Crakk OTT: ఓటీటీలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?-amy jackson nora fatehi bollywood movie crakk premiere on disney hotstar from april 26th ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Crakk Ott: ఓటీటీలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?

Crakk OTT: ఓటీటీలోకి అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి బాలీవుడ్ యాక్ష‌న్ మూవీ - స్ట్రీమింగ్ ఎప్పుడు..ఎందులో అంటే?

Nelki Naresh Kumar HT Telugu
Apr 20, 2024 09:00 AM IST

Crakk OTT: అమీజాక్స‌న్‌, నోరా ఫ‌తేహి హీరోయిన్లుగా బాలీవుడ్ మూవీ క్రాక్ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఏప్రిల్ 26 నుంచి డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

క్రాక్ ఓటీటీ
క్రాక్ ఓటీటీ

Crakk OTT: ప్రేమ‌, వ్య‌క్తి గ‌త జీవితంలోని ఒడిదుడుకుల కార‌ణంగా ఆరేళ్ల పాటు సినిమాల‌కు దూర‌మైంది అమీ జాక్స‌న్‌. త‌మిళ మూవీ మిష‌న్ ఛాప్ట‌ర్ వ‌న్‌తో తిరిగి యాక్టింగ్‌లోకి రీఎంట్రీ ఇచ్చింది. హిందీలో క్రాక్ పేరుతో ఓ మూవీ చేసింది అమీజాక్స‌న్‌. ఎనిమిదేళ్ల గ్యాప్ త‌ర్వాత హిందీలో అమీజాక్స‌న్ చేసిన సినిమా ఇది.

డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో...

విద్యుత్ జ‌మ్వాల్‌, అర్జున్ రాంపాల్ హీరోలుగా న‌టించిన ఈ మూవీ ఫిబ్ర‌వ‌రిలో థియేట‌ర్ల‌లో విడుద‌లైంది.యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. ఈ బాలీవుడ్ మూవీ ఏప్రిల్ 26న డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కాబోతోంది. ఈ మూవీలో అమీజాక్స‌న్‌తో పాటు నోరా ఫ‌తేహి మ‌రో హీరోయిన్‌గా న‌టించింది.

స‌ర్వైవ‌ల్ స్పోర్ట్స్‌...

టీజ‌ర్‌, ట్రైల‌ర్స్‌తో బాలీవుడ్ ప్రేక్ష‌కుల్లో ఆస‌క్తిని రేకెత్తించిన క్రాక్ థియేట‌ర్ల‌లో బిగ్గెస్ట్ డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ముంబై స్ల‌మ్ ఏరియాలో పుట్టిన సిద్ధు (విద్యుత్ జ‌మ్వాల్‌_ అనే యువ‌కుడు ఎంతో క‌ఠిన‌మైన ఇంట‌ర్నేష‌న‌ల్ అండ‌ర్‌గ్రౌండ్ స‌ర్వైవ‌ల్ స్పోర్ట్స్ పోటీల్లో ఎలా విజేత‌గా నిలిచాడు?

దేవ్ (అర్జున్ రాంపాల్‌) అనే మాఫియా డాన్‌పై సిద్ధు ప‌గ‌ను పెంచుకోవ‌డానికి కార‌ణం ఏమిటి? అత‌డిపై ఎలా రివేంజ్ తీర్చుకున్నాడ‌నే పాయింట్‌తో ద‌ర్శ‌కుడు ఆదిత్య ద‌త్ మూవీని తెర‌కెక్కించాడు. అండ‌ర్‌గ్రౌండ్ స‌ర్వైవ‌ల్ స్పోర్ట్స్ అనే పాయింట్ కొత్త‌గా ఉన్నా మిగిలిన స్టోరీ లైన్ రొటీన్ కావ‌డంతో ప్రేక్ష‌కులు క్రాక్ మూవీని ఆద‌రించ‌లేదు.

గ్లామ‌ర్ పాత్ర‌లో నోరా ఫ‌తేహి...

క్రాక్‌లో హీరోగా న‌టిస్తూ స్వ‌యంగా ఈ మూవీని విద్యుత్ జ‌మ్వాల్ ప్రొడ్యూస్ చేశాడు. ఈ సినిమాలో యాక్ష‌న్ ప్ర‌ధాన రోల్‌లో అమీజాక్స‌న్ క‌నిపించ‌గా... గ్లామ‌ర్ పాత్ర‌లో నోరా ఫ‌తేహి క‌నిపించింది.

ఐ మూవీతో...

త‌మిళ మూవీ మ‌ద‌రాసిప‌ట్ట‌ణంతో హీరోయిన్‌గా కెరీర్ ప్రారంభించింది అమీజాక్స‌న్‌. విక్ర‌మ్ హీరోగా శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌చ్చిన ఐ మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌కు చేరువైంది. టాలీవుడ్‌లో రామ్‌చ‌ర‌ణ్‌తో ఏవ‌డు సినిమాలు చేసింది. అందాల ప్ర‌ద‌ర్శ‌న విష‌యంలో ఎలాంటి హ‌ద్దులు పెట్టుకొని ఈ సుంద‌రికి త‌మిళంతో పాటు హిందీలో చ‌క్క‌టి అవ‌కాశాలు వ‌చ్చాయి. కానీ ఈ బోల్డ్ బ్యూటీ న‌టించిన సినిమాల‌న్నీ డిజాస్ట‌ర్లుగా నిల‌వ‌డంతో అమీజాక్స‌న్ ఐరెన్ లెగ్‌గా ముద్ర‌ప‌డింది. సెకండ్ ఇన్నింగ్స్ కూడా ఆమెకు పెద్ద‌గా క‌లిసిరాలేదు.ఈ ఏడాది నెల రోజుల గ్యాప్‌లోనే వ‌చ్చిన మిష‌న్ ఛాప్ట‌వ‌ర్ వ‌న్‌, క్రాక్ బాక్పాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి.

బాహుబ‌లిలో స్పెష‌ల్ సాంగ్‌...

ర‌జ‌నీకాంత్, శంక‌ర్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రోబో 2 త‌ర్వాత సినిమాల‌కు దూర‌మైంది అమీజాక్స‌న్‌. ఓ బిజినెస్ మెన్‌తో ప్రేమ‌లో ప‌డ్డ ఆమె పెళ్లి కాకుండానే త‌ల్ల‌యింది. అత‌డితో బ్రేక‌ప్ చేసుకున్న అమీజాక్స‌న్ ఓ ఫిలింమేక‌ర్‌తో ఇటీవ‌ల ఎంగేజ్‌మెంట్ చేసుకున్న‌ది.

మ‌రోవైపు నోరా ఫ‌తేహి కూడా తెలుగులో బాహుబ‌లి, ఊపిరి సినిమాల్లో స్పెష‌ల్ సాంగ్స్ చేసింది. ప్ర‌స్తుతం వ‌రుణ్‌తేజ్ మ‌ట్కాలో నోరా ఫ‌తేహి హీరోయిన్‌గా న‌టిస్తోంది. క‌రుణ‌కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది.

IPL_Entry_Point