Minister Komatireddy : కేసీఆర్... మరోసారి అలా అంటే బీఆర్ఎస్ ను పునాదులతో సహా లేపేస్తాం - మంత్రి కోమటిరెడ్డి
Minister Komatireddy On BRS : కేసీఆర్ పై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు మంత్రి కోమటిరెడ్డి. తమ ప్రభుత్వం జోలికి వస్తే... బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తామని హెచ్చరించారు.
Minister Komatireddy Venkat Reddy : పార్లమెంట్ ఎన్నికల వేళ అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య డైలాగ్ వార్ నడుస్తోంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా…. కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది కూడా ఉంటుందో లేదో అంటూ కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి(Minister Komatireddy Venkat Reddy) ఫైర్ అయ్యారు. తమ ప్రభుత్వం జోలికి వస్తే... బీఆర్ఎస్ పార్టీని పునాదులతో సహా లేపేస్తామని హెచ్చరించారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కేసీఆర్ (KCR)కొనేందుకు చూస్తున్నారని ఆరోపించారు మంత్రి కోమటిరెడ్డి. తాము తలుచుకుంటే బీఆర్ఎస్ లో తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కూడా ఉండరని అన్నారు. నల్గొండలో మీడియాతో మాట్లాడిన ఆయన….. తమ ప్రభుత్వం జోలికి వస్తే హైదరాబాద్ లోని బీఆర్ఎస్ ఆఫీస్ పునాదులను లేపేస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ సర్కార్ ఉండదని మరోసారి కేసీఆర్ మాట్లాడితే… సహించేదే లేదన్నారు. ఇలాంటి వ్యాఖ్యలు కవిత(MLC Kavitha) జైలుకు వెళ్లినప్పటికీ కేసీఆర్ బుద్ధి మారలేదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎంపీలు తమ పార్టీలోకి సగం, బీజేపీ పార్టీలోకి సగం పోయారని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఎంపీ అభ్యర్థులే లేరన్నారు. అభ్యర్థులే లేని బీఆర్ఎస్ కు సీట్లు వస్తాయని… తమకేమో ఒకటి రెండు సీట్లు వస్తాయని చెప్పటం విడ్డూరంగా ఉందన్నారు. 30 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి వచ్చేందుకు రెడీగా ఉన్నారని కామెంట్స్ చేశారు.
తమ ప్రభుత్వం వచ్చిన కొద్దిరోజులకే ఎన్నికల కోడ్ వచ్చిందన్నారు మంత్రి కోమటిరెడ్డి. కోడ్ రాకపోతే దశలవారీగా రుణమాఫీ చేద్దామని నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కానీ ప్రభుత్వాన్ని విమర్శించటమే లక్ష్యంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో తీవ్రమైన అవినీతి చేసిన కేసీఆర్… తెలంగాణ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
నల్గొండ పర్యటనలో భాగంగా ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో ఉన్న మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని పరిశీలించారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. వివిధ సమస్యలపై సిబ్బందితో మాట్లాడి తగిన సూచనలు చేశాను. పేషెంట్లు, వారి అటెండెంట్ల కోసం సకల సౌకర్యాలతో అందరికి అనువుగా ఉండేలా భవన నిర్మాణం చేయాలని అధికారులను ఆదేశించారు. వైద్య ఆరోగ్యశాఖ, ఆర్అండ్ బీ అధికారులకు అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి…. వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం శ్రీరామనవమి సందర్బంగా.. నల్గొండ పట్టణంలోని రామగిరి శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో జరిగిన కళ్యాణోత్సవం కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు చెప్పారు.