Allu Arjun Blocks his Heroine: తన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?-allu arjun blocks his heroine bhanu shree mehra in twitter ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Allu Arjun Blocks His Heroine: తన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

Allu Arjun Blocks his Heroine: తన హీరోయిన్‌ను బ్లాక్ చేసిన అల్లు అర్జున్.. ఇంతకీ ఆమె ఏం చేసిందంటే?

Maragani Govardhan HT Telugu
Mar 18, 2023 03:24 PM IST

Allu Arjun Blocks his Heroine: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ వార్తాల్లో నిలిచారు. గతంలో తన వరుడు చిత్రంలో హీరోయిన్‌గా నటించిన భానుశ్రీ మెహ్రాను తన ట్విటర్‌లో బ్లాక్ చేశారు. ఈ విషయాన్ని సదరు హీరోయినే సోషల్ మీడియా వేదికగా తెలియజేసింది.

వరుడు హీరోయిన్‌‍ భానుశ్రీని బ్లాక్ చేసిన బన్నీ
వరుడు హీరోయిన్‌‍ భానుశ్రీని బ్లాక్ చేసిన బన్నీ

Allu Arjun Blocks his Heroine: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ఎలాంటి వార్త వచ్చిన అది సులభంగా ట్రెండ్ అయిపోతుంది. పుష్ప సినిమాతో పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ఈ స్టార్ వార్తల్లో నిలిచారు. ఆయన తను గతంలో నటించిన ఓ హీరోయిన్‌ను బ్లాక్ చేయడంతో సోషల్ మీడియాలో చర్చకు దారి తీశారు. ఇంతకు బన్నీ బ్లాక్ చేసిన ఆ నటి ఎవరో కాదు.. ఆయన నటించిన వరుడు సినిమా హీరోయిన్ భానుశ్రీ మెహ్రా. అయితే ఆమెను బన్నీ ఎందుకు బ్లాక్ చేశారు? అసలు భాను ఏం చేశారు? లాంటి వాటి గురించి ఇప్పుడు చూద్దాం.

అప్పట్లో వరుడు టీమ్ చిత్రానికి వైవిధ్యంగా ప్రమోషన్ నిర్వహించింది. సినిమా విడుదలయ్యే వరకు కూడా హీరోయిన్ ఎవరో ఎక్కడా విడుదల చేయలేదు. చివరి వరకు సస్పెన్స్ ఉంచి డైరెక్టుగా సినిమాలో పెళ్లి పీటలపై సన్నివేశంలో ఆమెను ముఖాన్ని రివీల్ చేశారు. ఐడియా బాగానే ఉన్నప్పటికీ సినిమా అనుకున్న స్థాయిలో ఆకట్టుకోకపోవడంతో ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు.

ప్రస్తుతం యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసి వరుసగా వీడియోలు చేస్తూ సోషల్ మీడియా క్రియేటర్‌గా గుర్తింపు తెచ్చుకుంటోంది భాను. హీరోయిన్ కావడంతో సెలబ్రెటీల అటెన్షన్ కోసం ప్రయత్నిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. అదే విధంగా సెలబ్రెటీలను ట్యాగ్ చేస్తూ తన యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేయాలని రిక్వెస్టులు పెడుతోంది. తాజాగా ఓ సరికొత్త వీడియోను పోస్ట్ చేసిన ఆమె అందరి అటెన్షన్ కోసం ప్రయత్నించి అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేస్తూ ఆయనను వివాదంలోకి లాగింది.

"నటి కంటెంట్ క్రియేటర్‌గా మారింది. నేను కేవలం వరుడు హీరోయిన్ అని నిరూపించుకోడానికి ప్రయత్నిస్తున్నాను. ఇది నా గత జీవితంలోని సుదూర జ్ఞాపకం. సబ్‌స్క్రైబ్ చేసి నాకు సహయం చేయగలరా? నా సినిమా కెరీర్ కంటే నా యూట్యూబ్ వీడియోలు మరింత వినోదాత్మకంగా ఉంటాయని నేను హామి ఇస్తున్నాను." అంటూ భాను ట్విటర్‌లో పోస్ట్ పెట్టింది. ఇంతవరకు బాగానే ఉన్నా ఈ పోస్టుకు అల్లు అర్జున్‌ను ట్యాగ్ చేయడంతో వార్తల్లో నిలిచింది.

