Lal Salaam OTT: ఏజెంట్ బాట‌లో లాల్‌స‌లామ్ - ర‌జ‌నీకాంత్ మూవీ ఓటీటీ రిలీజ్ డౌటేనా? - కార‌ణం ఇదే!-lal salaam ott rajinikanth movie misses its digital release reasons here ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Lal Salaam Ott Rajinikanth Movie Misses Its Digital Release Reasons Here

Lal Salaam OTT: ఏజెంట్ బాట‌లో లాల్‌స‌లామ్ - ర‌జ‌నీకాంత్ మూవీ ఓటీటీ రిలీజ్ డౌటేనా? - కార‌ణం ఇదే!

Nelki Naresh Kumar HT Telugu
Mar 23, 2024 07:02 AM IST

Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని వార్త‌లు వినిపిస్తున్నాయి. అందుకు కార‌ణాలు ఏవంటే?

ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ ఓటీటీ
ర‌జ‌నీకాంత్ లాల్ స‌లామ్ ఓటీటీ

Lal Salaam OTT: ర‌జ‌నీకాంత్ లాల్‌స‌లామ్ ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడ‌న్న‌ది అభిమానుల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. ఫిబ్ర‌వ‌రి 9న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ ఇప్ప‌టివ‌ర‌కు ఓటీటీలోకి రాలేదు. థియేట‌ర్లలో రిలీజై న‌ల‌భై రోజులు దాటిన ఈ మూవీ ఓటీటీలో రిలీజ్ కాక‌పోవ‌డం అనుమానాల‌కు తావిస్తోంది. రిలీజ్ త‌ర్వాత ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో సినిమా ప‌రాజ‌యంపై ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేసింది.

హార్డ్ డిస్క్ మిస్సింగ్‌...

లాల్‌స‌లామ్ సినిమాకు సంబంధించి 21 రోజులు షూటింగ్ జ‌రిపిన హార్డ్ డిస్క్ మిస్స‌యింద‌ని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ చెప్పిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌తిరోజు 2500 మంది జూనియ‌ర్ ఆర్టిస్టుల‌తో...ర‌జ‌నీకాంత్‌, విష్ణువిశాల్‌, విక్రాంత్‌ల‌పై 21 రోజుల పాటు క‌ష్ట‌ప‌డి ఓ క్రికెట్ మ్యాచ్ సీన్ షూట్ చేశాం. 10 కెమెరాల‌తో ఎన్నో క‌ష్టాల కోర్చి చేసిన ఆ సీన్స్ బాగా వ‌చ్చాయి కానీ.

షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఆ ఫుటేజ్ ఉన్న హార్డ్ డిస్క్ మిస్స‌యింది. ర‌జ‌నీకాంత్‌తో పాటు మిగిలిన హీరోల లుక్ మార‌డంతో ఆ క్రికెట్ మ్యాచ్ సీన్స్‌ను రీషూట్ చేయ‌డం కుద‌ర‌లేదు. దాంతో సినిమాను రీఎడిట్ చేసి రిలీజ్ చేశాం. ఆ హార్ట్ డిస్క్‌లు ఎలా మిస్స‌య్యాయో, ఏమ‌య్యాయో తెలియ‌డ‌లేదు అని ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ ఇటీవ‌ల ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో పేర్కొన్న‌ది. ఆ సీన్స్ సినిమాలో ఉంటే రిజ‌ల్ట్ వేరుగా ఉండేద‌ని చెప్పింది.

నెట్‌ఫ్లిక్స్‌...

