Annapurna Photo Studio OTT Release: 'అన్నపూర్ణ ఫొటోస్టూడియో' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?-annapurna photo studio ott release announced officially set to stream from august 15 on etv win ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Annapurna Photo Studio Ott Release: 'అన్నపూర్ణ ఫొటోస్టూడియో' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Annapurna Photo Studio OTT Release: 'అన్నపూర్ణ ఫొటోస్టూడియో' సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Chatakonda Krishna Prakash HT Telugu
Aug 05, 2023 02:09 PM IST

Annapurna Photo Studio OTT Release: అన్నపూర్ణ ఫొటో స్టూడియో సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ అధికారికంగా ప్రకటించింది.

అన్నపూర్ణ ఫొటో స్టూడియో
అన్నపూర్ణ ఫొటో స్టూడియో

Annapurna Photo Studio OTT Release: ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయింది. ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ ఖరారైంది. సురేశ్ ప్రొడక్షన్స్ బ్యానర్ అన్నపూర్ణ ఫొటో స్టూడియో మూవీని సమర్పించడంతో మంచి క్రేజ్ ఏర్పడింది. ‘30 వెడ్స్ 21’ సిరీస్ ఫేమ్ చైతన్య రావ్ హీరోగా నటించిన ఈ చిత్రం జూలై 21న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ అయింది. మిక్స్డ్ టాక్ తెచ్చుకుంది. మోస్తరుగా కలెక్షన్లను సాధించింది. అయితే, ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని చాలా మంది ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలో ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అధికారికంగా ప్రకటించింది.

‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ సినిమాను ఆగస్టు 15వ తేదీన స్ట్రీమింగ్‍ తీసుకురానుంది ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్. ఈ విషయాన్ని ఓటీటీ విన్ నేడు అధికారికంగా ప్రకటించింది. “మైమరిపించే రెట్రో రొమాన్స్, గుండె తాకే సస్పెన్స్ జర్నీకి సిద్ధమవండి. సీక్రెట్స్ బయటికి వచ్చే విలేజ్‍లోకి అడుగుపెట్టండి. అన్నపూర్ణ ఫొటో స్టూడియో ఈటీవీ విన్‍లో ఆగస్టు 15వ తేదీ నుంచి” అని ఈటీవీ విన్ ప్లాట్‍ఫామ్ ట్వీట్ చేసింది.

లవ్, కామెడీ, క్రైమ్ అంశాల కలబోతతో 1980ల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు చందు ముద్దు. చైతన్య రావ్, లావణ్య్ హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాతో చైతన్య మరోసారి తన కామెడీ టైమింగ్ నిరూపించుకున్నాడు. బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌పై యశ్ రంగినేని ఈ చిత్రాన్ని నిర్మించగా.. ప్రముఖ బ్యానర్ సురేశ్ ప్రొడక్షన్స్ సమర్పించింది. ప్రిన్స్ హెన్రీ ఈ సినిమాకు మ్యూజిక్ అందించాడు.

‘అన్నపూర్ణ ఫొటో స్టూడియో’ చిత్రంలో ఉత్తర, మిహిర, వైవా రాఘవ, యశ్ రంగినేని, వాసు ఇంటూరి కీలకపాత్రల్లో నటించారు. కామెడీతో క్రైమ్ ట్విస్టులతో ఈ చిత్రం మెప్పిస్తుంది. రెట్రో లవ్ స్టోరీలా ఆకట్టుకుంటుంది. 1980ల నాటి బ్యాక్‍డ్రాప్‍ కావడంతో వింటేజ్ ఫీల్‍ను ఇస్తుంది.

IPL_Entry_Point