Ajith Kumar New Car: మూడున్నర కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్ని స్టార్ హీరో.. భార్య చేసిన కామెంట్స్ వైరల్-ajith kumar new luxury car porche worth three and half crores wife shalini comments gone viral ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ajith Kumar New Car: మూడున్నర కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్ని స్టార్ హీరో.. భార్య చేసిన కామెంట్స్ వైరల్

Ajith Kumar New Car: మూడున్నర కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్ని స్టార్ హీరో.. భార్య చేసిన కామెంట్స్ వైరల్

Hari Prasad S HT Telugu
Sep 13, 2024 03:53 PM IST

Ajith Kumar New Car: స్టార్ హీరో అజిత్ కుమార్ ఏకంగా రూ.3.5 కోట్లు పెట్టి ఓ లగ్జరీ పోర్షె కారు కొన్నాడు. అయితే ఈ విషయాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ అతని భార్య షాలిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

మూడున్నర కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్ని స్టార్ హీరో.. భార్య చేసిన కామెంట్స్ వైరల్
మూడున్నర కోట్లు పెట్టి లగ్జరీ కారు కొన్ని స్టార్ హీరో.. భార్య చేసిన కామెంట్స్ వైరల్

Ajith Kumar New Car: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ గ్యారేజీలోకి మరో లగ్జరీ కారు వచ్చి చేరింది. ఇప్పటికే ఎన్నో లగ్జరీ కార్లు, బైక్స్ కలెక్షన్ అతని దగ్గర ఉంది. అయితే తాజాగా వాటికి పోర్షె 911 జీటీ3 ఆర్ఎస్ కారు కూడా యాడ్ అయింది. ఈ కారు ధర ఏకంగా రూ.3.5 కోట్లు కావడం విశేషం. తన కొత్త కారుతో అజిత్ ఫొటోలకు పోజులివ్వగా వాటిని షాలిని షేర్ చేసింది.

అజిత్ కొత్త లగ్జరీ కారు

తన భర్త, తమిళ హీరో అజిత్ ఓ లగ్జరీ కారు కొన్న విషయాన్ని షాలిని తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ద్వారా వెల్లడించింది. "అతడు కారును, స్టైల్ ను, నా హృదయాన్ని గెలుచుకున్నాడు" అనే క్యాప్షన్ ఉంచింది. ఈ సందర్భంగా తన కొత్త కారుతో అజిత్ దిగిన ఫొటోను కూడా ఆమె పోస్ట్ చేసింది.

పోర్షె వెబ్‌సైటు ప్రకారం ఈ మోడల్ కారు ధర రూ.3 కోట్ల 50 లక్షల 56 వేలు కావడం విశేషం. ఈ కారు గంటకు గరిష్ఠంగా 296 కి.మీ. వేగంతో దూసుకెళ్లగలదు. అజిత్ కు లగ్జరీ కార్లు, బైకులంటే ఎంతో ఇష్టం. అతడు ఈ మధ్యే దుబాయ్ లో ఏకంగా రూ.9 కోట్లు పెట్టి ఫెరారీ ఎఫ్8 ట్రిబ్యూటో కారు కొన్నాడు.

అజిత్ కార్లు, బైకులు

తాజాగా అతని గ్యారేజీలో చేరిన ఈ రెండు కార్లే కాకుండా ఇప్పటికే అజిత్ దగ్గర మరెన్నో లగ్జరీ కార్లు, బైకులు కూడా ఉన్నాయి. అందులో రూ.1.5 కోట్ల విలువైన బీఎండబ్ల్యూ 740 లీ, రూ.1.3 కోట్ల విలువైన ల్యాండ్ రోవర్ డిస్కవరీ, రూ.1.35 కోట్ల విలువైన మెర్సెడీస్ బెంజ్ 350 జీఎల్ఎస్, రూ.90 లక్షల విలువైన వోల్వో ఎక్స్‌సీ 90, రూ.4 కోట్ల విలువైన ఫెరారీ 458 ఇటాలియా కార్లు ఉన్నాయి.

ఇక బైకుల విషయానికి వస్తే రూ.19.7 లక్షల విలువైన కవాసకీ నింజా జెడ్ఎక్స్ 14ఆర్, రూ.24 లక్షల విలువైన బీఎండబ్ల్యూ ఎస్1000ఆర్ఆర్, రూ.20 లక్షల విలువైన అప్రిలియా కాపోనోర్డ్ 1200, రూ.21 లక్షల విలువైన బీఎండబ్ల్యూ కే1300 ఎస్ ఉన్నాయి.

అజిత్ కారుపై ఫ్యాన్స్ రియాక్షన్

అజిత్ తాజాగా ఈ లగ్జరీ కారు కొనడంపై ఫ్యాన్స్ రియాక్టయ్యారు. 50ల వయసు దాటినా.. తన అభిరుచి మాత్రం తగ్గలేదంటూ ఓ అభిమాని కామెంట్ చేశాడు. కార్లపై అతనికి ఉన్న ప్రేమకు అసలు అంతేలేదు అంటూ మరో యూజర్ అన్నాడు. మరో అభిమాని ఈ కారు స్పెసిఫికేషన్స్ గురించి వివరిస్తూ.. సున్నా నుంచి 100 కి.మీ. వేగాన్ని కేవలం 3.2 సెకన్లలోనే అందుకుంటుందని చెప్పాడు.

అజిత్ ప్రస్తుతం విదాముయర్చి మూవీతోపాటు గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాలోనూ నటిస్తున్నాడు. చివరిగా గతేడాది వచ్చిన తునివు మూవీలో నటించిన అజిత్.. ఇప్పుడు రెండు వరుస సినిమాలతో అభిమానుల ముందుకు రాబోతున్నాడు.

Whats_app_banner