Kadiyam Srihari: అందరిని వదిలేసి నా ఒక్కడిపైనే విమర్శలెందుకన్న కడియం శ్రీహరి, ఆరోపణలు నిరూపించాలని పల్లాకు సవాల్…
Kadiyam Srihari: రాజకీయాల్లో ఎంతోమంది పార్టీలు మారుతున్నా తన ఒక్కడినే బీఆర్‌ఎస్ పార్టీ ఎందుకు టార్గెట్ చేసుకుందని కడియం శ్రీహరి ప్రశ్నించారు. పల్లా రాజేశ్వరరావు చేసిన ఆరోపణల్ని నిరూపించాలని సవాలు చేశారు.
Kadiyam Srihari: ఎన్నికల్లో పార్టీ ఓటమి నేపథ్యంలో ప్రజలకు ఇచ్చిన మాటను నిలబెట్టుకోలేననే ఆవేదన తనలో ఉందని కడియం శ్రీహరి చెప్పారు. BRS పార్టీ మారడంపై వివరణ ఇచ్చిన శ్రీహరి తన ఒక్కడినే ఎందుకు టార్గెట్ చేసి దూషిస్తున్నారని ప్రశ్నించారు.
నియోజక వర్గంలో 100 పడకల ఆస్పత్రి రాలేదని, సిర్పూర్, వేలేరు కొత్త మండలాలకు భవనాలు లేవని, ఘన్‌పూర్‌ను మునిసిపాలిటీ చేయాలని, డిగ్రీ కాలేజీ లేదని, రోడ్లు, సాగునీరు, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉన్నాయని వీటి కోసమే అధికార పార్టీలోకి వెళ్లినట్టు కడియం చెప్పారు.
బీజేపీ దళిత వ్యతిరేక ధోరణి, తెలంగాణ వ్యతిరేక ధోరణి కూడా కాంగ్రెస్‌లో చేరడానికి కారణమైందన్నారు. బీఆర్‌ఎస్‌ను వీడటం బాధగా ఉందని, కేసీఆర్ తనకు అవకాశాలు ఇచ్చారని, ఆ అవకాశాలను సద్వినియోగం చేశానే తప్ప దుర్వినియోగం చేయలేదన్నారు.
కేసీఆర్ మీద ఎలాంటి విమర్శలు చేయనని కడియం చెప్పారు. చాలా మంది పార్టీలు మారుతున్నారని, తాను చెప్పే కారణాలు కొందరికి నచ్చవచ్చు, నచ్చకపోవచ్చన్నారు. పార్టీలు మారినా ఎవరిపైనా బీఆర్‌ఎస్ స్పందించలేదని, తన మీద మాత్రం జిల్లా నాయకత్వం తీవ్ర స్థాయిలో మాట్లాడుతున్నారని, ఈర్ష్య ద్వేషాలు వారి మాటల్లో కనిపిస్తున్నాయని, నిన్నటి వరకు వారితోనే ఉన్నానని, సంస్కారం సభ్యత లేకుండా మాట్లాడుతున్నారని ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ ఆహ్వానం మేరకు ఏఐసీసీ, పిసిసి పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టులో చేరినట్టు చెప్పారు. కాంగ్రెస్ పార్టీలో వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి గా పోటీ చేయడానికి అవకాశం కల్పించినందుకు కాంగ్రెస్ పార్టీ అధినేతలకు కృతజ్ఞతలు తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ లో చెరడానికి అనేక కారణాలు ఉన్నాయని, గత పదేళ్ళుగా బీజేపీ ప్రజా స్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని, ప్రజా స్వామ్యంగా ఏర్పడిన ప్రభుత్వాలను సిబిఐ, ఈడీ కేసులను ఉపయోగించుకొని కూలదొస్తుందని ఆరోపించారు. ప్రతిపక్షంలోని వ్యక్తి పై సిబిఐ కేసు ఉంటే బీజేపీ లో చేరగానే పోతాయన్నారు.
డబుల్ ఇంజన్ ఉన్న రాష్ట్ర లలో దళితులు, ముస్లిం వర్గాల పై దాడులు జరుగుతున్నాయని, మణిపూర్ సంఘటన ఒక ఉదాహరణ అన్నారు. ఎన్నికలలో 400 మంది గెలిస్తే రాజ్యాంగాన్ని ఎత్తివేస్తా అని, రిజర్వేషన్ లు ఎత్తి వేస్తాం అంటున్నారని, భారత లౌకిక వాదాన్ని కాపాడాలన్నా దళితులు, ముస్లిమ్స్ సమాజం పై బీజేపీ అక్రత్యాలను అడ్డుకోవాల్సి ఉందన్నారు.
బీజేపీను అడ్డుకునే శక్తి ఒక కాంగ్రెస్ పార్టీ కే ఉందన్నారు. అంబేద్కర్ వాదిగా రిజర్వేషన్ లు పది కాలలు పాటు ఉండాలని కాంగ్రెస్ పార్టులో చేరినట్టు చెప్పారు. నిన్నటివరకు వారితోనే ఉన్నానని వారిలా దిగజారి మాట్లాడనన్నారు.
తనపై పల్లా చేసిన ఆరోపణలు నిరూపించకపోతే జనగామ చౌరస్తాలో బట్టలిప్పి నిలబెడతామన్నారు. పార్టీ నుండి డబ్బులు తెచ్చుకున్నానని దుష్ప్రచారం చేస్తున్నారని నిరూపిస్తే రాజకీయాలనుండి తప్పుకుంటానన్నారు.
మంద కృష్ణ మాదిగ Manda Krishna వ్యక్తి గత విమర్శలు చేస్తున్నాడని, ప్రతి సందర్బంలో దండోరా ఉద్యమంలో తాను కూడా ఉన్నానని చెప్పారు. రాజ్యాంగ ఫలాలు అందరికి అందాలని కోరుకుంటా అన్నారు. మందకృష్ణ నేరుగా బీజేపీలో చేరాలన్నారు.2014లో వర్దన్నపేట నుండి నాకు లక్ష ముప్పై వేల ఓట్లు వస్తే ఈ నాయకుడికి 18000వేల ఓట్లు వచ్చాయని ఎద్దేవా చేశారు.
తప్పుడు విధానాలతో ప్రతి ఎన్నికలలో ఎదో ఒక పార్టీకి సపోర్ట్ ప్రకటించడం వలన ఎమ్మార్పిఎస్ MRPS పది ముక్కలయ్యిందని ఆరోపించారు. మాదిగ ఉపకులాలకు సపోర్ట్ చేస్తా అన్నాడని, తాను కూడా ఉపకులమేనన్నారు. కలసి వచ్చిన అవకాశాలను, అందిపుచ్చుకొని ప్రజలకు ఉపయోగపడుతున్నానని చెప్పారు. రాజకీయంగా ఇది చివరి ఎన్నికలని, రాజకీయాలలో నీతిగా నిజాయితీ గా ఉంటానని చెప్పారు. నిండు మనస్సుతో loksabha ఎన్నికల్లో డాక్టర్ కడియం కావ్యను ప్రజలు దీవించాలని విజ్ఞప్తి చేశారు.
సంబంధిత కథనం