Allu Arjun - David Warner: డేవిడ్ వార్నర్ వీడియోకు అల్లు అర్జున్ కామెంట్.. రిప్లై ఇచ్చిన ఆస్ట్రేలియా స్టార్
Allu Arjun - David Warner: ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ చేసిన ఓ యాడ్ వీడియోకు అల్లు అర్జున్ స్పందించారు. ఆ యాడ్‍లో పుష్ప డైలాగ్ ఉండటంతో ఐకాన్ స్టార్ కామెంట్ చేశారు. దీనికి వార్నర్ కూడా రిప్లై ఇచ్చారు.
Allu Arjun - David Warner: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అంటే ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్‌కు చాలా ఇష్టం. అల్లు అర్జున్ పాటలు, డైలాగ్‍లను అనుకరిస్తూ సోషల్ మీడియాలో చాలా పోస్టులు పెట్టారు వార్నర్. అలవైకుంఠపురములో మూవీలోని బుట్టబొమ్మ నుంచి పుష్పలోని పాటలు, డైలాగ్‍లతో చాలా వీడియోలు చేశారు. ఐపీఎల్‍లో గతంలో సన్‍రైజర్స్ హైదరాబాద్‍కు ఆడటంతో తెలుగు సినిమాలకు వార్నర్ బాగా అలవాటు పడ్డారు. అలాగే, మైదానంలో చాలాసార్లు తగ్గేదెలే, శ్రీవల్లీ సాంగ్ హుక్ స్టెప్ సిగ్నేచర్ మూమెంట్స్ చేసి అభిమానులను అలరించారు. అయితే, తాజాగా ఓ యాడ్‍లో పుష్పలో లాంటి డైలాగ్ చెప్పారు వార్నర్. దీని అల్లు అర్జున్ కామెంట్ చేశారు.
ఫారినర్ కాదు.. ఫైర్
ఓ మ్యాట్రిసెస్ కంపెనీ కోసం డేవిడ్ వార్నర్ ఓ యాడ్ చేశారు. ఇందులో కొందరు అతడిని పట్టుకొని ఉంటారు. “నన్ను టూరిస్ట్ అనుకున్నావా” అంటూ అందరినీ పక్కకు నెట్టేస్తాడు వార్నర్. “నేను ఫైర్” అని చెబుతారు. పుష్ప డైలాగ్‍లా “నన్ను ఫారినర్ అనుకుంటివా.. నేను ఫైర్” అంటూ వార్నర్ డైలాగ్ చెప్పారు. ఈ యాడ్‍లో వార్నర్ షర్ట్ కూడా పుష్ప స్టైల్‍లోనే ఉంది.
ఎమోజీలతో అల్లు అర్జున్.. వార్నర్ రిప్లై
ఈ యాడ్ వీడియోను తన ఇన్‍స్టాగ్రామ్ అకౌంట్‍లో డేవిడ్ వార్నర్ పోస్ట్ చేశారు. దీనికి అల్లు అర్జున్ కామెంట్ చేశారు. నవ్వుతున్నట్టుగా మూడు ఎమోజీలు.. ఓ ఫైర్ ఎమోజీ.. మూడు థంబ్ ఎమోజీలను కామెంట్‍లో పెట్టారు. అల్లు అర్జున్ కామెంట్‍కు వార్నర్ రిప్లే ఇచ్చారు. “చాలా ఫన్నీ. మీరు లెజెండ్” అంటూ డేవిడ్ స్పందించారు.
గత నెలలో ‘పుష్ప 2: ది రూల్’ నుంచి ‘పుష్ప.. పుష్ప’ అంటూ ఫస్ట్ సాంగ్ వచ్చింది. ఈ పాటలో అల్లు అర్జున్ ఓ షూ డ్రాప్ స్టెప్ చేశారు. ఈ వీడియోకు వార్నర్ కామెంట్ చేశారు. “ఓ డియర్.. ఇది చాలా బాగుంది. ఇది చేసేందుకు నేను కష్టపడాలి” అని అల్లు అర్జున్‍ను ట్యాగ్ చేశారు వార్నర్. “ఇది చాలా ఈజీ. మనం కలిసినప్పుడు నేను చూపిస్తా” అని బన్నీ రిప్లై ఇచ్చారు.
పుష్ప 2 గురించి..
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 2: ది రూల్ చిత్రం ఈ ఏడాది ఆగస్టు 15వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. 2021లో వచ్చి బాక్సాఫీస్‍ను షేక్ చేసిన పుష్పకు సీక్వెల్‍గా ఈ చిత్రం వస్తోంది. పుష్ప 2 నుంచి ఇప్పటికే వచ్చిన రెండు పాటలు చాలా పాపులర్ అయ్యాయి. ఈ మూవీకి దేవీశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.
పుష్ప 2 సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా సాగుతోంది. త్వరలోనే పూర్తయ్యే అవకాశం ఉంది. ఈ చిత్రంలో అల్లు అర్జున్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్‍గా నటిస్తున్నారు. ఫాహద్ ఫాజిల్, జగపతి బాబు, ప్రకాశ్ రాజ్, రావు రమేశ్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ మూవీని భారీ బడ్జెట్‍తో నిర్మిస్తోంది.