Telangana Election Exit Polls 2023 : ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ - తెలంగాణలో కాంగ్రెస్ దే అధికారం
India Today-Axis My India Exit Poll Results 2023: తెలంగాణలో పోలింగ్ ప్రక్రియ ముగియగా.. ఇప్పటికే పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వచ్చాయి. ఇందులో కాంగ్రెస్ వేవ్ ఉన్నట్లు కనిపించింది. అయితే ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను మాత్రం శుక్రవారం ప్రకటించింది. తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తున్నట్లు తెలిపింది.
Telangana Assembly Election Exit Polls 2023 : తెలంగాణలో గురువారం పోలింగ్ ప్రక్రియ ముగిసింది. డిసెంబర్ 3న ఫలితాలు రానున్నాయి. అయితే రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది..? కేసీఆర్ హ్యాట్రిక్ కొడతారా..? లేక కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందా లేక హంగ్ వస్తుందా అనే దానిపై జోరుగా విశ్లేణలు వినిపిస్తున్నాయి. అయితే గురువారం ప్రకటించిన ఎగ్జిట్ పోల్స్ లో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పాగా వేయనున్నట్లు తెలిపాయి. అధికార బీఆర్ఎస్ రెండో స్థానంలో ఉండే అవకాశం ఉందని అంచనా వేశాయి. అంతేకాకుండా పలు సంస్థలు వెల్లడించిన ఫలితాలు… రాష్ట్రంలో హంగ్ ను కూడా సూచించాయి.
India-Today Exit polls: ఇక తాజాగా తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా(India Today-Axis My India) ఎగ్జిట్ పోల్స్ ను ప్రకటించింది. వీరి ఎగ్జిట్ పోల్స్ ప్రకారం… తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాబోతుందని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ మెజార్టీ సీట్లతో సింగిల్ గానే అధికారంలోకి వస్తుందని తెలిపింది. కాంగ్రెస్ 63 - 73 సీట్లు వస్తాయని అంచనా వేయగా… బీఆర్ఎస్ 34 - 44 మధ్య సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని వెల్లడించింది. ఇక బీజేపీ పార్టీ నాలుగు నుంచి 8 సీట్లలో పాగా వేసే అవకాశం ఉందని వివరించింది. ఇక ఓటింగ్ శాతం చూస్తే… కాంగ్రెస్ పార్టీకి 42 శాతం ఓట్లు, బీఆర్ఎస్ కు 36 శాతం ఓటింగ్ రావొచ్చని అంచనా వేసింది.
సీట్ల వివరాలు:
BRS : 34 - 44
కాంగ్రెస్ :63- 73
బీజేపీ :4-8
ఇతరులు : 5- 8
ఓటింగ్ శాతం వివరాలు:
BRS : 36 శాతం
కాంగ్రెస్ : 42శాతం
బీజేపీ : 14 శాతం
ఎంఐఎం : 03 శాతం
ఇతరులు : 05 శాతం
ఇండియా టుడే - యాక్సిస్ మై ఇండియా ఎగ్జిట్ పోల్స్ ప్రకారం.. ఉత్తర తెలంగాణ, సెంట్రల్ తెలంగాణ, దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ మెజార్టీ సీట్లు సాధించనుంది. హైదరాబాద్ లో మాత్రం బీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా ఉందని పేర్కొంది. ఇక సామాజికవర్గాల వారిగా చూస్తే కూడా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం వర్గాల వారు కాంగ్రెస్ వైపు చూస్తున్నట్లు వివరించింది. ముఖ్యమంత్రిగా మాత్రం కేసీఆర్ వైపు ఎక్కువ శాతం మంది ప్రజలు మొగ్గు చూపగా.. ఆ తర్వాత స్థానంలో రేవంత్ రెడ్డి ఉన్నారు.
సంబంధిత కథనం