Anchor Vishnupriya: పెళ్లయిన హీరోతో విష్ణుప్రియ లవ్ ఎఫైర్.. ప్రపోజ్ కూడా చేసిందట-anchor vishnupriya says she proposed a married hero ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Anchor Vishnupriya: పెళ్లయిన హీరోతో విష్ణుప్రియ లవ్ ఎఫైర్.. ప్రపోజ్ కూడా చేసిందట

Anchor Vishnupriya: పెళ్లయిన హీరోతో విష్ణుప్రియ లవ్ ఎఫైర్.. ప్రపోజ్ కూడా చేసిందట

Hari Prasad S HT Telugu
May 03, 2023 04:30 PM IST

Anchor Vishnupriya: పెళ్లయిన హీరోతో విష్ణుప్రియ లవ్ ఎఫైర్ నడుస్తోందట. ఇప్పటికే తాను ప్రపోజ్ కూడా చేసినట్లు ఆమె చెప్పడం విశేషం. ఆ హీరో నుంచి రిప్లై కోసం వెయిట్ చేస్తున్నట్లు చెప్పింది.

యాంకర్ విష్ణుప్రియ
యాంకర్ విష్ణుప్రియ

Anchor Vishnupriya: తెలుగు టీవీ ఛానెల్స్ లోని హాట్ యాంకర్లలో విష్ణుప్రియ కూడా ఒకరు. యూత్ ను అలరించే ఎన్నో షోలతో ఆమె పాపులర్ అయింది. తన అందంతోపాటు చలాకీతనం ఆడియెన్స్ ను ఆకట్టుకుంటుంది. సోషల్ మీడియాలోనూ ఆమెకు ఫాలోయింగ్ ఎక్కువే. తన హాట్ అందాలను చూపిస్తూ ఆమె చేసే పోస్టులకు లక్షల సంఖ్యలో లైక్స్ కూడా వస్తాయి.

ప్రస్తుతం విష్ణుప్రియకు ఇన్‌స్టాలో 11 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఆమెపై మనసు పారేసుకున్న వారు కూడా చాలా మంది ఉన్నారు. అయితే విష్ణుప్రియ మనసుకు నచ్చిన వ్యక్తి మాత్రం మరొకరు ఉన్నారట. ఈ విషయాన్ని ఆమెనే వెల్లడించింది. తనకు ఇప్పటికే లవ్ ఎఫైర్ ఉందని ఆమె చెప్పడం విశేషం. ఆమె కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

స్టార్ మాలో వస్తున్న సిక్త్స్ సెన్స్ షోలో ఆమె ఈ మధ్యే పార్టిసిపేట్ చేసింది. మరో యాంకర్ రవితో కలిసి ఈ షోకు ఆమె వచ్చింది. ఈ సందర్బంగా హోస్ట్ ఓంకార్ ఆమెను లవ్ ఎఫైర్ గురించి అడిగాడు. దీనికి ఆమె ఎలాంటి తడబాటు లేకుండా సమాధానం చెప్పింది. సాధారణంగా తమ ఎఫైర్లను సీక్రెట్ గా ఉంచడానికే చాలా మంది ఇష్టపడతారు.

కానీ విష్ణుప్రియ మాత్రం తాను హీరో జేడీ చక్రవర్తిని ఇష్టపడుతున్నట్లు చెప్పడం విశేషం. అతనికి ఇప్పటికే పెళ్లయిన విషయం తెలిసిందే. అయితే అతనిపై తాను ఎలా మనసు పారేసుకున్నానో కూడా విష్ణుప్రియ చెప్పుకొచ్చింది.

"నేను జేడీ చక్రవర్తిని ఇష్టపడ్డాను. ఓ వెబ్ సిరీస్ కోసం అతనితో కలిసి మంగళూరులో 40 రోజులు ఉన్నాను. గతేడాది ప్రపోజ్ కూడా చేశాను. జేడీ చక్రవర్తిని నేను చాలా ఇష్టపడ్డాను. ఇక పెళ్లి గురించి చెప్పాలంటే.. అతనికి ప్రపోజ్ అయితే చేశాను. అతని నుంచి రెస్పాన్స్ ఇంకా రాలేదు" అని విష్ణుప్రియ చెప్పింది. 2016లో జేడీ చక్రవర్తి పెళ్లి చేసుకున్నాడు. అయితే ఇప్పటికైనా సరే అతని తల్లి అంగీకరిస్తే కోడలిగా వెళ్లడానికి సిద్ధమేనని అనడం విశేషం.

సంబంధిత కథనం