AP Costly Elections: ఖరీదైన వ్యవహారంగా ఏపీ ఎన్నికలు.. కనీస ఖర్చు రూ.50కోట్లుగా అంచనా
AP Costly Elections: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయాయి. ప్రధాన ఎన్నికల కమిషనర్ సైతం దక్షిణాది రాష్ట్రాల్లో ధన ప్రవాహానికి కట్టడి చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తామని ప్రకటించడం పరిస్థితికి అద్దం పడుతోంది.
AP Costly Elections: ఆంధ్ర ప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలంటే అత్యంత ఖరీదైన వ్యవహారంగా మారిపోయింది. ఐదేళ్లకోసారి జరిగే ఎన్నికల్లో అభ్యర్థుల గెలుపొటముల్ని ఎన్నికల్లో చేసే ఖర్చు Election Expenditure తీవ్రంగా ప్రభావితం చేస్తోంది. కనీసం రూ.50కోట్లు 50Crores అభ్యర్ధి దగ్గర లేకపోతే ఎన్నికల పోటీ చేయడం వృధా అని పరిస్థితి ఏపీలో ఉంది. పార్లమెంటు అభ్యర్థిగా పోటీ చేయాలంటే కనీసం రూ.100-150కోట్లను ఖర్చు పెట్టగలిగే స్థితిలో ఉంటే తప్ప బరిలో దిగడం అనవసరమని ప్రధాన పార్టీలు భావిస్తున్నాయి.
తాజా ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో Andhra pradesh నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. ప్రధాన పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక దాదాపు కొలిక్కి వచ్చింది. అధికార వైసీపీ 175 నియోజక వర్గాల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు 25 పార్లమెంటు నియోజక వర్గాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. టీడీపీ కూడా రెండు విడతల్లో అభ్యర్థుల్ని ఖరారు చేసింది.
దేశ వ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్ గత వారం విడుదలైంది. ఆంధ్రప్రదేశ్‌లో నాలుగో విడతలో ఎన్నికలు జరుగనున్నాయి. షెడ్యూల్ విడుదలైనప్పటి నుంచి పోలింగ్ Polling జరగడానికి దాదాపు 50రోజులకు పైగా గడువు ఉంది. 2019లో నెల రోజుల వ్యవధిలోనే ఎన్నికల ప్రక్రియ మొత్తం ముగిసిపోయింది. ఎన్నికల ఫలితాలు ఆలస్యంగా వెలువడిన నెలరోజుల్లోనే పోలింగ్ ముగియడంతో అన్ని పార్టీల అభ్యర్థులు తక్కువ ఖర్చుతో బయటపడ్డారు.
2019లో మార్చి 10వ తేదీన షెడ్యూల్ Schedule విడుదలైంది. ఏపీ అసెంబ్లీతో పాటు లోక్‌సభ ఎన్నికలకు మార్చి 18వ తేదీన నోటిఫికేషన్ విడుదలైంది. మార్చి 25 వరకు నామినేషన్లు స్వీకరించారు. 26న నామినేషన్ల స్క్రూటినీ 28వ వరకు ఉపసంహరణ, ఏప్రిల్ 11న పోలింగ్ నిర్వహించారు. మే 23వ తేదీన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.
పెరిగిన ఎన్నికల వ్యయం….
రూరల్, అర్బన్ నియోజక వర్గాలనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల్లో ఎన్నికల వ్యయం గణనీయంగా పెరిగింది. ఎన్నికల ర్యాలీలకు జన సమీకరణకు భారీగా ఖర్చు పెట్టాల్సి ఉంటంతో నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే వరకు వేచి చూద్దామనే ధోరణిలో చాలా పార్టీల అభ్యర్థులు ఉన్నారు. ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎన్నికల ఖర్చును తలచుకుని బెంబేలెత్తి పోతున్నారు.
ఒక్కో మనిషికి సగటున రోజుకు వెయ్యి రుపాయల ఖర్చు చేయాల్సి వస్తుంది. మహిళలకు భోజనం, జెండాలు మోసినందుకు కనీస కూలీగా రూ.800 లేకపోతే నాయకుల వెంట నడిచేందుకు ఎవరు ఆసక్తి చూపడం లేదు. పురుషులైతే వెయ్యి రుపాయల కూలీ, బిర్యానీ మందు వంటి డిమాండ్లను నెరవేర్చాల్సి వస్తోంది.
ఎన్నికల్లో డబ్బు పంపిణీ కూడా అనివార్యం మారిపోయింది. ప్రధాన పార్టీలు గెలుపు కోసం పోటీ పడి డబ్బు చెల్లించాల్సి వస్తోంది. డబ్బు పంపిణీలో ఏమాత్రం వెనుకబడిన గెలుపుపై ఆశలు వదులకోవాల్సి వస్తోంది. కనీస ఎన్నికల వ్యయం రూ.50కోట్లు ఉంటే పట్టణ ప్రాంతాలు, ముఖ్యమైన నియోజక వర్గాల్లో ఈ ఖర్చు రూ.70కోట్లకు చేరువలో ఉంటోంది. ఏపీ, టీడీపీలు రెండు అధికారంలోకి రావడమే లక్ష‌్యంగా అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి.
సగటున ప్రతి నియోజక వర్గంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు ఇద్దరు రూ.100 నుంచి 150 కోట్లు ఖర్చు చేయడం తప్పనిసరిగా మారింది. మొత్తం 175 నియోజక వర్గాల్లో రిజర్వుడు నియోజక వర్గాల్లో ఈ ఖర్చు కాస్త తక్కువగా ఉన్నా మిగిలిన చోట్ల మాత్రం గెలుపుకు ఆస్తులు అమ్ముకోవాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి.
రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రుపాయల ఎన్నికలు ముగిసేనాటికి ఖర్చు అవుతాయని పార్టీలు అంచనా వేస్తున్నాయి. మ్యానిఫెస్టోలు,సంక్షేమ పథకాలు, ఎన్నికల ప్రచారాలతో పాటు ఎన్నికల్లో చేసే ఖర్చు కూడా అభ్యరధి గెలుపును నిర్ణయిస్తుందనే భావనలో పార్టీలు ఉన్నాయి. ప్రచార ఖర్చుతో పాటు ఓట్ల కొనుగోలు కూడా అనివార్యమని భావిస్తున్నాయి.
ఈ దఫా ఎన్నికల్లో గెలిచిన వారు, ఓడిపోయే వారికి అప్పులు మాత్రం తప్పవని అంచనా వేస్తున్నారు. ప్రధాన పార్టీలు ఎన్నికల వ్యయానికి మానసికంగా సిద్ధమైన వారినే ఎంపిక చేస్తున్నాయి. గెలిచే అభ్యర్థులు తర్వాత చేసిన ఖర్చును వెనుక్కి రాబట్టుకునే అవకాశాలు ఉన్నా, ఓడిపోయే వారు ఆరిపోవాల్సిందేనని అంచనా వేస్తున్నారు.