Eagle First Song: రవితేజ ‘ఈగల్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మాస్ జాతరే-aadu macha song from eagle movie released ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Aadu Macha Song From Eagle Movie Released

Eagle First Song: రవితేజ ‘ఈగల్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మాస్ జాతరే

Chatakonda Krishna Prakash HT Telugu
Dec 05, 2023 07:01 PM IST

Eagle First Song: ఈగల్ చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ వచ్చేసింది. ఆడు మచ్చా అంటూ ఈ సాంగ్ ఫుల్ మాస్ బీట్‍తో ఉంది. వివరాలివే..

Eagle First Song: రవితేజ ‘ఈగల్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మాస్ జాతరే
Eagle First Song: రవితేజ ‘ఈగల్’ నుంచి తొలి పాట వచ్చేసింది.. మాస్ జాతరే

Eagle First Song: మాస్ మహారాజ్ రవితేజ హీరోగా నటిస్తున్న ఈగల్ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్ రిలీజ్ అయింది. ఆడు మచ్చా అనే ఈ పాటను నేడు (డిసెంబర్ 5) విడుదల చేసింది మూవీ యూనిట్. ఫుల్ మాస్ బీట్‍తో అదిరిపోయేలా ఈ సాంగ్ ఉంది. ఈగల్ చిత్రం థియేటర్లలో 2024 జనవరి 13న రిలీజ్ కానుంది. ఈ తరుణంలో ఈ తొలి పాట నుంచే ప్రమోషన్ల జోరును మూవీ యూనిట్ పెంచింది. వివరాలివే..

ట్రెండింగ్ వార్తలు

ఈగల్ చిత్రం నుంచి తొలి పాట ఆడు మచ్చా ఫుల్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయింది. ప్రోమోతోనే ఫుల్ హైప్ రాగా.. నేడు పూర్తి పాట వచ్చింది. సినిమాలో ఓ జాతర సందర్భంగా ఈ పాట ఉండనుందని లిరికల్ వీడియో చూస్తే అర్థమవుతోంది. ఈ సాంగ్‍కు మాస్ మహారాజ్ రవితేజ డ్యాన్స్ హైలైట్‍గా ఉంది.

ఈ పాటకు ఫుల్ జోష్ ఉన్న బీట్‍ను ఇచ్చారు మ్యూజిక్ డైరెక్టర్ డావ్‍జంద్. రాహుల్ సిప్లిగంజ్ ఈ సాంగ్ పాడారు. కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించారు. జాతర సెటప్‍లో ఫుల్ మాస్ గెటప్‍లో రవితేజ వేసిన స్టెప్స్ ఈ సాంగ్‍లో ఆకట్టుకుంటున్నాయి. “తురుపు తునక.. ఎరుపు బారెనే.. ఎగులు దునికి దుంకులాడెనే” అంటూ ఈ పాట మొదలైంది. పవర్ ఫుల్ లైన్లతో ఈ సాంగ్ ఉంది. పాట మొత్తం మాస్ జాతరలా సాగింది.

ఈగల్ చిత్రానికి కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్నారు. సినిమాటోగ్రఫర్‌ అయిన కార్తీక్‍కు డైరెక్టర్‌గా ఇది రెండో మూవీ. ఈ సినిమాలో రవితేజ సరసన కావ్య థాపర్, అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. నవదీప్, శ్రీనివాస్ అవసరాల, మధుబాల, అజయ్ ఘోశ్ కీరోల్స్ చేశారు.

పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్.. ఈగల్ మూవీని నిర్మిస్తున్నారు. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రానికి డైరెక్షన్, ఎడిటింగ్‍‍తో పాటు సినిమాటోగ్రఫర్‌గానూ కార్తీక ఘట్టమనేని వ్యవహరిస్తున్నారు. మణిబాబు కరణం డైలాగ్స్ అందిస్తున్నారు. జనవరి 13న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కానుంది. 

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.