Allu Arjun: అల్లు అర్జున్‌తో చర్చించిన అట్లీ.. 'AAA' సాధ్యమవుతుందా!
Allu Arjun: స్టార్ హీరో అల్లు అర్జున్‌తో సినిమా చేసేందుకు తమిళ దర్శకుడు అట్లీ చర్చించినట్టు సమాచారం బయటికి వచ్చింది. దీంతో వీరి కాంబినేషన్లో త్వరలో ప్రకటన రానుందా అనేది చూడాలి.
Allu Arjun: ఐకాన్ స్టార్, టాలీవుడ్ హీరో అల్లు అర్జున్.. ప్రస్తుతం దేశంలోని మోస్ట్ వాటెండ్ హీరోగా ఉన్నారు. వివిధ సినీ ఇండస్ట్రీలకు కొందరు దర్శకులు ఆయనతో మూవీ చేయాలని ఆశిస్తున్నారు. పుష్ప 1 సినిమా హిట్‌తో దేశవ్యాప్తంగా అల్లు అర్జున్ ఫుల్ పాపులర్ అయ్యారు. ఆయన స్టైల్, మేనరిజమ్స్, యాక్టింగ్, డ్యాన్స్ అందరికీ తెగనచ్చేశాయి. అల్లు అర్జున్ ప్రస్తుతం పుష్ప 2: ది రూల్ చిత్రం చేస్తున్నారు. ఆ సినిమా కోసం సినీ ప్రేక్షకులంతా ఎదురుచూస్తున్నారు. అయితే, అల్లు అర్జున్‌తో తదుపరి సినిమా తెరకెక్కించేందుకు చాలా మంది దర్శకులు ప్రయత్నిస్తున్నారు. కథలతో సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా తమిళ దర్శకులు అల్లు అర్జున్‌తో మూవీ చేయాలని తెగ ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.
ఈ క్రమంలో తమిళ దర్శకుడు అట్లీ తదుపరి సినిమా కోసం అల్లు అర్జున్ను కలిశారని సమాచారం. అల్లు అర్జున్ - అట్లీ మధ్య స్టోరీ గురించి చర్చ సుదీర్ఘంగా సాగిందట. ఓ కథను ఐకాన్ స్టార్‌కు అట్లీ నరేట్ చేశాడని తెలుస్తోంది. అయితే, నిర్ణయాన్ని అల్లు అర్జున్ ఇప్పటికి వాయిదా వేసినట్టు టాక్. అంతా ఓకే అనుకుంటే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే వచ్చే అవకాశం ఉంది.
ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే.. అల్లు అర్జున్, అట్లీ, మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. ఇలా AAA సాధ్యం కానుంది. మరి, అల్లు అర్జున్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో వేచిచూడాలి.
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ చేస్తున్న పుష్ప సీక్వెల్ పుష్ప 2: ది రూల్ మూవీ వచ్చే ఏడాది ఆగస్టు 15వ తేదీన రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం జోరుగా సాగుతోంది. వచ్చే ఏడాది ప్రారంభంలో చిత్రీకరణ ఫినిష్ అయ్యే ఛాన్స్ ఉంది.
మరోవైపు, డైరెక్టర్ అట్లీ తాజాగా జవాన్ సినిమాతో బాలీవుడ్‌లోనూ బంపర్ హిట్ కొట్టాడు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ హీరోగా నటించిన జవాన్.. భారీ కలెక్షన్లతో దూసుకెళుతోంది. సెప్టెంబర్ 7న రిలీజ్ అయిన ఈ మూవీ రూ.1,000కోట్ల కలెక్షన్ల దిశగా పరుగెడుతోంది. ఈ సినిమాతో అట్లీ కూడా పాన్ ఇండియా డైరెక్టర్ అయ్యారు.
మరోవైపు, జైలర్ మూవీతో సూపర్ సక్సెస్ కొట్టిన తమిళ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కూడా.. అల్లు అర్జున్‌తో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు.