Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో ఐదు సినిమాలు రిలీజ్ - రావ‌ణాసుర‌కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోటీ ఇవ్వ‌గ‌ల‌డా?-ravanasura to meter 5 telugu movies releasing this week in theatres ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Ravanasura To Meter 5 Telugu Movies Releasing This Week In Theatres

Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల‌లో ఐదు సినిమాలు రిలీజ్ - రావ‌ణాసుర‌కు కిర‌ణ్ అబ్బ‌వ‌రం పోటీ ఇవ్వ‌గ‌ల‌డా?

Nelki Naresh Kumar HT Telugu
Apr 03, 2023 05:50 AM IST

Movies In Theaters This Week: ఈ వారం థియేట‌ర్ల ద్వారా ఐదు సినిమాలు తెలుగు ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాయి. ఇందులో ర‌వితేజ రావ‌ణాసుర‌తో పాటు కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్‌పై అంచ‌నాలు నెల‌కొన్నాయి.

ర‌వితేజ రావ‌ణాసుర
ర‌వితేజ రావ‌ణాసుర

Movies In Theaters This Week:

ర‌వితేజ రావ‌ణాసుర

ధ‌మాకా, వాల్తేర్ వీర‌య్య సినిమాల‌తో అదిరిపోయే క‌మ్‌బ్యాక్ ఇచ్చాడు ర‌వితేజ‌(Raviteja). ఈ రెండు సినిమాలు వంద కోట్ల‌కుపైగా వ‌సూళ్ల‌ను రాబ‌ట్టాయి. ఈ బ్లాక్ బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ల త‌ర్వాత రావ‌ణాసుర‌తో ఏప్రిల్ 7న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు ర‌వితేజ‌. యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాకు సుధీర్‌వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు.

ఇందులో క్రిమిన‌ల్ లాయ‌ర్‌గా ర‌వితేజ నెగెటివ్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. ఈ సినిమాలో అను ఇమ్మాన్యుయేల్‌(Anu Emmanuel), మేఘా ఆకాష్, ద‌క్షా న‌గార్క‌ర్‌, ఫ‌రియా అబ్దుల్లా హీరోయిన్లుగా న‌టిస్తోన్నారు. ఈ వారం ఈ సినిమాపైనే భారీగా అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల్ని ర‌వితేజతో పాటు సుధీర్ వ‌ర్మ‌ ఏ మేర‌కు నిల‌బెడ‌తార‌న్న‌ది ఆస‌క్తిక‌రంగా మారింది.

కిర‌ణ్ అబ్బ‌వ‌రం మీట‌ర్‌

కాన్సెప్ట్ ఓరియెంటెడ్ క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటున్నాడు యంగ్ హీరో కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram). విన‌రో భాగ్య‌ము విష్ణుక‌థ తో విజ‌యాన్ని అందుకున్న కిర‌ణ్ అబ్బ‌వ‌రం ఏప్రిల్ 7న మీట‌ర్ సినిమాతో ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతున్నాడు.

మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో రూల్స్‌తో సంబంధం లేకుండా త‌న‌కు న‌చ్చిన‌ట్లుగా జీవితాన్ని సాగించే పోలీస్ ఆఫీస‌ర్‌గా కిర‌ణ్ అబ్బ‌వ‌రం క‌నిపించ‌బోతున్నాడు. మీట‌ర్ సినిమాకు ర‌మేష్ కడూరి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అతుల్య ర‌వి హీరోయిన్‌గా న‌టిస్తోంది. మైత్రీ మూవీ మేక‌ర్స్ స‌మ‌ర్ప‌ణ‌లో చిరంజీవి, హేమ‌ల‌త పెద‌మ‌ల్లు ఈ సినిమాను నిర్మిస్తోన్నారు.

ఆగ‌స్ట్ 16 1947

కోలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ మురుగ‌దాస్ (Murugadas) నిర్మాణంలో రూపొందుతోన్న త‌మిళ మూవీ ఆగ‌స్ట్ 16 1947 తెలుగులో డ‌బ్బింగ్ రూపంలో ఏప్రిల్ 7న విడుద‌ల‌కాబోతుంది. గౌత‌మ్ కార్తిక్ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాకు ఎన్ఎస్ పొన్‌రామ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. పీరియాడిక‌ల్ యాక్ష‌న్ క‌థాంశంతో ఈ సినిమా తెర‌కెక్కుతోంది. 1947 ఆగ‌స్ట్ 14 నుంచి 16 వ‌ర‌కు మూడు రోజులు ఓ అడ‌వి మ‌ధ్య‌లో ఉన్న ప‌ల్లెటూరిలో ఏం జ‌రిగింద‌న్న‌దే ఈసినిమా క‌థ‌.

దేశ‌ముదురు రీ రిలీజ్‌

అల్లు అర్జున్ (Allu Arjun) బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అత‌డి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్ మూవీ దేశ‌ముదురు ఏప్రిల్ 6న థియేట‌ర్ల‌లో రీ రిలీజ్ కానుంది. తెలుగు రాష్ట్రాల‌తో ఓవ‌ర్‌సీస్‌లో ఈ సినిమా స్పెష‌ల్ ప్రీమియ‌ర్స్‌ను ప్ర‌ద‌ర్శించ‌బోతున్నారు. పూరి జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో 2007లో ప్రేక్ష‌కుల‌ ముందుకొచ్చిన ఈ సినిమా నిర్మాత‌ల‌కు భారీగా లాభాల‌ను తెచ్చిపెట్టింది.

ఈ సినిమాల‌తో పాటు పాటు ర‌సెల్ క్రో హీరోగా న‌టించిన ది పోప్ ఎక్జార్సిస్ట్ మూవీ ఏప్రిల్ 7న ఇంగ్లీష్‌తో పాటు ద‌క్షిణాది భాష‌ల‌న్నింటిలో డ‌బ్బింగ్ ద్వారా రిలీజ్ అవుతోం

IPL_Entry_Point