2018 Movie Telugu Collections: 2018 మూవీ కాసుల వర్షం.. మొదటి రోజు కంటే రెండో రోజుకు భారీగా పెరిగిన వసూళ్లు
2018 Movie Telugu Collections: ప్రముఖ మలయాళ హీరో టోవినో థామస్ ప్రధాన పాత్రలో వచ్చిన చిత్రం 2018. ఈ మూవీని తెలుగులో గీతా ఆర్ట్స్ సంస్థ విడుదల చేసింది. తెలుగులో ఈ మూవీ కాసుల వర్షాన్ని కురిపిస్తోంది.
2018 Movie Telugu Collections: కంటెంట్ బేస్డ్ చిత్రాలను తెరకెక్కించడంలో మలయాళ ఇండస్ట్రీ ముందు వరుసలో ఉంటుంది. ఈ చిత్ర సీమ మార్కెట్ తక్కువగా ఉన్నప్పటికీ ఓటీటీల పుణ్యామాని అద్భుతమైన సినిమాలు వస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల విడుదలై 2018 మూవీకి కూడా సూపర్ రెస్పాన్స్ వచ్చింది. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించారు. కేరళలో ఈ మూవీ రూ.150 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది. ఈ శుక్రవారం తెలుగులో డబ్ అయిన ఈ చిత్రం అదిరిపోయే వసూళ్లతో దుమ్మురేపుతోంది. గీతా ఆర్ట్స్ ఈ మూవీని తెలుగులో విడుదల చేసింది. రెండో రోజుల్లోనే కాసుల వర్షాన్ని కురిపించింది ఈ చిత్రం. మొదటి రోజు కంటే కూడా రెండో రోజు వసూళ్లు భాగా పెరిగాయి.
మే 26న తెలుగులో విడుదలైన 2018 చిత్రానికి మొదటి రోజు రూ.1.02 కోట్ల గ్రాస్ వసూలైంది. దీంతో రెండో రోజు మరింత పుంజుకుంది ఈ మూవీ. ఏకంగా రూ.1.72 కోట్లను వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో అన్ని ఏరియాల్లోనూ డీసెంట్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. నైజాం ప్రాంతంలో రూ.1.15 కోట్ల గ్రాస్‌ను సొంతం చేసుకున్న ఈ చిత్రం సీడెడ్, ఆంధ్ర కలిపి రూ.1.60 కోట్లను వసూలు చేసింది. మొత్తంగా రెండు రోజుల్లో రూ.2.7 కోట్ల గ్రాస్, 1.20 కోట్ల షేర్‌ను వసూలు చేసింది.
ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ సాదించాలంటే రూ. 2 కోట్ల షేర్ వస్తే సరిపోతుంది. ఇప్పటికే రూ.1.28 కోట్ల షేర్‌ను రాబట్టిన 2018 చిత్రం మరో రూ.72 లక్షలను వసూలు చేసినట్లయితే సినిమా ఇక్కడ సూపర్ హిట్ జాబితాలో చేరిపోయింది. ఈ వీకెండ్‌లోనే ఈ మూవీ చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
2018 సంవత్సరంలో కేరళలో ఏర్పడ్డ వరదల ఆధారంగా ఈ చిత్రం రూపొందించారు. ఈ మూవీలో టోవినో థామస్ ప్రధాన పాత్ర పోషించగా.. ఇంద్రన్స్, కుంచాకో బోబన్, అపర్ణ బాలమురళి, వినీత్ శ్రీనివాసన్, ఆసిఫ్ అలీ, లాల్, నరేన్, తన్వి రామ్, శ్శివద, కలైయరసన్, అజు వర్గీస్, సిద్ధిక్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.
కావ్య ఫిల్మ్ కంపెనీ, పీకే ప్రైమ్ ప్రొడక్షన్ పతాకాలపై వేణు కున్నపల్లి, సీకే పద్మకుమార్, ఆంటో జోసెఫ్ నిర్మించారు. జూడ్ ఆంథనీ జోసెఫ్ మూవీకి దర్శకత్వం వహించారు. టోవినో థామస్ ప్రధాన పాత్రలో నటించిన ఈ మూవీలో కుంచాకో బోబన్, అసఫ్ అలీ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. మే 5న విడుదలైన ఈ మూవీ ఇప్పటి వరకు రూ.150 కోట్లతో వసూళ్ల వర్షాన్ని కురిపిస్తోంది. మే 26న తెలుగులో ఈ మూవీ విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది.