Ajay Ghosh: ఆ అమ్మాయి కోసమే ప్రోగ్రామ్‌కి వచ్చా.. పుష్ప విలన్ కామెంట్స్
Ajay Ghosh About Producer Mallika Reddy: పుష్ప సినిమాలో విలన్‌గా నటించిన అజయ్ ఘోష్ ఇటీవల వృషభ ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి సినిమా కో ప్రొడ్యూసర్ మల్లికా రెడ్డి కోసమే వచ్చానని ఆసక్తికర కామెంట్స్ చేశారు.
Ajay Ghosh In Vrushaba Trailer Launch: తెలుగులో అనేక సినిమాల్లో పవర్ ఫుల్ క్యారెక్టర్స్ చేస్తూ తనదైన ముద్ర వేసుకున్న నటుడు అజయ్ ఘోష్. అల్లు అర్జున్ పుష్ప సినిమాలో విలన్‌గా నటించి మంచి ప్రశంసలు అందుకున్నారు. అలాగే గుంటూరు కారం, మంగళవారం, బెదురులంక 2012, రుద్రామాంబపురం వంటి అనేక సినిమాల్లో మంచి పాత్రలతో ఆకట్టుకున్నారు.
అయితే, ఇటీవల వృషభ అనే సినిమా ట్రైలర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొని ఆసక్తికర కామెంట్స్ చేశారు అజయ్ ఘోష్. వీకే మూవీస్ అండ్ శ్రీ జేపీ ప్రొడక్షన్స్ పతాకాలపై జీవన్ రెడ్డి, అలేఖ్య జంటగా ఉమా శంకర్ రెడ్డి నిర్మాతగా, మల్లికా రెడ్డి కో-ప్రొడ్యూసర్‌గా రూపొందుతోన్న చిత్రం వృషభ. ఈ చిత్రానికి అశ్విన్ కామరాజ్ కొప్పాల దర్శకత్వం వహించారు.
దివంగత నటుడు జయప్రకాష్ రెడ్డి జయంతి సందర్భంగా మే 8న ప్రసాద్ ల్యాబ్స్‌లో వృషభ ట్రైలర్, లిరికల్ సాంగ్ లాంచ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అతిథిగా సీనియర్ దర్శకుడు వి సముద్ర హాజరయ్యారు. "ట్రైలర్‌తో పాటు ఒక పాట విన్నాం చాలా బాగున్నాయి. హీరో, హీరోయిన్స్ చాలా నేచరల్‌గా ఉన్నారు. దర్శకుడుకి ఈ చిత్రం మంచి పేరు తేవాలని కోరుకుంటూ నిర్మాతకు శుభాకాంక్షలు" అని వి సముద్ర తెలిపారు.
"ట్రైలర్ చూడగానే ఇది డిఫరెంట్ సబ్జెక్ట్ అనిపించింది. విన్న పాట కూడా చాలా బావుంది. సంగీతం, సాహిత్యం, సినిమాటోగ్రఫీ ఆకట్టుకునే విధంగా ఉన్నాయి. జయప్రకాశ్ రెడ్డి గారి కూతురు నిర్మాతగా చేయడం సంతోషం. ఈ చిత్రం దర్శక నిర్మాతలకు నా శుభాకాంక్షలు" అని డైరెక్టర్ రేలంగి నరసింహా రావు అన్నారు.
"జేపీ (జయప్రకాశ్ రెడ్డి) గారి కుమార్తె మల్లికా రెడ్డి గారి కోసం ఈ ప్రోగ్రామ్‌కి వచ్చాను. మట్టి వాసనతో కూడిన కథ ఇది. ట్రైలర్... నేచరల్‌గా చాలా బావుంది. ఇలాంటి కథలతో సినిమాలు మరెన్నో చేయాలని కోరుకుంటూ ఈ టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు" అని పుష్ప విలన్, నటుడు అజయ్ ఘోష్ తెలిపారు.
"మా నాన్నగారి బర్త్ డే రోజు మా సినిమాకు సంబంధించిన పాట, ట్రైలర్ రిలీజ్ చేయడం సంతోషం. ఈ సినిమాలో నన్ను భాగస్వామిగా చేసిన ఉమా శంకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు . ఒక మంచి సినిమాలో పార్ట్ కావడం సంతోషంగా ఉందని" కో ప్రొడ్యూసర్ మల్లికా రెడ్డి పేర్కొన్నారు.
"ట్రైలర్ చాలా అద్భుతంగా ఉంది. హీరో, హీరోయిన్స్ చాలా నేచరల్ గా కనిపించారు. మ్యూజిక్, సినిమాటోగ్రఫీ సూపర్బ్‌గా ఉంది. దర్శకుడు టాలెంట్ ఏంటో ట్రైలర్ చూస్తే అర్థమయింది" అని నటుడు శివారెడ్డి అన్నారు. సీనియర్ నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "ట్రైలర్, విన్న పాట, టైటిల్ చాలా బావున్నాయి. కళ పట్ల అభిమానంతో ఈ టీమ్ సినిమా చేసినట్లు అర్థమవుతోంది. టీమ్ అందరికీ నా శుభాకాంక్షలు"అని అన్నారు.
ఇక నటుడు జయ ప్రకాష్ రెడ్డి ప్రేమించుకుందాం రా, కబడ్డీ కబడ్డీ, రెడీ, ఢీ వంటి తదితర ఎన్నో సినిమాల్లో కీలక పాత్రలు పోషించారు. విలన్‌గా, కమెడియన్‌గా, నటుడిగా ఎన్నో ఏళ్లు తన నటనతో అలరించారు. ఆయన జయంతి సందర్భంగా వృషభ ట్రైలర్, లిరికల్ సాంగ్ రిలీజ్ చేయడం విశేషంగా మారింది. ఆయన కుమార్తె మల్లికా రెడ్డి సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు అజయ్ ఘోష్ హాజరయ్యారు.