Narne Nithin: శ్రీ శ్రీ శ్రీ రాజావారుగా వ‌స్తోన్న ఎన్టీఆర్ బావ మ‌రిది - మ్యాడ్ హీరో మూవీ రిలీజ్ ఎప్పుడంటే?-after mad ntr nepew narne nithin second movie sri sri sri rajavaru release in theaters soon ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Narne Nithin: శ్రీ శ్రీ శ్రీ రాజావారుగా వ‌స్తోన్న ఎన్టీఆర్ బావ మ‌రిది - మ్యాడ్ హీరో మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Narne Nithin: శ్రీ శ్రీ శ్రీ రాజావారుగా వ‌స్తోన్న ఎన్టీఆర్ బావ మ‌రిది - మ్యాడ్ హీరో మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

Nelki Naresh Kumar HT Telugu
Jun 10, 2024 12:31 PM IST

Narne Nithin: మ్యాడ్ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు ఎన్టీఆర్ బావ మ‌రిది నార్నే నితిన్‌. యూత్‌ఫుల్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ బ్లాక్‌బ‌స్ట‌ర్‌గా నిలిచింది. మ్యాడ్ త‌ర్వాత శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు నార్నే నితిన్‌. ఈ మూవీ రిలీజ్ ఎప్పుడంటే?

నార్నే నితిన్‌ శ్రీశ్రీశ్రీ రాజావారు
నార్నే నితిన్‌ శ్రీశ్రీశ్రీ రాజావారు

Narne Nithin: మ్యాడ్ మూవీతో హీరోగా తొలి అడుగులోనే బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్టు కొట్టాడు ఎన్టీఆర్ బావ మ‌రిది నార్నే నితిన్‌. కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద ఇర‌వై కోట్ల వ‌ర‌కు వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. నిర్మాత‌ల‌కు ప‌దింత‌ల లాభాల‌ను మిగిల్చింది. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ అశోక్ అనే పాత్ర‌లో నార్నే నితిన్ క‌నిపించాడు. త‌న కామెడీ టైమింగ్‌తో ఆక‌ట్టుకున్నాడు.

శ్రీశ్రీశ్రీ రాజావారు...

మ్యాడ్ త‌ర్వాత శ్రీశ్రీశ్రీ రాజావారుతో త్వ‌ర‌లోనే తెలుగు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాడు నార్నే నితిన్‌. విలేజ్ యాక్ష‌న్ ల‌వ్ స్టోరీగా తెర‌కెక్కిన ఈ మూవీకి శ‌త‌మానం భ‌వ‌తి ఫేమ్ స‌తీష్‌ వేగేశ్న దర్శకత్వం వ‌హించాడు. చింతపల్లి రామారావు నిర్మించాడు. శ్రీశ్రీశ్రీ రాజావారు సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. యూ.ఏ స‌ర్టిఫికెట్ ల‌భించింది.తొంద‌ర‌లోనే ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు.

సెకండ్ మూవీగా రిలీజ్‌...

నిజానికి మ్యాడ్ కంటే ముందే శ్రీశ్రీశ్రీ రాజావారు రిలీజ్ కావాల్సింది. హీరోగా శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీనే నార్నే నితిన్ మొద‌ట‌గా అంగీక‌రించాడు. షూటింగ్ కూడా చాలా రోజుల క్రిత‌మే పూర్త‌యింది. కానీ అనివార్య కార‌ణాల రిలీజ్ ఆల‌స్యం కావ‌డంతో మ్యాడ్ మొద‌ట‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. అదే నార్నే నితిన్ డెబ్యూ మూవీ అయ్యింది.

సంప‌ద హీరోయిన్‌...

శ్రీశ్రీశ్రీ రాజావారు మూవీలో నార్నే నితిన్‌కు జోడీగా సంప‌ద హీరోయిన్‌గా న‌టిస్తోంది. రావుర‌మేష్, ర‌ఘు కుంచే, ర‌చ్చ ర‌వి త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఈ సినిమాకు కైలాష్ మీన‌న్ సంగీతాన్ని అందిస్తోన్నాడు.

సీక్వెల్‌తో బిజీ

ప్ర‌స్తుతం మ్యాడ్ సీక్వెల్ తో పాటు ఆయ్ పేరుతో మ‌రో మూవీ చేస్తోన్నాడు నార్నే నితిన్. మ్యాడ్‌కు కొన‌సాగింపుగా అదే హీరోహీరోయిన్లు, టెక్నీషియ‌న్ల‌తో మ్యాడ్ సీక్వెల్‌ను సితార ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ సంస్థ తెర‌కెక్కిస్తోంది. ఈ సీక్వెల్‌కు మ్యాడ్ స్క్వేర్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు.

ఇందులో నార్నే నితిన్‌తో పాటు సంగీత్ శోభ‌న్‌, రామ్ నితిన్ హీరోలుగా క‌నిపించ‌బోతున్నారు. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ సీక్వెల్ ఈ ఏడాదే రిలీజ్ కాబోతోంది. ఆయ్ మూవీని అల్లు అర‌వింద్ స‌మ‌ర్ప‌ణ‌లో జీఏ2 పిక్చ‌ర్స్ నిర్మిస్తోంది. అంజి కంచిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీలో న‌య‌న్ సారిక హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది.

శ‌త‌మానం భ‌వ‌తితో నేష‌న‌ల్ అవార్డ్‌...

మ‌రోవైపు శ‌త‌మానం భ‌వ‌తి మూవీతో ద‌ర్శ‌కుడిగా తెలుగు ప్రేక్ష‌కుల మ‌న్న‌న‌ల్ని అందుకున్నాడు ద‌ర్శ‌కుడు స‌తీష్ వేగేశ్న‌. శ‌ర్వానంద్‌, అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ హీరోహీరోయిన్లుగా దిల్‌రాజు నిర్మాణంలో తెర‌కెక్కిన ఈ మూవీ నేష‌న‌ల్ అవార్డును సొంతం చేసుకున్న‌ది. శ‌త‌మానం భ‌వ‌తి త‌ర్వాత క‌ళ్యాణ్‌రామ్‌తో ఎంత‌మంచివాడ‌వురా అనే సినిమా చేశాడు స‌తీష్ వేగేశ్న‌. ఈ మూవీ ఫెయిల్యూర్‌గా నిలిచింది. శ్రీశ్రీశ్రీ రాజావారుతో పాటు స‌తీష్ వేగేశ్న ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కోతి కొమ్మ‌చ్చి కూడా రిలీజ్‌కు సిద్ధంగా ఉంది.

టీ20 వరల్డ్ కప్ 2024

టాపిక్