KGF 2 Trp Rating: థియేటర్లలో హిట్ బుల్లితెరపై ఫట్ - కేజీఎఫ్ 2కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్-kgf 2 trp rating yash movie gets shocking trp rating ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Kgf 2 Trp Rating Yash Movie Gets Shocking Trp Rating

KGF 2 Trp Rating: థియేటర్లలో హిట్ బుల్లితెరపై ఫట్ - కేజీఎఫ్ 2కు షాకింగ్ టీఆర్‌పీ రేటింగ్

Nelki Naresh Kumar HT Telugu
Sep 02, 2022 02:13 PM IST

KGF 2 Trp Rating: యశ్ (Yash)హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందిన కేజీఎఫ్ 2 చిత్రం ఈ ఏడాది ఇండియన్ సినిమా ఇండస్ట్రీలోనే బిగ్గెస్ట్ హిట్ లలో ఒకటిగా నిలిచింది. ఇటీవల టీవీలో ఈ సినిమా తొలిసారి టెలికాస్ట్ అయ్యింది. ఈ సినిమాకు వచ్చినటీఆర్‌పీరేటింగ్ ఎంతంటే...

యశ్
యశ్

KGF 2 Trp Rating: ఈ ఏడాది యశ్ హీరోగా నటించిన కేజీఎఫ్ 2 సృష్టించిన హంగామా అంతా ఇంతా కాదు. కన్నడ, బాలీవుడ్, టాలీవుడ్ తో పాటు ప్రతి భాషలో హయ్యెస్ట్ గ్రాసర్ గా కేజీఎఫ్ 2 నిలిచింది. బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షాన్ని కురిపించిన ఈ సినిమా 1200 కోట్లకుపైగా కలెక్షన్స్ రాబట్టింది. దేశ సినీ చరిత్రలో అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాల్లో ఒకటిగా కేజీఎఫ్ 2 నిలిచింది.

యశ్ హీరోయిజం, ఎలివేషన్స్ తో థియేటర్లు దద్దరిల్లిపోయాయి. ప్రశాంత్ నీల్ (Prashanth Neel) టేకింగ్ కు అన్ని ఇండస్ట్రీల వారు ఫిదా అయిపోయారు. థియేటర్లలో సెన్సేషనల్ హిట్ గా నిలిచిన ఈ సినిమా బుల్లితెరపై మాత్రం ఆకట్టుకోలేకపోయింది.

ఇటీవల జీ తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. ఇదే తొలి టీవీ ప్రీమియర్ కావడంతో చిత్ర యూనిట్ కూడా భారీగా ప్రమోషన్స్ చేసింది. కానీ ఈ సినిమాకు కేవలం 9.15 టీఆర్‌పీ రేటింగ్ మాత్రమే వచ్చింది. కేజీఎఫ్ పార్ట్ వన్ 11.9 టీఆర్‌పీ రేటింగ్ ను సొంతం చేసుకున్నది. పార్ట్ వన్ కంటే తక్కువగా పార్ట్ 2కు టీఆర్‌పీ రేటింగ్స్ రావడం చర్చనీయాంశంగా మారింది.

డబ్బింగ్ సినిమాల్లో రోబో 19.4, బిచ్చగాడు 18.75, కబాలి 14.52 టీఆర్‌పీ రేటింగ్ సాధించాయి. రొబో, బిచ్చగాడులో సగమే సగం కూడా టీఆర్‌పీ రేటింగ్ కేజీఎఫ్ 2కు రాకపోవడం షాక్ కు గురిచేస్తోంది.

IPL_Entry_Point