Samantha: అక్షయ్‌తో కలిసి ఊ అంటావా మావా సాంగ్‌కు స్టెప్పులేసిన సమంత.. వీడియో-samantha danced to the tunes of oo antava mava in koffee with karan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: అక్షయ్‌తో కలిసి ఊ అంటావా మావా సాంగ్‌కు స్టెప్పులేసిన సమంత.. వీడియో

Samantha: అక్షయ్‌తో కలిసి ఊ అంటావా మావా సాంగ్‌కు స్టెప్పులేసిన సమంత.. వీడియో

HT Telugu Desk HT Telugu
Jul 20, 2022 02:22 PM IST

Samantha: నాగ చైతన్యతో విడాకుల తర్వాత పుష్ప మూవీలో సమంత రెచ్చిపోయి డ్యాన్స్‌ చేసిన పాట ఊ అంటావా మావా. ఈ సాంగ్‌ ఒక్క తెలుగు రాష్ట్రాలనే కాదు పాన్‌ ఇండియా లెవల్లో ఓ ఊపు ఊపేసింది.

<p>కాఫీ విత్ కరణ్ షోలో అక్షయ్ కుమార్ తో సమంత</p>
కాఫీ విత్ కరణ్ షోలో అక్షయ్ కుమార్ తో సమంత (Twitter)

సమంత అక్కినేని కాస్తా మళ్లీ సమంత రుత్‌ ప్రభుగా మారిన తర్వాత ఆమె వేసే ప్రతి అడుగునూ జాగ్రత్తగా గమనిస్తున్నారు ఫ్యాన్స్‌. సోషల్‌ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సామ్.. ఎప్పటికప్పుడు తన అప్‌డేట్స్‌ ఇస్తూనే ఉంటుంది. తాజాగా ఆమె బాలీవుడ్‌ దర్శక, నిర్మాత కరణ్‌ జోహార్‌ పాపులర్‌ షో కాఫీ విత్‌ కరణ్‌ షోలో కనిపించబోతోంది. గురువారం(జులై 21) రాత్రి 7 గంటలకు డిస్నీ+హాట్‌స్టార్‌లో ఈ ఎపిసోడ్‌ టెలికాస్ట్‌ కాబోతోంది.

ఈ షోకు ఆమె బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షయ్‌కుమార్‌తో కలిసి వచ్చింది. ఇప్పటికే ఈ ఎపిసోడ్‌ ప్రోమో కూడా రిలీజైంది. అందులో సమంతను అక్షయ్‌ ఎత్తుకొని సెట్స్‌లోకి తీసుకురావడం చూడొచ్చు. ఇక ఈ షోలో ఆమె పెళ్లి గురించి ఏం చెప్పింది అని అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో హాట్‌స్టార్‌ మరో వీడియోను రిలీజ్‌ చేసింది.

ఇందులో ఆమె పుష్పలో తాను నటించిన ఐటెమ్‌ సాంగ్‌ ఊ అంటావా మావా పాటకు అక్షయ్‌తో కలిసి స్టెప్పులేసింది. ఈ వీడియోను బుధవారం (జులై 20) హాట్‌స్టార్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేసింది. "కూల్‌ అండ్‌ కిల్లర్‌ కలిసి హౌజ్‌లో టెంపరేచర్‌ పెంచేస్తున్నారు. కాఫీ విత్‌ కరణ్‌ సీజన్‌ 7 ఎపిసోడ్‌ 3 జులై 21న రానుంది" అని హాట్‌స్టార్‌ ఈ వీడియోకు క్యాప్షన్‌ పెట్టింది.

మంగళవారం రిలీజ్‌ చేసిన ప్రోమోలో సమంత పెళ్లి గురించి చేసిన కామెంట్స్‌ వైరల్‌ అయ్యాయి. అందులో షో హోస్ట్‌ కరణ్‌తో సామ్‌ మాట్లాడుతూ.. "పెళ్లిళ్లు సంతోషంగా లేకపోవడానికి కారణం నువ్వే. మీరు జీవితం అంటే కే3జీ (కభీ ఖుషీ కభీ గమ్‌) అన్నట్లుగా చూపించారు. కానీ నిజానికి మాత్రం కేజీఎఫ్‌లా ఉంది" అని సమంత అనడం విశేషం. ఈ కామెంట్స్‌ను బట్టి చూస్తే పెళ్లిపై సమంత కాస్త ఘాటుగానే స్పందించినట్లు అనిపిస్తోంది. గురువారం రాబోయే ఎపిసోడ్‌తో ఈ సస్పెన్స్‌కు తెరపడనుంది.

Whats_app_banner