AP BJP Caste Politics: బీజేపీలో కాపు అభ్యర్థులకు చోటేది! నేతల నిరసన, పురంధేశ్వరిపై ఆగ్రహం
AP BJP Caste Politics: ఏపీ బీజేపీలో కాపు చిచ్చు రాజుకుంది. ఎన్డీఏ కూటమిలో బీజేపీకి కేటాయించిన స్థానాల్లో ఒక్క సీటును కూడా కాపులకు కేటాయించక పోవడాన్ని ఆ వర్గం తప్పు పడుతోంది.
AP BJP Caste Politics: ఏపీ బీజేపీ BJPలో టిక్కెట్ల కేటాయింపు రగడ ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు. ఏపీ బీజేపీ అధ్యక్షురాలు Purandeswari పురంధేశ్వరికి కాపు , బలిజ నేతలు ఘాటు లేఖ రాశారు.
ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి వైఖరిని తప్పు పడుతూ పార్టీలోని కొందరు కాపు Kapu, బలిజ Balija నాయకులు జాతీయ నాయకత్వానికి ఫిర్యాదు చేశారు. పొత్తులో బీజేపీకి కేటాయించిన సీట్లతో పాటు అభ్యర్థుల ఎంపికలో కాపు సామాజిక వర్గా నికి కనీస ప్రాధాన్యత దక్కలేదని, ఇందుకు రాష్ట్ర అధినాయకత్వ నిర్ణయాలే కారణమని ఆరోపిస్తున్నారు.
రాష్ట్ర బీజే పీ కార్యదర్శి, శ్రీకాళహస్తి నియోజకవర్గ కన్వీనర్ కోలా ఆనంద్ , పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తీరును తప్పు పడుతూ జాతీయ నాయకత్వానికి లేఖ రాశా రు. వాటిని సోషల్ మీడియాలో వైరల్ చేశారు.
ఏపీలో అభ్యర్థులు ఎంపికలో "కాపు సామాజిక వర్గానికి" కనీస ప్రాధాన్యత లేదని ఆరోపిస్తున్నారు. గతంలో బీజేపీ నాయకత్వం రాష్ట్రములో "కాపు సామాజిక" వర్గానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చారని, కాపుల్ని ఓట్లకు మాత్రమే పరిమితం చేయకుండా ఒక రాజకీయ ప్రత్యామ్నాయ శక్తిగా తీర్చిదిద్ది, కాపులను బీజేపీ ద్వారా అభివృద్ధి పథంలో నిలపాలని కొన్ని నిర్ణయాలు తీసుకుందని గుర్తు చేస్తున్నారు.
రాష్ట్ర విభజన తర్వాత రెండు పర్యాయాలు కాపు సామాజిక వర్గానికి చెందిన కన్నా లక్ష్మీ నారాయణ , సోము వీర్రాజులను రాష్ట్ర బిజెపి పార్టీ అధ్యక్షులుగా నియమించారని పురందేశ్వరి వచ్చిన తర్వాత పరిస్థితులు మారిపోయాయని ఆరోపిస్తున్నారు.
పొత్తులో బాగంగా ఏపీలో బీజేపీకి 6 ఎంపీ ,10 ఎమ్మెల్యే సీట్లను కేటాయించారని, ఏపీలో "కాపు సామాజిక" వర్గ నేతలకు 2024 సార్వత్రిక ఎన్నికలలో ఒక్క MLA & MP సీటు కూడా ఇవ్వకపోవడం విచారకరమని, ఇది ఎవరి తప్పని ప్రశ్నించారు. ఇప్పటికే సోము వీర్రాజు టిక్కెట్ దక్కకపోవడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు.
ఏపీలో కాపు, బలిజలు, ఉపకులాల జనాభా 23 శాతం ఉన్నారని శ్రీకాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గంలో 16 శాతం కాపు, బలిజ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లున్నా, శ్రీ కాళహస్తి అసెంబ్లీ నియోజకవర్గం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ సునాయాసంగా గెలిచే సీటు అయినా దానిని వదులుకున్నారని ఆరోపించారు.
ఢిల్లీ బీజేపీ పెద్దలు కాపుబలిజ సామాజిక వర్గాన్ని గుర్తించి శ్రీకాళహస్తి నియోజకవర్గానికి పొత్తుల్లో భాగంగా బీజేపీకి ఎమ్మెల్యే సీటు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కాపులకు జరుగుతున్న అన్యాయం పై ఇప్పటికైనా అధిష్టానం పెద్దలు దృష్టి సారించి రాష్ట్రంలో కాపు సామాజిక వర్గానికి ఉన్న నమ్మకాన్ని నిలబెట్టాలని కోలా ఆనంద్ డిమాండ్ చేశారు.
ఏపీలో నేటి నుంచి నామినేషన్ల పక్రియ ప్రారంభం కానుంది. మరోవైపు బీజేపీ పోటీ చేసే నియోజక వర్గాల్లో ప్రచారం ప్రారంభించింది. అసంతృప్తులు మాత్రం ఇంకా చల్లారలేదు. పురందేశ్వరి, చంద్రబాబు వ్యవహర శైలితో బీజేపీ నష్టపోతుందని, బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలో సభ్యులైన 9 మంది నాయకులు గతంలో బహిరంగ లేఖ రాశారు. తాజాగా మరో ఆశావహుడు లేఖ రాయడంతో పార్టీలోకలకలం రేగింది.
సంబంధిత కథనం