అయితే ఆమెను అల్లు అర్జున్ బ్లాక్ చేశారు. ఇదే విషయాన్ని భానుశ్రీ తెలియజేస్తూ బన్నీ బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్‌ను షేర్ చేసింది. అంతేకాకుండా అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశారంటూ పోస్టు కూడా పెట్టింది. "మీరు ఎప్పుడైనా కష్టాల్లో కూరుకుపోయారని మీకు అనిపిస్తే ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నేను అల్లు అర్జున్‌తో వరుడులో నటించాను. కానీ ఇప్పటికీ నాకు ఎలాంటి ఆఫర్లు రాలేదు. నేను నా పోరాటంలోనూ హాస్యాన్ని, వినోదాన్ని కనుగొన్నాను. నేర్చుకున్నాను. ఇప్పుడు అల్లు అర్జున్ నన్ను ట్విటర్‌లో బ్లాక్ చేశారు. అయినా సరే వెళ్లి నా ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి" అని భానుశ్రీ ట్వీట్ చేసింది.

అల్లు అర్జున్ తనను బ్లాక్ చేశారని బహిరంగంగా చెప్పడంతో నెటిజన్లు, బన్నీ ఫ్యాన్స్ భానుశ్రీపై ఓ రేంజ్‌లో ట్రోలింగ్ చేస్తున్నారు. అందరి అటెన్షన్ కోసం కావాలనే స్టైలిష్ స్టార్‌కు ట్యాగ్ చేసి పబ్లిసిటీ స్టంట్ అవలంభిస్తుందని కొంతమంది ఆమెపై విరుచుకుపడుతున్నారు. వరుసగా ట్వీట్లు చేయడం ద్వారా ప్రతి ఒక్కరిని స్పామ్‌లో ఇరికించేందుకు ప్రయత్నిస్తుందని, యూట్యూబ్ లింక్స్ పోస్ట్ చేయడం ద్వారా స్పామ్‌కు కారణమవుతుందని మరికొంతమంది వాదిస్తున్నారు. ఈ విధంగా చేస్తే అల్లు అర్జునే కాదు.. ప్రతి ఒక్కరూ ఆమెను బ్లాక్ చేస్తారని స్పష్టం చేస్తున్నారు.

వీటిపై కూడా భానుశ్రీ స్పందించింది. తానేమి స్పామ్ లింక్స్, నెగిటివిటీని వ్యాప్తి చేయట్లేదని, కేవలం జోకులు, లైఫ్ ఎలా ఎంజాయ్ చేయాలి లాంటి విషయాలనే తెలియజేస్తున్నానని స్పష్టం చేసింది. అంతేకాకుండా తన ఛానల్ కంటే బెటర్ ఛానల్ లేదని కూడా తెలిపింది.

అల్లు అర్జున్ ఆమెను బ్లాక్ చేయడం వరకు ఓకే కానీ.. ఎందుకు చేశారనేదానిపై స్పష్టత లేదు. అయితే ఎక్కువ మంది స్పామ్ కారణంగానే ఆమెను బ్లాక్ చేశారని భావిస్తున్నారు. ఈ విషయంపై బన్నీ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. భానుశ్రీ మెహ్రా విషయానికొస్తే తెలుగులో వరుడు చిత్రంతో అరంగేట్రం చేసిన ఈ ముద్దుగుమ్మ డింగ్ డాంగ్ బెల్, గోవిందుడు అందరివాడేలే, బ్రదర్ ఆఫ్ బొమ్మాళి, అలా ఎలా, రన్, మిస్ ఇండియా లాంటి పలు చిత్రాల్లో నటించింది. అయితే ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

టీ20 వరల్డ్ కప్ 2024