Raashii Khanna: అవును.. నాకూ ఓ లవ్ స్టోరీ ఉండేది, బ్రేకప్ గురించి ఓపెన్‌గా చెప్పేసిన రాశీ ఖన్నా-actress raashii khanna recalls her depressed breakup ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Raashii Khanna: అవును.. నాకూ ఓ లవ్ స్టోరీ ఉండేది, బ్రేకప్ గురించి ఓపెన్‌గా చెప్పేసిన రాశీ ఖన్నా

Raashii Khanna: అవును.. నాకూ ఓ లవ్ స్టోరీ ఉండేది, బ్రేకప్ గురించి ఓపెన్‌గా చెప్పేసిన రాశీ ఖన్నా

Galeti Rajendra HT Telugu
Nov 13, 2024 04:15 PM IST

The Sabarmati Report Movie: టాలీవుడ్‌కి గత కొంతకాలంగా దూరంగా ఉంటున్న రాశీ ఖన్నా.. నవంబరు 15న ది సబర్మతీ రిపోర్ట్ అనే కొత్త సినిమాతో థియేటర్లలో రాబోతోంది.

రాశీ ఖన్నా
రాశీ ఖన్నా

హీరోయిన్స్ సాధారణంగా తమ లవ్ స్టోరీలు, బ్రేక్‌ల గురించి ఓపెన్‌గా చెప్పేందుకు ఇష్టపడరు. ఒకవేళ అలా చెప్తే ఇతరుల ముందు చులకన అయిపోతామని లేదా ఇండస్ట్రీలో అవకాశాలు తగ్గిపోతాయని భయపడుతుంటారు. కానీ.. హీరోయిన్ రాశీ ఖన్నా మాత్రం తన లవ్ స్టోరీ గురించే కాదు.. బ్రేకప్ గురించి కూడా ఓపెన్‌గా చెప్పేసింది.

రాశీ ఖన్నా, విక్రాంత్ మాస్సే జంటగా నటించిన ‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమా నవంబరు 15న థియేటర్లలోకి రాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన రాశీ ఖన్నా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పుకొచ్చింది. ‘ది సబర్మతీ రిపోర్ట్’ సినిమాకి రంజన్‌ చందేల్‌ దర్శకత్వం వహించగా.. శోభా కపూర్, ఏక్తా కపూర్‌ సంయుక్తంగా నిర్మించారు.

బ్రేకప్ తర్వాత డిప్రెషన్‌లోకి

‘‘పర్సనల్ లైఫ్‌లో నేను చాలా ఎమోషనల్‌‌గా ఉంటాను. అప్పట్లో నాకు ఒక లవ్ స్టోరీ ఉండేది.. కానీ.. కొన్ని కారణాల వల్ల అతనితో విడిపోయా. బ్రేకప్ తర్వాత నేను చాలా బాధపడ్డాను. ఒకానొక దశలో డిప్రెషన్‌లోకి వెళ్లిపోయా. అయితే కొన్నాళ్ల తర్వాత స్నేహితులు, సన్నిహితుల సాయంతో నా కెరీర్‌పై దృష్టి పెడుతూ ఆ బ్రేకప్ బాధ నుంచి బయటపడ్డాను.ఇప్పటికీ నాకు ఇండస్ట్రీలో కంటే బయటే ఎక్కువ మంది స్నేహితులు ఉన్నారు’’ అని రాశీ ఖన్నా గుర్తు చేసుకుంది.

తిరుపతిలో చుట్టుముట్టేశారు

సినిమాల్లోకి వచ్చాక తనకి స్టార్ డమ్‌ తొలుత పరిచయమైంది తిరుపతిలో అని రాశీ ఖన్నా గుర్తు చేసుకుంది. అప్పుడే ‘ఊహలు గుసగుసలాడే’ సినిమా రిలీజై మంచి పాజిటివ్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తున్న వేళ.. ఈ ముద్దుగుమ్మ తిరుపతి వెళ్లిందట. రాశీ ఖన్నాని చూడగానే కొంత మంది అభిమానులు గుర్తు పట్టి ఆమెని చుట్టుముట్టునిట్లు ఇంటర్వ్యూలో రాశీ ఖన్నా గుర్తు చేసుకుంది.

‘‘కొంత మంది జనం నన్ను చుట్టుముట్టడంతో తొలుత అక్కడ ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. వెంటనే పక్కనే ఉన్న మేనేజర్‌ని ఏంటి ఇదందా? అని అడిగితే.. వాళ్లంతా మిమ్మల్ని చూడటానికే వచ్చారని సమాధానమిచ్చాడు. నాకు అప్పటి వరకు స్టార్ డమ్ ఎలా ఉంటుందో తెలియదు. ఆ ఘటన తర్వాత నెమ్మదిగా అలవాటు అయ్యింది’’ అని రాశీ ఖన్నా చెప్పుకొచ్చింది.

సిద్ధుతో నెక్ట్స్ మూవీ

యంగ్ హీరోలతో వరుస సినిమాలు చేసిన రాశీ ఖన్నా.. గత కొంతకాలంగా టాలీవుడ్‌లో సినిమాలు చేయడం లేదు. ప్రస్తుతం ఆమె చేతిలో ‘తెలుసు కదా?’ అనే సినిమా మాత్రమే ఉంది. ఆ మూవీలో సిద్ధు జొన్నలగడ్డ హీరోగా చేస్తున్నారు.

Whats_app_banner