BRS to Congress : ఆదిలాబాద్ జిల్లాలో 'కారు' దిగిపోతున్న నేతలు - రంగం సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి!-many leaders from adilabad are leaving the brs party ,ఎన్నికలు న్యూస్
తెలుగు న్యూస్  /  ఎన్నికలు  /  Brs To Congress : ఆదిలాబాద్ జిల్లాలో 'కారు' దిగిపోతున్న నేతలు - రంగం సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి!

BRS to Congress : ఆదిలాబాద్ జిల్లాలో 'కారు' దిగిపోతున్న నేతలు - రంగం సిద్ధం చేసుకున్న మాజీ మంత్రి!

HT Telugu Desk HT Telugu
Mar 22, 2024 03:05 PM IST

Lok Sabha Elections in Telangana 2024: పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో రాజకీయ సమీకరణాలు మారిపోతున్నాయి. ప్రతిపక్ష బీఆర్ఎస్ నుంచి నేతలు ఒక్కొక్కరిగా బయటికి వెళ్లిపోతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా నుంచి కాంగ్రెస్ లోకి వలసలు కొనసాగుతున్నాయి.

ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి
ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి

Adilabad Politics: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో భారాస ప్రజాప్రతినిధులు, నాయకులు ఒక్కొక్కరు 'కారు' దిగుతుండటంతో ఆ ప్రభావం ఉమ్మడి ఆదిలాబాద్(Adilabad) వ్యాప్తంగా కొనసాగేలా కనిపిస్తోంది. ఇప్పటికే మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కాంగ్రెస్ తో సంప్రందిపులు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇక ముథోల్ మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి హస్తం కండువా కప్పేసుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM revanth reddy) సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారు. విట్టల్కాం రెడ్డీ కాంగ్రెస్ లోనే రాజకీయ అరంగ్రేటం చేసిన ఆయన రెండుసార్లు ఎమ్మెల్యేగా, రెండు పర్యాయాలు భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. 2004 నుంచి కాంగ్రెస్లో కొనసాగు తున్నారు. ఆ సమయంలో భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. 2009లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో ముథోల్ కాంగ్రెస్ టికెట్ కార్య ఆశించినప్పటికీ అప్పట్లో హస్తం పార్టీ అధిష్టానం ఆయనకు టికెట్ ఇవ్వడానికి నిరాకరించడంతో ప్రజారాజ్యం పార్టీ నుంచి పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందారు. ఆతర్వాత ప్రజా రాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో మరోసారి భైంసా మార్కెట్ కమిటీ చైర్మన్ గా పని చేశారు. 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. రాజకీయ పరిణామాల నేపథ్యంలో గులాబీ తీర్థము పుచ్చుకున్నారు. తిరిగి 2018లో జరిగిన ఎన్నికలలో పోటీ చేసి విజయం సాధించారు, గత ఏడాది జరిగిన ఎన్నికలలో బీ ఆర్ ఎస్ నుండి పోటీ చేసి ఓటమి పాలయినారు.

రానున్న సంస్థగత ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని....

నాలుగైదు రోజుల్లోనే వీరితోపాటు మరికొంతమంది ముఖ్య నేతలు భారాసను వీడి హస్తం పార్టీలో చేరడానికి సన్నాహాలు చేసుకుం టున్నట్లు సమాచారం. కొంతమంది భారాస కౌన్సిలర్లు, మాజీ కౌన్సిలర్లతోపాటు ఇతర ముఖ్యనేతలు మాజీ మంత్రి ద్వారానే భారాసను వీడుదామని అనుకున్నా ఆయన తన అంతరం గాన్ని బయట పెట్టకపోవడంతో ఇక ఆలస్యం చేయకుండా వారు కాంగ్రెస్లో చేరాలని నిర్ణ యించుకున్నారు. ఈ మేరకు ఇద్దరు భారాస కౌన్సిలర్లు పార్టీకి రాజీనామా చేయగా.. మరికొందరు పార్టీని రాజకీయ భవిష్యత్తు బాగుండాలని.. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం, జిల్లాలోని మూడు నియోజకవర్గా ల్లోనూ భారాస ఎమ్మెల్యేలు ఓడిపోవడంతో రాజకీయంగా రానున్న రోజుల్లో తమకు మద్దతు ఉండే అవకాశం లేక ఆ పార్టీని వీడేం దుకు ప్రజాప్రతినిధులు, నాయకులు సిద్ధమవుతున్నారు, కాంగ్రెస్, భాజపా బలోపేతం అవుతుండటంతో తమ రాజకీయ భవిష్యత్తు బాగుండాలన్న ఉద్దే శంతోనే ఒక్కొక్కరు 'కారు' దిగేందుకు సిద్ధమై నట్లు తెలిసింది. పార్లమెంటు ఎన్నికలు పూర్త యిన తర్వాత సర్పంచులు, ఎంపీటీసీ, జడ్పీ టీసీ సభ్యుల ఎన్నికలు, మున్సిపల్ పాలకవర్గ గడువు ముగిసిపో తుండటంతో స్థానికంగా బలంగా ఉండటానికి రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం పార్టీలో కొంతమంది చేరుతుండగా.. స్థానికంగా భాజపా బలం ఉన్న ప్రాంతాల్లో ఆ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికేఉమ్మడి ఆదిలాబాద్ లోని పలు మండలాల్లోని పలువురు భారాస నాయకులు కాంగ్రెస్లో చేరారు. ప్రస్తుతం భారాసను వీడిన, ఒక ట్రెండు రోజుల్లో వీడనున్న వారంతా డీసీసీ అధ్యక్షుల సమక్షంలో హస్తం పార్టీలో చేరనున్నారు.

నేడో రేపో మాజీ మంత్రి అల్లోల?

కాంగ్రెస్ పార్టీలోకి మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి చేరుతున్న ప్రచారం కొనసాగుతూనే ఉంది, ఆయనను పార్టీలో చేర్చుకోవద్దని స్థానిక కాంగ్రెస్ పార్టీ కేడర్ నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తిమవుతుంది, ఈ మేరకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు శ్రీహరి రావు ఇంటి వద్దకు భారీ ఎత్తున కార్యకర్తలు చేరుకొని మెమోరండం సమర్పించారు , జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సీతక్కకు సైతం కాంగ్రెస్ నేతలు వినతిపత్రం అందజేశారు, ఈ మేరకు అల్లోల తన అనుచరుడు విట్టల్ రెడ్డిని మొదట రేవంత్ రెడ్డి సమక్షంలో హస్తం గూటికి చేర్చారు, అనంతరం నిర్మల్ లో భారీ ఎత్తున కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేసుకొని రేవంత్ సమక్షంలో పార్టీలో చేరేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో ఉమ్మడి ఆదిలాబాద్ లో మంచి పలుకుబడి ఉన్న నాయకులు కోనప్ప, విట్టల్ రెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, తదితరులు కాంగ్రెస్ పార్టీలోకి చేరుతుండడంతో కారు ఖాళీ అయిపోయాయే ప్రమాదం నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్ లో ఖానాపూర్ నియోజకవర్గం లో కేటీఆర్ సన్నిహితుడు భూక్య జాన్సన్ నాయక్, అదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న లు కారు పార్టీలో కొనసాగుతున్నారు.

రిపోర్టింగ్ : వేణుగోపాల్ కామోజీ, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రతినిధి.

WhatsApp channel