Allu Arjun Remuneration: ఇండియాలో సల్మాన్, అక్షయ్ రేంజ్‌లో అల్లు అర్జున్!
Allu Arjun Remuneration: ఇండియాలో సల్మాన్, అక్షయ్ రేంజ్‌లో అల్లు అర్జున్ రెమ్యునరేషన్ అందుకుంటున్నాడట. రానున్న పుష్ప 2 మూవీతో బన్నీ ఈ రికార్డు సృష్టించనుండటం విశేషం.
Allu Arjun Remuneration: పుష్ప మూవీతో అల్లు అర్జున్ రేంజ్ ఓ లెవల్‌కు వెళ్లింది. అంతకుముందు వరకూ కేవలం టాలీవుడ్‌కే పరిమితమైన ఈ స్టైలిష్ స్టార్.. పుష్ప తర్వాత పాన్ ఇండియా స్టార్ అయిపోయాడు. ఈ మూవీకి ముందు తెలుగు రాష్ట్రాల్లో కాకుండా కేరళలోనూ బన్నీకి పెద్ద సంఖ్యలో ఫ్యాన్స్ ఉండేవారు. హిందీ బెల్ట్‌లో అతని డబ్బింగ్ మూవీస్‌కు బాగానే ఫాలోయింగ్ ఉండేది.
అయితే పుష్ప సక్సెస్‌తో అల్లు అర్జున్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మూవీలో అతని తగ్గేదే లే మేనరిజం, శ్రీవల్లి పాటకు అతని వెరైటీ స్టెప్పులు బాగా పాపులర్ అయ్యాయి. ఇక ఇప్పుడు పుష్ప 2 మూవీ ఎప్పుడొస్తుందా అని దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ మధ్యే పూజా కార్యక్రమాలు నిర్వహించుకున్న ఈ సీక్వెల్.. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.
అయితే అంతకంటే ఎన్నో రోజుల ముందు నుంచే అల్లు అర్జున్ రెమ్యునరేషన్‌పై చర్చ జరుగుతోంది. తాజాగా వస్తున్న వార్తల ప్రకారం.. ప్రస్తుతం ఇండియాలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోల లిస్ట్‌లో బన్నీ మూడో స్థానంలో ఉన్నాడట. ఇది నిజంగా చాలా పెద్ద వార్తే. పుష్ప హిట్ అవ్వడంతో ఈ సీక్వెల్‌కు భారీ బడ్జెట్ పెట్టడానికి ప్రొడ్యూసర్స్ సిద్ధమయ్యారు.
ఈ సీక్వెల్‌ను రూ.450 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అందులో రూ.125 కోట్లు అల్లు అర్జున్ రెమ్యునరేషనే కావడం విశేషం. ఈ భారీ మొత్తంతో అల్లు అర్జున్ బాలీవుడ్ స్టార్ హీరోలు సల్మాన్ ఖాన్, అక్షయ్‌కుమార్‌ల రేంజ్‌కు ఎదిగాడు. ఈ బాలీవుడ్ స్టార్లు కూడా తమ తాజా సినిమాలకు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నట్లు సమాచారం.
సల్మాన్ ఖాన్ తన నెక్ట్స్ మూవీ కిసీ కా భాయ్.. కిసీ కా జాన్ మూవీ కోసం కూడా రూ.125 కోట్లు అందుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక పుష్ప 2 మూవీ కోసం డైరెక్టర్ సుకుమార్ కూడా తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసిన విషయం తెలిసిందే. అతడు రూ.60 కోట్లు అందుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెల్‌లోనూ బన్నీ సరసన రష్మిక కనిపించనుంది. ఆమె గుడ్‌బై ట్రైలర్ లాంచ్ సందర్భంగా మాట్లాడుతూ.. మరో రెండు రోజుల్లోనే పుష్ప 2 షూటింగ్ మొదలుపెట్టనున్నట్లు చెప్పడం విశేషం.