Warangal Congress Candidate : వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య, కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు
Warangal Congress Candidate : వరంగల్ లోక్ సభ అభ్యర్థిగా కడియం కావ్య పేరును కాంగ్రెస్ అధిష్ఠానం ఖరారు చేసింది. సోమవారం సాయంత్రం విడుదల చేసిన జాబితాలో ఆమె పేరు ఉంది.
Warangal Congress Candidate : కాంగ్రెస్ అధిష్ఠానం తెలంగాణలో మరో లోక్ సభ స్థానానికి (Lok Sabha Candidate)అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్ లోక్ సభ స్థానానికి కడియం కావ్య(Kadiyam Kavya) పేరు ఖరారు చేసింది. ఇటీవలె కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు కాంగ్రెస్ అధిష్ఠానం సీటు ఖరారు చేసింది. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఆయన కుమార్తె ఇటీవలె బీఆర్ఎస్ ను వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ (Congres list)తాజా జాబితాలో తెలంగాణతో పాటు మహారాష్ట్రలో అకోలా లోక్ సభ స్థానానికి డా. అభయ్ కాశీనాథ్ పాటిల్ పేరును ఖరారు చేసింది.
కడియం కావ్య అప్పుడు బీఆర్ఎస్, ఇప్పుడు కాంగ్రెస్ లో రెండు చోట్ల సీటు సంపాందించిన నేత. బీఆర్ఎస్ పార్టీ కడియం కావ్యకు వరంగల్ సీటు ఖరారు చేశారు. అయితే ఆమె బీఆర్ఎస్ కు షాక్ ఇచ్చారు. బీఆర్ఎస్ అభ్యర్థిగా తాను తప్పుకుంటున్నట్లు లేఖ రాసి, ఆ వెంటనే తన తండ్రి స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ చేరారు. ఇలా కాంగ్రెస్ చేరిన ఆమెకు అలా కాంగ్రెస్ అధిష్టానం టికెట్ కేటాయించింది.
బీఆర్ఎస్ కు షాకిచ్చి కాంగ్రెస్ చేరి
బీఆర్ఎస్ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం కావ్యను(Kadiyam Kavya) మార్చి 13వ తేదీన ప్రకటించింది. ఆ తరువాత పార్టీ నేతలు, కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న డాక్టర్ కడియం కావ్య.. ఇటీవలే బీఆర్ఎస్ అధినేత కేసీఆర్(KCR) ను కూడా కలిశారు. ఇంతలోనే రాజకీయ సమీకరణాలను పరిగణనలోకి తీసుకున్న ఆమె తన నిర్ణయాన్ని మార్చుకున్నారు. అభ్యర్థిగా ప్రకటించిన సరిగ్గా 15 రోజులకు 28వ తేదీన సాయంత్రం తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ఓ లేఖ విడుదల చేశారు. కాగా ఈ హఠాత్పరిణామంతో వరంగల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో గందరగోళం చెలరేగింది. ప్రస్తుతం కాంగ్రెస్ లో చేరటంతో ఆమెకు వరంగల్ ఎంపీ టికెట్(Warangal MP Ticket) దక్కింది.
కాంగ్రెస్ అధిష్టానం ఇటీవల లోక్ సభ అభ్యర్థుల జాబితాలో తెలంగాణ నుంచి నాలుగు ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఇప్పటి వరకూ తెలంగాణలో 14 స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది కాంగ్రెస్. ఇక ఖమ్మం, హైదరాబాద్, కరీంనగర్ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయాల్సి ఉంది.
కాంగ్రెస్ లోక్ సభ అభ్యర్థులు(Congress Loksabha Candidates)
- పెద్దపల్లి - గడ్డం వంశీకృష్ణ
- మల్కాజ్ గిరి - సునీతా మహేందర్ రెడ్డి
- సికింద్రాబాద్ - దానం నాగేందర్
- చేవెళ్ల - డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి
- నాగర్ కర్నూల్ - డాక్టర్ మల్లు రవి
- నల్గొండ- రఘువీర్ రెడ్డి
- జహీరాబాద్ -సురేశ్ షెట్కర్
- మహబూబాబాద్(ఎస్టీ)-బలరామ్ నాయక్
- మహబూబ్ నగర్- వంశీ చందర్ రెడ్డి
- ఆదిలాబాద్(ST)- ఆత్రం సుగుణ
- నిజామాబాద్-తాటిపర్తి జీవన్ రెడ్డి
- మెదక్-నీలం మధు
- భువనగిరి-చామల కిరణ్ కుమార్ రెడ్డి
- వరంగల్ -కడియం కావ్య
సంబంధిత కథనం