిచే అవ‌కాశం ఉన్న‌ట్లు హాలీవుడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. ఇటీవ‌ల ఈ సినిమా స్టార్ మా టెలికాస్ట్ అయ్యింది. టీవీ ప్రీమియ‌ర్ ఇదే తొలిసారి కావ‌డంతో భారీగా టీఆర్‌పీ రేటింగ్స్ వస్తాయని అందరూ అనుకున్నారు. కానీ అంద‌రి అంచ‌నాల‌ను త‌ల‌క్రిందులు చేస్తూ ఈ సినిమా 19.62 టీఆర్‌పీ రేటింగ్ పాయింట్స్ మాత్ర‌మే సొంతం చేసుకున్న‌ది.

ఇప్ప‌టివ‌ర‌కు టాలీవుడ్‌లో అల వైకుంఠ‌పుర‌ములో 29.4 టీఆర్‌పీ రేటింగ్స్ తో టాప్ ప్లేస్‌లో ఉంది. ఆ త‌ర్వాతి స్థానాల్లో స‌రిలేరు నీకెవ్వ‌రు, బాహుబ‌లి, శ్రీమంతుడు, పుష్ప ఉన్నాయి. టాప్ టెన్ లో ఆర్ఆర్ఆర్ కు చోటు ద‌క్క‌లేదు. ఫిదా, గీతాగోవిందం కంటే ఆర్ఆర్ఆర్ కు త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్స్ రావ‌డం గ‌మ‌నార్హం. తొలి టీవీ ప్రీమియ‌ర్ కు త‌క్కువ టీఆర్‌పీ రేటింగ్స్ రావ‌డం హాట్‌టాపిక్‌గా మారింది.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.