Akhil Next Movie : ఆ డైరెక్టరుతో అయ్యగారి నెక్ట్స్ సినిమా!-akhil akkineni next movie with vamshi paidipally or sahoo director sujeeth ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Akhil Next Movie : ఆ డైరెక్టరుతో అయ్యగారి నెక్ట్స్ సినిమా!

Akhil Next Movie : ఆ డైరెక్టరుతో అయ్యగారి నెక్ట్స్ సినిమా!

Anand Sai HT Telugu
Apr 30, 2023 06:47 AM IST

Akhil Next Movie : ఇటీవలే ఏజెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు అక్కినేని అఖిల్. అయితే ఈ సినిమా అనుకున్నట్టుగా ఫలితం ఇవ్వలేదు. దీంతో నెక్ట్స్ ప్రాజెక్టుపై అఖిల్ ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది.

అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని (twitter)

అఖిల్ అక్కినేని(Akhil Akkineni) హీరోగా నటించిన ఏజెంట్(Agent) మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మమ్ముట్టి కీలక పాత్ర పోషించాడు. సాక్షి వైద్య హీరోయిన్‌గా చేసింది. ఈ మూవీ కోసం అఖిల్ తన బాడీ లాంగ్వేజ్‌ను పూర్తిగా మార్చుకున్నాడు. తనదైన శైలి యాక్షన్ స్టంట్లు చేశాడు. అయినా.. సినిమా టాక్ మాత్రం అనుకున్న స్థాయిలో రాలేదు. చాలా అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. ఇక తదుపరి ప్రాజెక్టుపై అఖిల్ ఫోకస్ పెట్టినట్టుగా సమాచారం.

పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం, అఖిల్ ఒక ప్రాజెక్ట్ కోసం సాహో ఫేమ్ సుజీత్‌తో చర్చలు జరుపుతున్నాడు. అయితే దీనిపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఇదిలా ఉంటే, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ల స్పెషలిస్ట్ వంశీ పైడిపల్లి అఖిల్‌తో సినిమాని డైరెక్ట్ చేయడానికి లైన్‌లో ఉన్నట్లు తాజా సమాచారం. అఖిల్ డల్ ఫేజ్ వెనుక కారణం ఏదైనా కావచ్చు.., కనీసం వంశీ పైడిపల్లి ప్రాజెక్ట్‌తో అయినా అక్కినేని హీరో సూపర్‌హిట్ సాధించాలని అభిమానులు కోరుకుంటున్నారు.

అఖిల్ అక్కినేని 2015లో వచ్చిన అఖిల్ సినిమాతో వెండితెరకు పరిచయం అయ్యాడు. ఇప్పటి వరకు ఐదు చిత్రాలలో నటించాడు. ఏజెంట్ సినిమాకు ముందు.. బ్యాచిలర్ సినిమా వచ్చింది. ఈ సినిమా సక్సెస్ కొట్టింది. ఇక అఖిల్ కెరీర్లో చెప్పుకోదగిని సినిమాలు లేవు. ఏజెంట్ మూవీకి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. కొన్నిచోట్ల మాత్రమే ఆకట్టుకునే యాక్షన్ సినిమా అంటూ రివ్యూలు వచ్చాయి. నెక్ట్స్ ప్రాజెక్టులపైనైనా.. సరిగా ఫోకన్ చేయాలని అఖిల్ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.

ఇక ఏజెంట్ సినిమా ఓటీటీ(Agent OTT Update) హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్ సొంతం చేసుకుంది. మంచి ఫ్యాన్సీ ధరకు ఈ మూవీ డిజిటల్ రైట్స్ దక్కించుకుంది. సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో త్వరగానే స్ట్రీమింగ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఏజెంట్ మూవీ నెలలోపే ఓటీటీలో అందుబాటులోకి తీసుకురానున్నారని సమాచారం.

మే నెలాఖరులోగా సోనీ లివ్ వేదికగా ఏజెంట్ మూవీ స్ట్రీమింగ్(Agent Movie Streaming) అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీలైతే మూడో వారంలోపే ఓటీటీలో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. ఈ విషయంపై అధికారిక సమాచారం రావాలి. దేశంలో ఉగ్రదాడుల‌కు ప్లాన్ చేసిన ధ‌ర్మ అనే క్రిమిన‌ల్‌ను రామ‌కృష్ణ అనే రా ఏజెంట్ ఎలా ప‌ట్టుకున్నాడ‌న్నదే ఈ సినిమా క‌థ‌. ఏజెంట్ మూవీ స్టోరీ, స్క్రీన్‌ప్లేతో పాటు టెక్నిక‌ల్ విష‌యాల్లో పెద్ద ఎత్తున విమర్శలు వినిపిస్తోన్నాయి.

Whats_app_banner