Meter Day 1 Collection: మీటర్‌కు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ - మైత్రీ మూవీస్ కెరీర్‌లో బిగ్గెస్ట్ డిజాస్టర్ ఫిక్స్
Meter First Day Collection: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మైత్రీ మూవీస్‌కు ఈ సినిమా భారీగా నష్టాలను మిగిల్చే అవకాశం ఉన్నట్లు చెబుతోన్నారు.
Meter First Day Collection: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన మీటర్ సినిమాకు ఫస్ట్ డే షాకింగ్ కలెక్షన్స్ వచ్చాయి. మోస్తారు అంచనాలతో శుక్రవారం రిలీజైన ఈ సినిమా ఫస్ట్ డే ఓవరాల్‌గా 20 నుంచి 25 లక్షల మధ్య కలెక్షన్స్ రాబట్టినట్లు సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ రూపొందించిన సినిమాకు ఇంత తక్కువ కలెక్షన్స్ రావడం టాలీవుడ్ వర్గాలను విస్మయపరుస్తోంది.
ఫస్ట్ షో నుంచే నెగెటివ్ టాక్ రావడంతో మ్యాట్నీ నుంచి వసూళ్లను దారుణంగా పడిపోయాయి. ఓవరాల్‌గా శుక్రవారం రోజు మీటర్ సినిమాకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్‌సీస్‌లో కలిపి 60 లక్షల వరకు గ్రాస్, 25 లక్షల వరకు షేర్ వచ్చినట్లు సమాచారం.
రెండో రోజు వసూళ్లు మరింత తగ్గే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కిరణ్ అబ్బవరం గత సినిమా వినరో భాగ్యము విష్ణు కథ హిట్ కావడంతో మీటర్ ప్రీ రిలీజ్ బిజినెస్ నాలుగు కోట్ల వరకు జరిగినట్లు సమాచారం.
ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే నిర్మాతలు భారీగా నష్టాలు తప్పవని ట్రేడ్ వర్గాలు చెబుతోన్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలోకిరణ్ అబ్బవరం పోలీస్ క్యారెక్టర్‌లో నటించాడు.
రమేష్ కదూరి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాకు మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో చిరంజీవి, హేమలత పెదమల్లు నిర్మించారు. ఈ సినిమాతో అతుల్య రవి హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.