ఈ హార్డ్‌డిస్క్ మిస్సింగ్ ఎఫెక్ట్ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్‌పై ప‌డిన‌ట్లు స‌మాచారం. ఈ సినిమా స్ట్రీమింగ్ హ‌క్కుల‌ను భారీ ధ‌ర‌కు నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్న‌ది. నెట్‌ఫ్లిక్స్‌కు స‌మాచారం ఇవ్వ‌కుండానే క‌థ‌తో పాటు సినిమా లెంగ్త్ లో మార్పులు చేయ‌డం, క్రికెట్ సీన్స్ రీషూట్ చేయ‌కుండానే థియేట‌ర్ల‌లో రిలీజ్ చేయ‌డంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస‌పాయింట్ అయిన‌ట్లు స‌మాచారం. అందుకే లాల్‌స‌లామ్ ఓటీటీ రిలీజ్‌ను హోల్డ్‌లో పెట్టిన‌ట్లు చెబుతోన్నారు. ఇప్ప‌ట్లో లాల్‌స‌లామ్ మూవీ ఓటీటీలో రిలీజ్ కావ‌డం అనుమాన‌మేన‌ని అంటున్నారు.

ర‌జ‌నీకాంత్ గెస్ట్ రోల్‌...

లాల్ స‌లామ్ మూవీలో రజ‌నీకాంత్ హీరో అంటూ సినిమా యూనిట్ ప్ర‌చారం చేసింది. కానీ ఇందులో ఆయ‌నఎక్కువ నిడివితో కూడిన గెస్ట్ రోల్ చేశాడు. విష్ణు విశాల్‌, విక్రాంత్ హీరోలుగా న‌టించారు.

క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సోష‌ల్ మెసేజ్ క‌మ‌ర్షియ‌ల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ త‌మిళంతో పాటు తెలుగులోనూ దారుణ‌మైన ప‌రాజ‌యాన్ని మూట‌గ‌ట్టుకున్న‌ది.లాల్ స‌లామ్ మూవీతో దాదాపు తొమ్మిదేళ్ల గ్యాప్ త‌ర్వాత ర‌జ‌నీకాంత్ త‌న‌య ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్ మెగాఫోన్ ప‌ట్టింది. ధ‌నుష్ హీరోగా న‌టించిన త్రీ మూవీతో డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ ఇచ్చింది ఐశ్వ‌ర్య ర‌జ‌నీకాంత్‌. ఆ త‌ర్వాత వాయ్ రాజా వాయ్ అనే సినిమా చేసింది. లాల్‌స‌లామ్ మూవీలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టి జీవిత ఓ కీల‌క పాత్ర చేసింది.

న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌

దాదాపు న‌ల‌భై కోట్ల బ‌డ్జెట్‌తో తెర‌కెక్కిన లాల్ స‌లామ్ మూవీ త‌మిళం, తెలుగు భాష‌ల్లో క‌లిపి ప‌ది కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు భారీ న‌ష్టాల‌ను మిగిల్చింది. ర‌జ‌నీకాంత్ తెలుగు డ‌బ్బింగ్ మూవీస్‌లో అతి త‌క్కువ వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిన సినిమాల్లో ఒక‌టిగా చెత్త రికార్డును మూట‌గ‌ట్టుకున్న‌ది.

లాల్ స‌లామ్ క‌థ ఇదే...

క‌సుమూరుకు చెందిన మొయుద్దీన్ (ర‌జ‌నీకాంత్‌) గొప్ప బిజినెస్‌మెన్‌గా పేరు తెచ్చుకుంటాడు. కొడుకు శంషుద్దీన్‌ను (విక్రాంత్‌) క్రికెట‌ర్‌గా చూడాల‌న్న‌ది మొయుద్దీన్ క‌ల‌. ఊళ్లో క్రికెట్ మ్యాచ్ లో జ‌రిగిన గొడ‌వ‌లో శంషుద్దీన్ చేయిని గురు (విష్ణు విశాల్‌) న‌రికేస్తాడు.

క్రికెట్ గొడ‌వ ఊళ్లో మ‌త‌క‌ల్లోలానికి దారితీస్తుంది. త‌న కొడుకు చేయిని న‌రికిన గురును మొయిద్దీన్ ఏం చేశాడు? గురును ఊరివాళ్లు ఎందుకు వెలివేశారు? ప్రాణ‌స్నేహితులుగా ఉన్న మొయిద్దీన్‌, గురు తండ్రి ఎందుకు శ‌త్రువులుగా మారారు అన్న‌దే లాల్ స‌లామ్ మూవీ క‌థ‌.

IPL_Entry_Point

టాపిక్