Meter Movie OTT Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే-kiran abbavaram meter ott release date locked ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Meter Movie Ott Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Meter Movie OTT Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ - స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ ఇదే

Nelki Naresh Kumar HT Telugu
Apr 29, 2023 03:24 PM IST

Meter Movie OTT Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం హీరోగా న‌టించిన మీట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. ఈ సినిమా ఏ ఓటీటీలో ఏ రోజు నుంచి స్ట్రీమింగ్ కానుందంటే...

కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్
కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్

Meter Movie OTT Release Date: కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స‌యింది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ మూవీ మే 5న నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానుంది. తెలుగుతో పాటు త‌మిళం, మ‌ల‌యాళం,క‌న్న‌డ భాష‌ల్లో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్న‌ట్లు స‌మాచారం. మీట‌ర్ మూవీ శాటిలైట్ హ‌క్కుల‌ను జెమినీ టీవీ ద‌క్కించుకొంది.

త్వ‌ర‌లోనే జెమినీ టీవీలో ఈ సినిమా టెలికాస్ట్ కానున్న‌ట్లు తెలిసింది. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ ద్వారా రిలీజైన ఈ మూవీకి ర‌మేష్ క‌దూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఏప్రిల్ 7న థియేట‌ర్ల ద్వారా ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన ఈ మూవీ దారుణంగా నెగెటివ్ టాక్‌ను మూట గ‌ట్టుకుంది. మినిమం ఓపెనింగ్స్ కూడా రాబ‌ట్ట‌లేక‌పోయింది.

ఔట్‌డేటెడ్ స్టోరీ లైన్‌తో పాటు టేకింగ్ విష‌యంలో కొత్త‌ద‌నం లేక‌పోవ‌డంతో ఈ సినిమాను తెలుగు ఆడియెన్స్ తిర‌స్క‌రించారు. దాదాపు నాలుగు కోట్ల వ‌ర‌కు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ సినిమా అతి క‌ష్టంగా యాభై ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి నిర్మాత‌ల‌కు భారీగా న‌ష్టాల‌ను మిగిల్చింది. మీట‌ర్ సినిమాలో అతుల్య ర‌వి హీరోయిన్‌గా న‌టించింది. ఇందులో కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోలీస్ ఆఫీస‌ర్ పాత్ర‌లో న‌టించారు. మీట‌ర్ మూవీకి సాయికార్తిక్ సంగీతాన్ని అందించాడు.

Whats_app_banner