Loksabha Elections 2024 : బీజేపికి పడే ఓట్లు ఎవరివి..? ఈ 2 సెగ్మెంట్లలో క్రాస్ ఓటింగ్ టెన్షన్..!
Medak Zaheerabad Loksabha Seats 2024: మెదక్, జహీరాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్లలో త్రిముఖ పోటీ నెలకొంది. బీజేపీకి భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో… బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు క్రాస్ ఓటింగ్ టెన్షన్ పట్టుకుంది.
Loksabha Elections in Telangana 2024: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ఉన్న, మెదక్, జహీరాబాద్ లోక్ సభ నియోజకవర్గాలలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ లకు క్రాస్ వోటింగ్ భయం పట్టుకుంది. ఈ రెండు నియోజకవర్గాల్లో ఉన్న 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీజేపీకి కామారెడ్డి అసెంబ్లీ సీటు దక్కిన సంగతి తెలిసిందే.
మిగతా 13 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఒక్క దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో తప్పా… ఎక్కడ కూడా బీజేపీకి రెండోస్థానంలో రాలేదు. కట్ చేస్తే జహీరాబాద్ , మెదక్ లోక్ సభ స్థానాల్లో మాత్రం ప్రత్యర్థులకు గట్టి పోటీనిస్తుంది. మె
మెదక్ లోక్ సభ పరిధిలో… బీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధి పి పెంకట్రామి రెడ్డికి రఘునందన్ రావు గట్టి పోటీనిస్తున్నారు. ఇక్కడ హోరాహోరీ తప్పేలా లేదు. మరోవైపు విజయం నీలం మధు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు.
ధీటుగా పోటీ ఇస్తున్న బీజేపీ….
కాంగ్రెస్, బీఆర్ఎస్ తో పోల్చుకుంటే…. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సెగ్మెంట్లలో పెద్దగా ప్రభావం చూపలేదు. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం గట్టిగా క్యాంపెయినింగ్ చేస్తుంది.
మోదీ మ్యానియాతో పాటు రామ మందిరం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్తోంది. దీంతో ఈసారి బీజేపీకి భారీగా ఓట్లు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల ఓట్లను కూడా భారీగా చీల్చే ఛాన్స్ ఉందన్న లెక్కలు తెరపైకి వస్తున్నాయి. ఇదే విషయాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నేతలు కూడా అంగీకరిస్తున్నారు.
లోక్ సభ ఎన్నికలను బీఆర్ఎస్ సీరియస్ గా తీసుకోవటం లేదని వారి ఓట్లు బీజేపీకి క్రాస్ అవుతాయని కాంగ్రెస్ ఆరోపిస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పై ఇదే తరహాలో బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. దీంతో ఎవరి ఓట్లు చీలి ఎవరికి లబ్ధి చేకూరబోతుందనేది ఆసక్తికరంగా మారింది.
జహీరాబాద్ లోనూ ఇదే పరిస్థితి…!
మరోవైపు జహీరాబాద్ లోక్ సభ పరిధిలో కూడా పరిస్థితి కొద్దిగా అటు ఇటుగా మెదక్ మాదిరిగానే ఉంది. ఇక్కడ బీజేపీ నుండి పోటీచేస్తున్నబీబీ పాటిల్ కూడా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీనిస్తున్నారు.
గత ఎన్నికల్లో బీజేపీకి అందోల్ లో 6 వేలు, నారాయణఖేడ్ లో 7 వేలు, జహీరాబాద్ 13 వేల ఓట్లు మాత్రమే పడ్డాయి. కానీ ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఆయా నియోజకవర్గాల్లో భారీగా బీజేపీకి ఓట్లు వచ్చే అవకాశం ఉందన్న చర్చ వినిపిస్తోంది. ఇక్కడ కూడా క్రాస్ ఓటింగ్ జరిగే అవకాశం ఉంది. అయితే ఎవరి ఓట్లు చీలుతాయనేది ఇక్కడ ప్రశ్నగా మారింది. అయితే క్రాస్ ఓటింగ్ జరగకుండా ఇరు పార్టీల నేతలు….. ప్రయత్నాలు షురూ చేశారు.
సంబంధిత కథనం