Sunny Leone Telugu Movie: సన్నీలియోన్ తెలుగు హారర్ మూవీకి టైటిల్ ఫిక్స్ - విలన్ రోల్‌లో బోల్డ్ బ్యూటీ!
Sunny Leone Telugu Movie: ఓ హారర్ మూవీతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సన్నీలియోన్. ఈ సినిమాకు మందిర అనే టైటిల్‌ను ఖరారు చేశారు.
Sunny Leone Telugu Movie: బాలీవుడ్ శృంగార తార సన్నీలియోన్ తెలుగులో ఓ సినిమా చేస్తోంది. ఈ మూవీ టైటిల్, ఫస్ట్‌లుక్‌ను శుక్రవారం రిలీజ్ చేశారు. సన్నీలియోన్ తెలుగు మూవీకి మందిర అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. తలపై కిరీటం ధరించి రాజుల కాలం వస్త్రాధారణలో రాణిగా సన్నీలియోన్ కనిపిస్తోంది. ఈ సినిమాలో సన్నీలియోన్ నెగెటివ్ షేడ్ రోల్‌లో కనిపించబోతున్నట్లు పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది.మందిర సినిమాకు ఆర్ యువన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
తమిళ డబ్బింగ్ మూవీనా?
సన్నీ లియోన్ హీరోయిన్‌గా తమిళంలో 2022లో రిలీజైన ఓ మై ఘోస్ట్‌కు డబ్ వెర్షన్‌గా మందిర తెలుగులో రిలీజ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఓ మై ఘోస్ట్ మూవీలో సన్నీలియోన్‌తో పాటు సతీష్, దర్శనా గుప్తా కీలక పాత్రలు పోషించారు. హారర్ కామెడీ కథాంశంతో తెరకెక్కిన ఈ మూవీ ఫ్లాప్ టాక్‌ను మూటగట్టుకున్నది.
యువరాణిగా సన్నీలియోన్...
ఓ విలేజ్‌లోని పాతకాలం నాటి బంగళాలోకి తన గర్ల్‌ఫ్రెండ్‌తో కలిసి ఓ మూవీ డైరెక్టర్ వస్తాడు. అక్కడ వారికి ఎలాంటి అనూహ్య పరిణామాలు ఎదురయ్యాయి. ఆ బంగళాలో ఉన్న దెయ్యం కథేమిటన్నదే ఈ మూవీ కథ. ఈ మూవీలో యువరాణి పాత్రలో సన్నీలియోన్ కనిపించింది.
2012లో బాలీవుడ్ ఎంట్రీ...
బాలీవుడ్‌లో బోల్డ్ పాత్రలతో పాపులరైంది సన్నీలియోన్. 2012లో రిలీజైన జిస్మ్ సినిమాతో హిందీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. హేట్ స్టోరీ 2, ఎక్ ఫహేలీ లీలా, లవ్ యూ అలీయా, మస్తీ జాదే చాలా సినిమాల్లో గ్లామర్ ప్రధాన పాత్రలు చేసింది. యాక్టింగ్ కంటే ఐటెంసాంగ్స్‌లోనే సన్నీలియోన్‌కు ఎక్కువగా ఆఫర్స్ వచ్చాయి.
తెలుగులో జిన్నాతో రీఎంట్రీ...
తెలుగులో మంచు మనోజ్ హీరోగా నటించిన కరెంట్ తీగలో గెస్ట్ రోల్ చేసింది సన్నీలియోన్. రాజశేఖర్ గరుడవేగలో ఐటెంసాంగ్‌లో తళుక్కున మెరిసింది. చాలా రోజుల తర్వాత మంచు విష్ణు జిన్నాతో తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమాలోనూ నెగెటివ్ రోల్‌లో కనిపించింది. మలయాళం, తమిళం హిందీలో కలిపి పదికిపైగా సినిమాలు చేస్తోంది సన్నీలియోన్. ఉపేంద్ర యూలో ఓ కీలక పాత్రలో సన్నీలియోన్ కనిపించబోతున్నది. ఈ కన్నడ మూవీ త్వరలో పాన్ ఇండియన్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది.
ఢీ గ్లామర్ రోల్
రంగీలా మూవీతో సన్నీలియోన్ మలయాళం ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నది. చాలా కాలంగా షూటింగ్‌ను జరుపుకుంటోన్న ఈ మూవీ ఏడాదే రిలీజ్ కానుంది. సన్నీలియోన్ ప్రధాన పాత్రలో నటించిన కొటేషన్ గ్యాంగ్ ట్రైలర్ ఇటీవల రిలీజైంది. ఈ క్రైమ్ థ్రిల్లర్ మూవీలో ఢీ గ్లామర్ రోల్ చేసింది సన్నీలియోన్.
టాపిక్